వివాదాలతో తరచూ వార్తల్లో నిలిచే సినీ నటి డింపుల్ హయతి (Dimple Hayathi), తాజాగా మరోసారి చర్చనీయాంశంగా మారారు.డింపుల్ హయాతి ఇటీవల షేక్‌పేటలోని వంశీరామ్ వెస్ట్ వుడ్స్ అపార్ట్ మెంట్ కు షిఫ్ట్ అయ్యిందని సమాచారం. అక్కడ ఆమె తన పెంపుడు కుక్కల సంరక్షణ కోసం ఇద్దరు యువతులను స్టాఫ్‌గా నియమించుకుందట.
Rhea Chakraborty: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో రియా చక్రవర్తికి ఊరట
అయితే వారిని ఆమె సరిగ్గా చూసుకోకుండా మానసికంగా, శారీరకంగా హింసించినట్టు ఆ యువతులను ఉద్యోగానికి పంపిన మహిళ సోషల్ మీడియా (Social media) లో ఒక వీడియో షేర్ చేసింది. అందులో హీరోయిన్ డింపుల్ హయతీ, ఆమె కుటుంబ సభ్యులు ఒడిశా యువతలను అవమానించారని, మానసికంగా వేధించారని సదరు మహిళ ఆరోపించింది.

పని చేయించుకొని డబ్బులు ఇవ్వకుండా తన భర్తతో తిట్టించారంటూ ఆ అమ్మాయిలకు పని కుదిర్చిన ఓ మహిళ ఆరోపించింది. ‘మీరు నా చెప్పులంత వాల్యూ చేయరు.. మీరు ఎంత? మీ బ్రతుకెంత?’ అంటూ సదరు అమ్మాయిలతో డింపుల్ భర్త దురుసుగా ప్రవర్తించారట.
జీతం కూడా ఇవ్వకుండా ఇంట్లో నంచి వెళ్లగొట్టడమే కాకుండా.. ‘మా ఆయన లాయర్ మీరు నన్ను ఏమీ పీకలేరు’ అంటూ డింపుల్ హయాతి కూడా ఒడిశా అమ్మాయిలపై (Odisha girls) ఫైర్ అయిందని ఆ మహిళ పేర్కొంది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
గతంలోనూ ఓ ఐపీఎస్ అధికారితో గొడవపడి డింపుల్ హయతి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ తాజా ఘటనతో ఆమె చిక్కుల్లో పడ్డారు. పనిమనిషి ఇచ్చిన ఫిర్యాదు మేరకు డింపుల్ హయతితో పాటు ఆమె భర్తపైనా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ ఆరోపణలపై డింపుల్ హయతి వైపు నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: