Los Angles Olympics: 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌

Los Angles Olympics: 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌

దాదాపు 128 ఏళ్ల తర్వాత 2028లో అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌లో జరగబోయే విశ్వ క్రీడల్లో 128 ఏళ్ల తర్వాత క్రికెట్‌ నిర్వహించనున్నారు. అయితే ఈ క్రికెట్ పోటీల్లో ఆరు జట్లు పాల్గొంటాయని తాజాగా నిర్వాహాకులు నిర్ణయించారు. ఆతిథ్య దేశమైన అమెరికా నేరుగా పాల్గొనే అవకాశం ఉండగా మిగతా జట్ల ఎంపిక కోసం నిర్వాహకులు కసరత్తు జరుగుతున్నట్టు తెలుస్తోంది.టీ20 ఫార్మాట్‌లో పోటీలు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో పురుషుల, మహిళల విభాగాల్లో పోటీలను నిర్వహించనున్నారు. అయితే ఈ పోటీల్లో ఎన్ని జట్లు పాల్గొనాలనే దానిపై నిర్వాహకులు తాజాగా ఓ నిర్ణయానికి వచ్చారు. మొత్తం ఆరు జట్లు పోటీలో పాల్గొంటాయని తెలిపారు. అయితే ఈ ఒలింపిక్స్‌కు ఆతిథ్యం వహిస్తున్న అమెరికాకు మాత్రం డైరెక్ట్‌ ఎంట్రీ దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisements

ఒలింపిక్స్‌

అయితే పురుషుల విభాగంలో ప్రస్తుత టీ20 ర్యాంకింగ్స్, ప్రపంచ క్రికెట్‌లోని బలమైన జట్ల ఆధారంగా చూసుకుంటే ఈ జట్లు ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశంకనిపిస్తోంది. టీ20 ప్రపంచ చాంఫియన్స్‌ ర్యాంకింగ్‌లో ఇండియా ఎప్పుడూ టాప్‌లోనే ఉంటుంది. కాబట్టి ఒలింపిక్స్‌కు ఎంపిక అయ్యే అవకాశం ఎక్కువగానే ఉంది. తర్వాత ఆస్ట్రేలియా ఇది కూడా టీ20 ఫార్మట్‌లో బలమైనే జట్టనే చెప్పవచ్చు. గతంలో ఈ జట్టు విజేతగా కూడా నిలిచింది. దీంతో పాటు టీ20 అగ్ర జట్లలో ప్రపంచ కప్ విజేతలుగా ఉన్న ఇంగ్లాండ్‌కు కూడా చోటు దక్కే అవకాశం ఉంది. వీటితో పాటు టీ20లో స్థిరమైన ప్రదర్శనతో బలమైన ఆటగాళ్లుగా ఉన్న న్యూజిలాండ్, టీ20 ఫార్మాట్‌లో రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌లుగా నిలిచిన వెస్ట్ ఇండీస్, టీ20 ర్యాంకింగ్‌లలో తరచూ టాప్ 5-6 స్థానాల్లో ఉండే దక్షిణాఫ్రికాకు చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 Los Angles Olympics: 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌

భారత్‌కు ఛాన్స్‌

మహిళల టీ20లో ఆధిపత్య జట్టు, ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌లు నిలిచిన ఆస్ట్రేలియా ఈజీగా ఒలిపింక్స్‌లో ప్లేస్ సంపాధించుకునే అవకాశం ఉంది. దీంతో పాటు ప్రస్తుత మహిళల టీ20 ప్రపంచ చాంపియన్‌లుగా ఉన్న న్యూజిలాండ్, గతంలో ప్రపంచ కప్ విజేతలు అయిన ఇంగ్లండ్, తమ ఆటతో ఆసియా గేమ్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన భారత్‌కు ఛాన్స్‌ దక్కే అవకాశం కనిపిస్తోంది, మహిళల టీ20 ర్యాంకింగ్‌లలో తరచూ టాప్-5లో ఉండే దక్షిణాఫ్రికా, 2016 టీ20 ప్రపంచ కప్ విజేతలు నిలిచిన వెస్ట్ ఇండీస్ జట్లకు ఒలింపిక్స్‌లో చోటు లభించే అవకాశం ఉంది. పైన చెప్పుకున్న జట్ల ఎంపిక అనేది కేవలం అంచనా మాత్రమే. 2028 ఒలింపిక్స్‌ నిర్వహించే నాటికి టీ20 ర్యాంకింగ్స్‌లో మార్పులు వస్తే జట్ల ఎంపికలో కూడా మళ్లీ మార్పులు రావచ్చు. కాబట్టి ఇవే ఫైనల్ అని స్పష్టం చేయలేము.

Read Also: Ambati Rayudu: ట్రోలింగ్​పై స్పందించిన అంబటి రాయుడు

Related Posts
IPL 2025: అంపైర్ల జీతం ఎంతో తెలుసా!
IPL 2025: అంపైర్ల జీతం ఎంతో తెలుసా!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌  సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. ఇప్పటికే ఈ టోర్నీలో సగం మ్యాచ్‌లు పూర్తయ్యాయి. అనూహ్యమైన ఫలితాలతో ఈ సీజన్ ఇప్పటికే అభిమానులను Read more

వామ్మో.. 9 రోజుల్లో రూ.713 కోట్ల మద్యం తాగేశారు

దసరా పండుగకు ముందు వరుస సెలవుల నేపథ్యంలో తెలంగాణ లో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. గత 9 రోజుల్లో రూ.713.25 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు Read more

Gold Price : తొలిసారి బంగారం రూ.1 లక్ష దాటి రూ.3వేలు పెరిగింది
Gold Price : తొలిసారి బంగారం రూ.1 లక్ష దాటి రూ.3వేలు పెరిగింది

చరిత్రలో కనీవినీ ఎరుగని బంగారం ధరలు – రూ.3వేలు పెరిగిన పసిడి! భారతదేశంలో బంగారం ధరలు చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా పెరుగుతున్నాయి. ఇటీవల సోమవారం సాయంత్రం 10 Read more

కుంభమేళాకు బస్సులు రద్దు : ఒడిశా ప్రభుత్వం

భువనేశ్వర్: మహా కుంభమేళా కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సు సర్వీసులను ఫిబ్రవరి 4 వరకు ఒడిశా ప్రభుత్వం రద్దు చేసింది. అనివార్య పరిస్థితుల కారణంగా ఈ Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×