కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు అగ్నిప్రమాదం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఈ దుర్ఘటనలో అనేక మంది ప్రయాణికులు ప్రాణాలను కోల్పోయారు.ఘటనపై నటి రష్మిక మందన్న (Rashmika Mandanna) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Thamma Movie: థామా మూవీ మ్యూజిక్ డైరెక్టర్ అరెస్ట్.. కారణం ఏంటంటే?
ప్రయాణికులు పడిన వేదనను తలచుకుంటేనే భయమేస్తోందని ఆమె సోషల్ మీడియా (Social media) లో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కాలిపోయే ముందు ఆ బస్సు లోపల ప్రయాణికులు ఎదుర్కొన్న బాధను ఊహించడానికి కూడా భయంగా ఉంది.
ఇది నిజంగా భయంకరం” అని తన పోస్టులో పేర్కొన్నారు.ఈ కష్టకాలంలో మృతుల కుటుంబాలకు తన ఆలోచనలు, ప్రార్థనలు ఎల్లప్పుడూ ఉంటాయని రష్మిక తెలిపారు. “ఈ దుర్ఘటనలో మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలి” అని ఆమె పేర్కొంటూ మృతులకు నివాళులర్పించారు. కాగా, బస్సులో 46 మంది ప్రయాణికులు ఉండగా, చాలామంది గాఢ నిద్రలో ఉన్న సమయంలోనే ఈ ఘోరం జరిగింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: