Ambati Rambabu arrest case: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టయిన మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు(High Court of Andhra Pradesh) ను ఆశ్రయించారు. తనపై పోలీసులు నమోదు చేసిన కేసును రద్దు చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం కోర్టు విచారణ చేపట్టింది.
Read Also: AP: వివేకా హత్యకేసులో సిబిఐకి సుప్రీంకోర్టు ఆదేశం

రిమాండ్ ప్రక్రియ కూడా నిబంధనలకు విరుద్ధం
విచారణ సమయంలో అంబటి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, ఈ కేసు చట్టబద్ధంగా నమోదు కాలేదని, రిమాండ్ ప్రక్రియ కూడా నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. వాదనలు విన్న హైకోర్టు, కేసుకు సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని పోలీసు శాఖను ఆదేశించింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది.
ఇదిలా ఉండగా, అంబటి రాంబాబు కస్టడీ, బెయిల్, జైలులో సౌకర్యాల అంశాలపై దాఖలైన మరో పిటిషన్‌పై గుంటూరు కోర్టులోనూ విచారణ జరిగింది. ఈ అంశంపై తీర్పును రేపటికి వాయిదా వేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రిపై దూషణాత్మక వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: