Bapatla crime: బాపట్ల జిల్లాలోని సంతమాగులూరు మండలంలో జరిగిన ఓ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. భార్యను గొంతు నులిమి హత్య చేసిన భర్త, ఆమె మృతదేహాన్ని బైక్‌పై పెట్టుకుని నేరుగా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి లొంగిపోయాడు. ఈ అమానుష ఘటనను చూసిన స్థానికులు షాక్‌కు గురయ్యారు. వివరాల్లోకి వెళితే.. సంతమాగులూరు మండలం ఏల్చూరుకు చెందిన వెంకటేశ్వర్లు, పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం మాచవరానికి చెందిన మహాలక్ష్మి (28) కొన్నేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు.
Read also: LSA: APలో లోక్ అదాలత్ 2 లక్షల కేసుల పరిష్కారం

Bapatla crime
ఆమె గొంతు నులిమి హత్య
Bapatla crime: వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే కొంతకాలంగా వ్యక్తిగత విభేదాల కారణంగా మహాలక్ష్మి భర్త నుంచి విడిగా పుట్టింట్లో నివసిస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం వెంకటేశ్వర్లు మాచవరం వెళ్లి, బంగారం ఇస్తానని నమ్మించి ఆమెను గ్రామ శివారు ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ మాటామాటా పెరిగి తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోగా, ఆగ్రహంతో ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని బైక్‌పై ఉంచి సంతమాగులూరు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: