కట్నం కోసం అత్తింటివారు అమానవీయంగా ప్రవర్తించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో వెలుగులోకి వచ్చింది. అదనపు కట్నం ఇవ్వలేదన్న కోపంతో కోడలిని గదిలో బంధించి, లోపలికి పామును వదిలి హత్యాయత్నం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
కల్నల్‌గంజ్ ప్రాంతానికి చెందిన షానవాజ్ 2021 మార్చి 19న రేష్మా అనే యువతిని వివాహం చేసుకున్నాడు. పెళ్లైన కొద్ది రోజులకే రేష్మాపై అత్తింటివారి కట్న వేధింపులు (Dowry harassment)ప్రారంభమయ్యాయి. ఇప్పటికే రేష్మా కుటుంబం రూ.1.5 లక్షలు ఇచ్చినా, మరో రూ.5 లక్షలు కావాలని పట్టుబట్టినట్లు సమాచారం.

ఈ క్రమంలో సెప్టెంబర్ 18న వేధింపులు భయంకర స్థాయికి చేరాయి. రేష్మాను ఒక గదిలో బంధించి, డ్రైనేజీ పైపు ద్వారా పామును లోపలికి వదిలారు. పాము కాటుకు గురైన రేష్మా నొప్పితో విలవిల్లాడుతుండగా, అత్తింటివారు బయట నిలబడి నవ్వారనే ఆరోపణలు వచ్చాయి.
తీవ్ర అస్వస్థతలో (serious illness) ఉన్న రేష్మా తన సోదరి రిజ్వానాకు ఫోన్ ద్వారా సమాచారం అందించడంతో, ఆమె హుటాహుటిన అక్కడికి చేరుకుని రేష్మాను ఆసుపత్రికి తరలించారు. రిజ్వానా ఫిర్యాదు మేరకు పోలీసులు షానవాజ్, అతని తల్లిదండ్రులు, సోదరుడు, సోదరి, మరికొందరిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఘటన ఎక్కడ జరిగింది?
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లోని కల్నల్‌గంజ్ ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
బాధితురాలు ఎవరు?
రేష్మా అనే యువతి, 2021లో షానవాజ్‌ను వివాహం చేసుకుంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: