రాజస్థాన్‌లో(Rajasthan) చోటుచేసుకున్న ఓ విచిత్ర ఘటన స్థానికంగా సంచలనం రేపింది. జుంజును జిల్లాలో ఏడాదిన్నర వయస్సున్న పాపను ఆమె సొంత తండ్రే కిడ్నాప్ చేసిన విషయం బయటపడింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియోలు(CCTV videos) ప్రస్తుతం సోషల్ మీడియాలో(social media) వైరల్‌గా మారాయి. వివరాల్లోకి వెళ్తే – జుంజును నగరంలోని గాంధీ చౌక్ ప్రాంతానికి చెందిన హేమంత్ సోని, ఆకాంక్ష అనే దంపతులు 2022 నవంబర్‌లో వివాహం చేసుకున్నారు. వీరికి వంశిక అనే కుమార్తె ఉంది. అయితే దంపతుల మధ్య విభేదాలు తలెత్తడంతో ఆకాంక్ష కుమార్తెతో కలిసి తన పుట్టింటికి వెళ్లిపోయింది. గత రెండు సంవత్సరాలుగా ఆమె తండ్రి ఇంట్లోనే ఉంటోంది. భార్యాభర్తల మధ్య వివాదానికి సంబంధించిన కేసు ప్రస్తుతం కోర్టులో పెండింగ్‌లో ఉంది.
Read Also: PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్: పీఎం కిసాన్ 21వ విడతపై బిగ్ అప్‌డేట్

సీసీటీవీలో దొరికిన కిడ్నాప్ సన్నివేశం
రాజస్థాన్‌లో(Rajasthan) చోటుచేసుకున్న అక్టోబర్ 9న మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆకాంక్ష ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి వంశిక ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. కూతురిని ఆడించి ఇంట్లోకి వెళ్లి తిరిగి వచ్చినప్పుడు పాప కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. అందులో హేమంత్ సోని పాపను ఎత్తుకుని అక్కడి నుంచి పరుగెత్తుతూ వెళ్లడం స్పష్టంగా కనిపించింది. దీంతో ఆకాంక్ష స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేసింది. భర్త హేమంత్ సోనీపై కిడ్నాప్ కేసు పెట్టింది. ఇప్పటికే హేమంత్ కుమార్తెను తీసుకెళ్తానంటూ గతంలోనే బెదిరింపులు చేసినట్లు ఆకాంక్ష పోలీసులకు తెలిపింది.
ఈ ఘటన ఎక్కడ జరిగింది?
రాజస్థాన్‌లోని జుంజును జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
కిడ్నాప్‌కు గురైన చిన్నారి ఎవరు?
ఏడాదిన్నర వయస్సున్న వంశిక అనే పాపను ఆమె సొంత తండ్రి కిడ్నాప్ చేశాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: