ఉగ్రవాద కార్యకలాపాల దర్యాప్తులో ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీ(Al-Falah University) పేరు వెలుగులోకి వచ్చింది. ఈ విద్యాసంస్థను కొంతమంది ఉగ్రవాదులు తమ కార్యకలాపాలకు అడ్డాగా ఉపయోగించుకున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యూనివర్సిటీ ల్యాబ్‌లలో పేలుడు పదార్థాలపై ప్రయోగాలు జరిగి ఉండవచ్చని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. ముఖ్యంగా RDX మరియు ఇతర అధునాతన రసాయన పదార్థాలపై పరీక్షలు నిర్వహించి ఉండవచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: montha cyclone: తుపాను బాధితులకు గుడ్ న్యూస్.. ఇళ్ల మరమ్మతులకు నిధులు
యూనివర్సిటీలో పోలీసులు భారీ సోదాలు
ఢిల్లీలో ఇటీవల జరిగిన పేలుడు ఘటనతో సంబంధం ఉందని అనుమానంతో హర్యానాలోని అల్ ఫలాహ్ యూనివర్సిటీలో పోలీసులు భారీ సోదాలు చేపట్టారు. యూనివర్సిటీ సిబ్బంది, విద్యార్థులు, వైద్యులను కలిపి పలువురిని విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. ఆత్మాహుతి బాంబ్ దాడిలో ప్రమేయం ఉన్నాడని భావిస్తున్న డాక్టర్ ఉమర్ నవి గది సహా యూనివర్సిటీ మొదటి అంతస్తులోని అనేక గదుల్లో అధికారులు సోదాలు నిర్వహించారు.

హర్యానా డీజీపీ ప్రకారం, అల్ ఫలాహ్ యూనివర్సిటీలో ఉగ్రవాద నెట్‌వర్క్‌లు ఉన్నాయా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఉత్తరప్రదేశ్ పోలీసులు, కేంద్ర సంస్థలతో సమన్వయం చేస్తూ చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఫరీదాబాద్‌తో పాటు హర్యానాలోని పలు ప్రాంతాల్లో కూడా సోదాలు జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్ అమల్లో ఉందని అధికారులు స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: