ఇటీవల సైబర్(Cyber) మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నా, ఎంతగా ప్రభుత్వాలు వీటిని నమ్మవద్దని ప్రజలను అప్రమత్తం చేస్తున్నా ఇంకా మోసపోతూనే ఉన్నారు. డిజిటల్ అరెస్టు అంటూ అందినకాడికి దోచుకుంటున్న ముఠా ఆగడాలు ఇటీవల బాగా పెరిగిపోతున్నాయి. మనం కాస్త జాగ్రత్తగా ఉండకపోతే అరెస్టు భయాలతో మనల్ని నిలువునా దోచుకుంటారు. తాజాగా ఇలాంటి సంఘటనే విజయనం జిల్లా బొబ్బిబిలో జరిగింది. దీనికి సం
బంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Also: K ramp: ఓటీటీలోకి ‘కే ర్యాంప్’.. ఎప్పుడంటే.!
బెదిరింపులతో డబ్బు డిమాండ్

విజయనగరం జిల్లా బొబ్బిలి(Bobbili) పోలీసు స్టేషను పరిధిలో పెద్ద ఎత్తున చోటు చేసుకున్న సైబరు మోసాన్ని పోలీసులు చేధించారు. డిజిటల్ అరెస్టు పేరుతో అమాయకులను లక్ష్యంగా చేసుకున్న నలుగురు ప్రధాన నిందితులను బొబ్బిలి పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బొబ్బిలి పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు చింత రమణకు సైబరు నేరగాళ్లు 2025 సెప్టెంబరు 15న వాట్సాప్ కాల్ చేశారు. తాము సీబీఐ అధికారులమని, మీ ఆధార్ కార్డు మానవ అక్రమ రవాణాలో ఉపయోగించబడిందని, మీరు నేరాలకు పాల్పడ్డారు కాబట్టి మిమ్మల్ని డిజిటల్ అరెస్టు చేస్తున్నామని బెదిరించారు. విడుదల చేయాలంటే పూచీకత్తు కోసం కొంత డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రూ.22, 18,000 మోసపోయిన టీచర్
నేరగాళ్ల మాటలకు భయపడ్డ టీచర్ వెంకట రమణ దశలవారీగా మొత్తం రూ.22,18,000లు వారికి ముట్టచెప్పారు. అయితే ఎన్నిసార్లు ఇచ్చినా మళ్లీ మళ్లీ డబ్బు కోసం బెదిరిస్తుండడంతో అనుమానం వచ్చిన వెంకటరమణ అక్టోబర్ 9న బొబ్బిలి(Bobbili) పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టిన పోలీసులు చెన్నైకు చెందిన నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిధులను సునీల్ సుతార్ (23), సత్ (19), రాజేష్ పాల్ (26), మహ్మద్ ఇర్ఫాన్ (21)లుగా గుర్తించారు. వీరందరూ రాజస్థాన్ కు చెందిన ప్రధాన నిందితుడు వినోద్ చౌదరితో కలిసి మోసాలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం వినోద్చౌ దరీ పరారీలో ఉన్నాడని, అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు పని చేస్తున్నాయని ఎస్పీ దామోదర్ తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: