Breaking News ఈమధ్య కాలంలో బస్సు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. గతవారంలో చేవేళ్లలో బస్సు, లారీ ఢీకొన్న ప్రమాదంలో 24 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. గతమాసంలో కర్నూలు(Kurnool) సమీపంలో కావేరీ బస్సు(Kaveri Bus) బైక్ కు ఢీకొని దూసుకెళ్లడంతో బస్సు మంటల్లో చిక్కుకునిపోయింది. ఈ దుర్ఘటనలో 19మంది ప్రయాణికులు మంటలకు ఆహుతి అయ్యారు.
పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వాహనాన్ని నడిపే డ్రైవర్లు అతివేగం, నిర్లక్ష్యం, నిద్రమత్తు, తాగి వాహనాలు నడపడం వంటి వల్లే అధికంగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మితిమీరి వేగంతో ముందు వాహనాలను ఓవర్ టేక్ చేయడం, మద్యం మత్తులో వాహనాలను నడపడంతో రోడ్లు రక్తసిక్తమవుతున్నాయి. తాజాగా దక్షిణ పెరూలోని అరెక్విసాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Read Also: AP: వేగవంతంగా రూప్ టాప్ సోలార్ అమలు

క్షణాల్లో లోయలోపడ్డ బస్సు
దక్షిణ పెరూలోని అరెక్విసా ప్రాంతంలో బస్సు ప్రమాద ఘటన చోటు చేసుకుంది. లోయలో బస్సు పడిపోవడంతో 37మంది స్పాట్ లోనే దుర్మరణం చెందారు. పలువురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.
వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే బస్సు ఒక వ్యాన్ ను ఢీకొట్టి రోడ్డుపై నుంచి లోయలోకి దూసుకెళ్లిందని తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: