हिन्दी | Epaper

America: హైదరాబాద్ యువతి హత్యకేసులో నిందితుడు అరెస్టు

Pooja
America: హైదరాబాద్ యువతి హత్యకేసులో నిందితుడు అరెస్టు

ఆధునిక యుగంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావడం లేదు. మనల్ని ఎంతో ప్రేమిస్తున్నామని అంటారు, అన్నివిధాలుగా ఆదుకుంటామని భరోసా ఇస్తారు. కానీ వారి నిజస్వరూపం తెలుసుకునేలోపే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. తాజాగా అమెరికాలో(America) హైదరాబాద్ యువతి నిఖితారావు గొడిశాల తాను ఎంతో నమ్మన వ్యక్తి చేతిలోనే ప్రాణాలను కోల్పోయింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Read also: America: ఖమేనీని మరోసారి హెచ్చరించిన ట్రంప్

America

అమెరికాలో(America) హైదరాబాద్ యువతి నిఖితారావు గొడిశాలను హత్య చేసి భారత్ కు పారిపోయి వచ్చిన నిందితుడు అర్జున్ శర్మను పోలీసులు ఆరెస్టు చేశారు. అమెరికా పోలీసులు అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో తమిళనాడులో ఇంటర్ పోల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిఖితారావు గొడిశాల (26) ఎల్లికాట్ సిటీలో నివాసం ఉంటుంది. స్ట్రాటజీ అనలిస్ట్ గా గుర్తించినట్లు హోవార్డ్ కౌంటీ పోలీసులు తెలిపారు. మేరీల్యాండ్ లోని కొలంబియాలోని ట్విన్ రివర్స్ కోడ్ లోని అర్జున్ శర్మ అపార్ట్మెంట్ జనవరి 3న గొడిశాల మృతదేహాన్ని కనుగొన్నారు.

పోలీసులకు నిందితుడే సమాచారం ఇచ్చిన వైనం

నిఖితా రావు తప్పిపోయినట్లుగా అర్జున్ శర్మ జనవరి 2న పోలీసులకు సమాచారం అందించాడు. డిసెంబరు 31న న్యూఇయర్ వేడుకల్లో చివరిసారిగా చూసినట్లు తెలిపారు. పోలీసులకు సమాచారం అందించిన రోజే అర్జున్ శర్మ భారత్ కు వచ్చేశాడు. జనవరి 3న అర్జున్ శర్మ ఇంట్లో నిఖితారావు మృత దేహాన్ని పోలీసులు గుర్తించారు.

అర్జున్ శర్మనే చంపినట్లుగా గుర్తించి.. అరెస్టు వారెంట్ జారీ చేశారు. నిరంతరం భారతీయ అధికారులతో సంప్రదింపులు జరపడంతో తాజాగా తమిళనాడులో నిందితుడిని అరెస్టు చేశారు. ఇక బాధితురాలు సికింద్రాబాద్ లోని లాలాగూడ వాసిగా తెలుస్తోంది.నిఖితారావు గొడిశాల ఫిబ్రవరి 2025 నుంచి వేదా హెల్త్ డేటా, స్ట్రాటజీ అనలిస్ట్గా పనిచేస్తోంది. ఇటీవలె కంపెనీ ‘ఆల్-ఇన్ అవార్డు’ అందుకున్నట్లు కుటుంబ సన్నిహిత వర్గాలు తెలిపాయి. నిఖితా గొడిశాల హత్యపై భారత రాయబారి కార్యాలయం స్పందించింది. తీవ్ర విచారం వ్యక్తం చేసింది. బాధితురాలి కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఫుకెట్‌లో ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం

ఫుకెట్‌లో ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం

ఒక్క చుక్క చమురు కూడా బయటికి రాదు..ట్రంప్‌కు ఇరాన్ వార్నింగ్

ఒక్క చుక్క చమురు కూడా బయటికి రాదు..ట్రంప్‌కు ఇరాన్ వార్నింగ్

ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం: దద్దరిల్లిన టెల్ అవీవ్

ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం: దద్దరిల్లిన టెల్ అవీవ్

తన కూతురితో కలిసి క్రూయిజ్ క్షిపణి పరీక్షలను వీక్షించిన కిమ్

తన కూతురితో కలిసి క్రూయిజ్ క్షిపణి పరీక్షలను వీక్షించిన కిమ్

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఆరోగ్యంపై పెరుగుతున్న ఊహాగానాలు

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఆరోగ్యంపై పెరుగుతున్న ఊహాగానాలు

అమెరికాపై ఒత్తిడి..రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలుకు అనుమతి

అమెరికాపై ఒత్తిడి..రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలుకు అనుమతి

ఇండిగో సీఈఓ రాజీనామా

ఇండిగో సీఈఓ రాజీనామా

హర్మూజ్‌ జలసంధి సమీపంలో యూఎస్ దాడులు

హర్మూజ్‌ జలసంధి సమీపంలో యూఎస్ దాడులు

హర్మూజ్‌ మూతపడితే ఆహార ధరలు పెరుగుతాయి: సమితి హెచ్చరిక

హర్మూజ్‌ మూతపడితే ఆహార ధరలు పెరుగుతాయి: సమితి హెచ్చరిక

ముఖేష్ అంబానీతో ట్రంప్ భారీ ఒప్పందం

ముఖేష్ అంబానీతో ట్రంప్ భారీ ఒప్పందం

రిలయన్స్ తో ట్రంప్ భారీ డీల్

రిలయన్స్ తో ట్రంప్ భారీ డీల్

సమితిలో ఇరాన్ సంచలన ఆరోపణలు: ఇజ్రాయెల్ వైఖరిపై తీవ్ర నిరసన

సమితిలో ఇరాన్ సంచలన ఆరోపణలు: ఇజ్రాయెల్ వైఖరిపై తీవ్ర నిరసన

📢 For Advertisement Booking: 98481 12870