రైస్ మిల్ యజమాని వద్ద జిల్లా పౌర సరఫరాల శాఖ డిఎం రూ. 75 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. నడి రోడ్డుపై లంచం తీసుకుంటుండా ఏసీబీ అధికారులు రావడంతో.. గమనించిన పౌరసరపరాల అధికారి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ సంఘటన కొమ్రంభీం ఆసిఫాబాద్ (Asifabad) జిల్లాలో చోటు చేసుకుంది.
Read Also: Jubilee Hills Bypoll : ‘KCR కంటే KTR పెద్ద మూర్ఖుడు – బండి సంజయ్
ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) బియ్యాన్ని గోదాము నుండి ఆసిఫాబాద్‌లోని పౌర సరఫరాల గోదాముకు తరలించడానికి అనుమతి ఇవ్వడానికి రూ. 75,000 లంచం తీసుకుంటున్న పౌర సరఫరాల అధికారిని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు పట్టుకున్నారు.ఆసిఫాబాద్ జిల్లా పౌర సరఫరాల కార్యాలయ మేనేజర్ గురుబెల్లి వెంకటనర్సింహారావు, పీఏ (పొరుగు సేవల ఉద్యోగి) కొత్తగొల్ల మణికాంత్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఆదిలాబాద్ జిల్లా ఏసిబి (ACB) డిఎస్పి మధు తెలిపిన వివరాల ప్రకారం..బాధితుడు నుండి ఇప్పటికే 16 లారీలకు సంబంధించిన డబ్బులు పౌరసరఫరాల శాఖ అధికారులు తీసుకున్నట్లు డి.ఎస్.పి వెల్లడించారు. ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా లంచం అడిగినట్లయితే అవినీతి నిరోధక శాఖకు తెలియజేయాలని ఏసీబీ ప్రజలకు సూచించింది. అవినీతి నిరోధక శాఖ కార్యాలయం టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు ఫోన్ చేసి సమాచారం అందించవచ్చునని తెలిపింది.
పౌరసరఫరాల శాఖ అధికారుల వేధింపులు తట్టుకోలేక
అంతేకాకుండా సామాజిక మాధ్యమాలైన వాట్సాప్ (9440446106), ఫేస్‌బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB), వెబ్‌సైట్ (http://acb.telangana.gov.in) ద్వారా కూడా ఏసీబీ అధికారులకు సమాచారం అందించవచ్చునని తెలిపింది. ఫిర్యాదుదారులు లేదా బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చింది.

పౌరసరఫరాల శాఖ అధికారుల వేధింపులు తట్టుకోలేకనే ఏసీబీని ఆశ్రయించినట్లు బాధితుడు సందీప్ తెలిపారు. వాసవి మాడ్రన్ రైస్ మిల్ (Rice Mill) నునడుపుతున్న సందీప్ రభి సీజన్‌లో వడ్లు పట్టకుండా ట్రక్ షీట్ ఇవ్వాలని అధికారులు కోరడంతో నిరాకరించాడు. దీంతో అధికారులు అతనిపై 6A కేసు నమోదు చేశారని తెలిపాడు.
రేషన్ బియ్యం కాదని కలెక్టర్‌కి వినతిపత్రం
అవి రేషన్ బియ్యం కాదని కలెక్టర్‌కి వినతిపత్రం ఇచ్చినా కూడా ఉన్నతాధికారులు పట్టించుకోలేదని.. దీంతో తాను హైకోర్టును ఆశ్రయించానని చెప్పాడు. హైకోర్టు ఆదేశాలతో అధికారులు సీజ్ చేసిన బియ్యాన్ని పరిశీలించి.. అవి రేషన్ బియ్యం కాదని తేర్చారు.
దీంతో సీజ్ చేసిన బియ్యం రిలీజ్ చేయాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అయినప్పటికీ అధికారులు బియ్యం రిలీజ్ చేయకుండా తనను ఇబ్బందులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. వారి వేధింపులు తట్టుకోలేకనే ఏసీబీని ఆశ్రయించి అవినీతి అధికారులను పట్టించానని బాధితుడు తెలిపాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: