విజయవాడ : కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPI) (మావోయిస్ట్) ఫ్రంట్ సంస్థలు, రాడికల్ యూత్ లీగ్ .రైతు కూలీ సంఘం గ్రామీణ పేదల సంఘం రాడికల్ స్టూడెంట్స్ యూనియన్. సింగరెణి కార్మిక సమాఖ్య. విప్లవ కార్మిక సమాఖ్య, ఆల్ ఇండియా రివల్యూషనరీ స్టూడెంట్స్ ఫెడరేషన్, రివల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్ నిషేదాన్ని పొడిగించినట్లు ఏపీ సమాచార శాఖా మంత్రి కొలసు పార్థసారధి తెలిపారు. సచివాలయంలోని సమాచార కేంద్రంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ పబ్లిక్ సెక్యూరిటీ , 1992, (21 5 1992) సెక్షన్ 3 మరియు దాని ఉపక్లాజుల ప్రకారం చట్టవిరుద్ధ సంఘాలుగా ప్రకటించడంపై నిషే ధాన్ని మరో సంవత్సరం పాటు పొడిగిం చేందుకు సాధారణ పరిపాలన శాఖ చేసిన ప్రతిపాదనకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుం దన్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నిషేధం అమలులో ఉన్నప్పటికి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) ఆంధ్రప్రదేశ్లో తమకు అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తోంది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) పోలీస్ ఇన్ఫార్మర్లు అని పేరుతో పౌరులను లక్ష్యంగా చేసుకోవడం, ముఖ్యంగా అల్లూరి సీతారా మరాజు జిల్లా లలో ప్రభుత్వ ఆస్తులను దెబ్బతీయ డంతో పాటు తెలంగాణ, ఒడిశా మరియు ఛత్తీస్ గఢ్ పొరుగు రాష్ట్రాల నుండి వచ్చిన వారి కేడర్లతో కలిసి వినాశకార కార్యకలాపాలను కొనసాగి స్తోంది. 2024 ఆగస్టు నుండి ఇప్పటి వరకు నిషేధ కాలంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (Maoist) 9 నేరాలు చేసిందని తెలిపారు.

పుట్టపర్తి, మొవ్వ, గన్నవరం, గాజువాక మరియు తిరుపతి తదితర ఐదు అసిస్టెంట్ప బ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికన మంజూరు చేయడానికి చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందన్నారు. ప్రస్తుత ఏపీ మీడియా అక్రిడిటేషన్ నిబంధనలు, 2023లో జారీ చేసిన జీవోను రద్దు పరిచి రద్దుపరచి, దాని స్థానంలో కొత్తగా రూపొందింఛిన “కాంప్రహెన్సివ్ ఏపీ మీడియా అక్రిడిటేషన్ రూల్స్, 2025“ ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. కొత్త సమగ్ర, సమీకృత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మీడియా అక్రిడిటేషన్ రూల్స్, 2025కు కేబినెట్ ఆమోదం కోరుతూ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. తద్వారా, రాష్ట్ర హెడ్ క్వార్టర్స్, పబ్లిషింగ్ సెంటర్లు, ఆంధ్రప్రదేశ్ జిల్లాలలో మీడియా ప్రతినిధులకు అక్రిడిటేషన్ మంజూరు చేయడం కోసం ఉన్న ఆంధ్రప్రదేశ్ మీడియా అక్రిడిటేషన్ రూల్స్, 2023, జీవో 38 ద్వారా జారీ చేసిన ఉత్తర్వుల స్థానంలో క్రొత్తగా రూపొందించిన ఆంధ్రప్రదేశ్ మీడియా అక్రిడిటేషన్ రూల్స్, 2025 అమలులోకి రానుంది.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :