ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని కిడ్నాప్‌కు గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది. విజయవాడలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న విద్యార్థిని ఇంట్లో ఉన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Read also: Medak Crime: ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య..

సమాచారం ప్రకారం, బైక్‌పై వచ్చిన దుండగులు అకస్మాత్తుగా ఇంట్లోకి ప్రవేశించి విద్యార్థినిని బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. ఈ ఘటనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన తల్లిదండ్రులపై దుండగులు దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు.
వెంటనే బాధిత తల్లిదండ్రులు మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. విద్యార్థినిని సురక్షితంగా గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగినట్లు పోలీసులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: