గుంటూరు జిల్లా నరసరావుపేట ప్రభుత్వ(AP) ఆసుపత్రిలో తీవ్రమైన వైద్య నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకున్న 22 ఏళ్ల రమాదేవి శరీరంలో సర్జికల్ బ్లేడ్ మిగిలిపోయిన ఘటన స్థానికంగా పెద్ద సంచలనం రేపింది. నరసరావుపేట బాలయ్యనగర్‌కు చెందిన రమాదేవి ఇటీవల ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకుంది. డాక్టర్ నారాయణస్వామి, ఆయన బృందం ఆ ఆపరేషన్ నిర్వహించారు. శస్త్రచికిత్స అనంతరం బాధితురాలు అసహనంగా తీవ్రమైన నొప్పితో బాధపడుతుండగా, దీనిని సాధారణ నొప్పిగా భావించి వైద్య సిబ్బంది ఆమెను తిరిగి ఇంటికి పంపించారు.
Read Also: Hyd Fraud: నన్నే డబ్బులు అడుగుతారా? సీఐ భార్యనంటూ లక్షల్లో మోసం..

అయితే, నొప్పి రోజు రోజుకూ పెరగడంతో కుటుంబ సభ్యులు ఆమెకు స్కానింగ్ చేయించగా, పక్కటెముకల దగ్గర సర్జికల్ బ్లేడ్ స్పష్టంగా ఉన్నట్లు రిపోర్ట్‌లో బయటపడింది. దీనితో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు.
వైద్యుల నిర్లక్ష్యం పై మండిపడ్డ కుటుంబం
ఆపరేషన్ సమయంలో(AP) తీవ్ర నిర్లక్ష్యం జరిగిందని కుటుంబ సభ్యులు వైద్యులపై ఆరోపణలు చేశారు. శస్త్రచికిత్స కోసం సిబ్బంది ₹2500 వసూలు చేసినట్లు బాధితురాలు పేర్కొంది.
ఈ విషయంపై స్పందించిన ఆపరేషన్ డాక్టర్ నారాయణస్వామి,
- “శస్త్రచికిత్స పూర్తయిన వెంటనే మరొక కేసుకు వెళ్లిపోయాను…”
- “పరికరాలను శుభ్రపరిచే సిబ్బందే సరిగ్గా క్లీనింగ్ చేయకపోయారు…”
అంటూ బాధ్యతను నిరాకరించారు.
అయితే, ప్రజల ప్రాణాలకు రక్షకులుగా నిలవాల్సిన వైద్యులు ఇలాంటి ఘోర నిర్లక్ష్యానికి పాల్పడటం పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: