(AP Crime) శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు షుగర్ ఫ్యాక్టరీలో పోలీసుల కాల్పులు జరిగాయి. ఓ హత్య కేసులో నిందితుడిని పట్టుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారు. నిన్న రాత్రి కల్లూరుపల్లి హోసింగ్ బోర్డ్ కాలనీలో పెంచలయ్య అనే వ్యక్తిని కొందరు హత్య చేశారు. ఈ కేసులో నిందితులు ఫ్యాక్టరీ వద్ద దాక్కుని ఉన్నారనే సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లగా నిందితులు కత్తులతో దాడికి దిగారు.
Read Also: Chandrababu: ఎమ్మిగనూరు రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి..
దీంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ ఘటన కోవూరులోని షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో జరిగింది. వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో పెంచలయ్య అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో నిందితులు కోవూరు షుగర్ ఫ్యాక్టరీ వద్ద దాక్కున్నారన్న సమాచారం అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు వెళ్లారు.
అయితే పోలీసులను చూసిన నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించారు. అంతేకాదు తమ వద్ద ఉన్న కత్తులతో వారిపై దాడికి తెగబడ్డారు. నిందితుల దాడిలో కానిస్టేబుల్ ఆదినారాయణ గాయపడ్డాడు. లొంగిపొమ్మని చెప్పినా నిందితులు వినకుండా కత్తులు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం నిందితులపై కాల్పులు జరిపారుఈ కాల్పులలో నిందితుడు జేమ్స్ కాలికి గాయాలు అయ్యాయి.

హత్య చేయించింది ఒక మహిళ?
మరో 9 మంది నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు జేమ్స్, కానిస్టేబుల్ ఆదినారాయణ నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.కాగా , ఈ హత్య చేయించింది ఒక మహిళ(Ganja lady don)గా పోలీసులు అనుమానిస్తున్నారు.వ్యాపారానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో ఏకంగా హత్య చేయించడం నెల్లూరు జిల్లాలో సంచలనం రేపింది.
స్థానికంగా విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు జరుగుతున్నా పోలీసులు పట్టించు కోలేదని దాంతో దుండగులు చివరకు హత్యకూ బరి తెగించారని స్థానికులు ఆరోపించారు. గతంలో ఎన్నో సార్లు నెల్లూరు గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశామని అయినా ఫలితం లేకపోయిందని, చివరకు పెంచలయ్య ప్రాణాలు తీశారని స్థానిక యువకులు మండిపడ్డారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: