ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో (Anantapur district) హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. బొమ్మనహాళ్ మండలం నేమకల్లు గ్రామానికి చెందిన కల్లప్ప అనే వ్యక్తి తన ఇద్దరు కుమార్తెలను హెచ్‌ఎల్‌సీ కాలువ వద్దకు తీసుకెళ్లి నీళ్లలోకి తోసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనలో ఒక బాలిక మృతి చెందగా, మరో బాలిక కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. ఆదివారం జరిగిన ఈ దారుణం ఆలస్యంగా బయటపడటంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
Read also: AP Solar Scheme: అందని ద్రాక్ష పిఎం సూర్యఘర్ యోజన..

Anantapur
భయంతో పారిపోవడానికి ప్రయత్నించిన
స్థానికుల కథనం ప్రకారం, సింధు మరియు అనసూయ అనే ఇద్దరు బాలికలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. కాలువ వద్ద పెద్ద కుమార్తెను నీళ్లలోకి తోసిన తర్వాత, భయంతో పారిపోవడానికి ప్రయత్నించిన చిన్న కుమార్తెను కూడా వెంబడించి పట్టుకుని కాలువలోకి నెట్టినట్టు తెలుస్తోంది. పిల్లలు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు కల్లప్పను ప్రశ్నించగా, అతడు చేసిన పనిని అంగీకరించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు విచారణ చేపట్టి కాలువలో గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలో అనసూయ మృతదేహం లభ్యమైంది. మరో బాలిక కోసం శోధన కొనసాగుతోందని అధికారులు తెలిపారు. నిందితుడు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని, అతడు కోలుకున్న తర్వాత పూర్తి విచారణ చేపడతామని పోలీసులు స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: