— సిపిఐ రామకృష్ణ
విజయవాడ : విద్యుత్ రంగ సమస్యలపై యాజమాన్యం ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎంఎల్ఎ కె రామకృష్ణ (K Ramakrishna) ఆరోపించారు. ఈ రంగాన్ని అదానీకి కట్టబెట్టి కార్మికుల పొట్టగొండతారా అని ప్రశ్నించారు. విద్యుత్ ఉద్యోగులు, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగులు, కార్మికులు ఆందోళన చేస్తున్నారు. వారి సీపీఐ సంఘీభావం ప్రకటించింది. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ కార్మి కులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని చెప్పారు.

నిబంధనలు
ఏపీ ఎలక్ట్రికల్ స్టాప్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు బి.రామలింగారెడ్డి మాట్లాడుతూ, జేఎల్ఎం గ్రేడ్-2 ఉద్యోగులకు సర్వీస్ సిబంధనల్లో వివిక్ష తొలగించి, అందరికీ సమానమైన ఏపీఎస్ఈబీ (APSEB) నిబంధనలు అమలు చేయాలని ఏఎల్ఎంలుగా పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొన్నా శివయ్య (Ponna Shivayya), గ్రామ, వార్డు సచివాలయ ఎనర్జీ ఎంప్లాయీస్ అసోసియేషణ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.మల్లిఖార్జునరెడ్డి, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.రవీంధ్రనాథ్ తదితరులు మాట్లాడారు.
సీపీఐ (CPI) అంటే ఏమిటి?
సీపీఐ అంటే కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (Communist Party of India). ఇది ఒక జాతీయ రాజకీయ పార్టీ. 1925లో స్థాపించబడింది. ఇది వామపక్ష సిద్ధాంతాలను అనుసరిస్తుంది.
సీపీఐ ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా ఎక్కడ బలంగా ఉంది?
ఆంధ్రప్రదేశ్‌లో సీపీఐ ప్రధానంగా గోదావరి జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో ప్రభావం చూపుతుంది. కార్మిక, రైతు సంఘాలు, విద్యార్థి సంఘాల ద్వారా ఈ పార్టీ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తుంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Sabari Express: శబరి ఎక్స్ ప్రెస్ సూపర్ ఫాస్ట్ గా అప్గ్రేడ్