ఒకప్పుడు ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ (Corona virus) ప్రస్తుతం ఈ కేసుల సంఖ్య విపరీతంగా తగ్గిపోయింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాలు దేశంలో పరిస్థితి ఎంత మెరుగ్గా ఉందో స్పష్టంగా తెలియజేస్తున్నాయి. 2020లో ప్రారంభమైన ఈ మహమ్మారి, భారత్‌లో రెండు ఘోరమైన వేవ్‌లను కలిగించింది. లక్షల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన వేళ, దేశం మొత్తం ఒక్కటై పోరాడిన ఆత్మవిశ్వాసం ఇప్పుడు ఫలితాలు ఇస్తోంది.

కేసుల సంఖ్య 7 వేల కిందకు – నూతన విరామం!
తాజా గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా యాక్టివ్ కరోనా కేసులు 6,836కి తగ్గిపోయాయి. రోజువారీ కొత్త కేసుల సంఖ్య గణనీయంగా తగ్గడం, రికవరీ రేటు పెరగడం దేశ ఆరోగ్య రంగం సాధించిన విజయానికి నిదర్శనంగా నిలుస్తోంది.
గత 24 గంటల్లో కేవలం 179 కేసులే – మరణాలు తగ్గుముఖం
గడిచిన 24 గంటల్లో కేవలం 179 కొత్త కేసులు నమోదు కాగా, ఇద్దరు మాత్రమే మరణించారు. ఈ సీజన్ మొత్తం మృతుల సంఖ్య 109కి చేరుకుంది. ఈ గణాంకాలు వైరస్ వ్యాప్తి ఎంతగా అదుపులోకి వచ్చిందో తెలియజేస్తున్నాయి. ఒకానొక దశలో రోజుకు లక్షల కేసులు నమోదై, ఆసుపత్రులు కిక్కిరిసిపోయిన పరిస్థితుల నుంచి, నేడు 7 వేల లోపు యాక్టివ్ కేసులతో భారత్ కరోనా కట్టడిలో ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తోంది. ఈ గణాంకాలు దేశవ్యాప్తంగా ప్రజలకు, ప్రభుత్వానికి గొప్ప ఊరటను కలిగిస్తున్నాయి.
రాష్ట్రాల వారీగా గణాంకాలు – కేరళ ముందంజలో
ప్రస్తుతానికి క్రియాశీల కేసులు రాష్ట్రాల వారీగా చూస్తే కేరళ అత్యధికంగా మొత్తం క్రియాశీల కేసులు 6,836కు చేరుకుంది. అలాగే కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకున్న వారి సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. ప్రతిరోజూ ఆస్పత్రుల నుంచి అనేక మంది డిశ్ఛార్జీ అవుతున్నారు. అలాగే కరోనా ఉధృతి తగ్గినప్పటికీ, కేరళ, గుజరాత్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక వంటి కొన్ని రాష్ట్రాల్లో ఇంకా క్రియాశీలక కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అత్యధికంగా కేరళలో 1659 కేసులు ఉండగా.. గుజరాత్‌లో 1248, పశ్చిమ బెంగాల్‌లో 747, కర్ణాటకలో 696 కేసులు ఉన్నాయి.
కట్టుదిట్టమైన వ్యూహంతో ముందుకు కేంద్రం – “టెస్ట్, ట్రేస్, ట్రీట్”
కేంద్ర ప్రభుత్వం తిరిగి ‘టెస్ట్, ట్రేస్, ట్రీట్’ మంత్రాన్ని అమలులోకి తెచ్చింది. వైరస్ వ్యాప్తిని పూర్తిగా అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం కృషి చేస్తున్నాయి. టెస్టింగ్, ట్రాకింగ్, ట్రీట్‌మెంట్ (టెస్ట్, ట్రేస్, ట్రీట్) విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తూనే ప్రజలు కూడా కరోనా నిబంధనలను పాటించేలా అవగాహన కల్పిస్తున్నారు. మరికొన్ని రోజుల్లోనే ఈ కేసులు కూడా పూర్తిగా తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రజలు మాస్క్ ధరించడం, చేతులు శుభ్రంగా ఉంచడం వంటి మౌలిక జాగ్రత్తలను పాటించాలని ప్రభుత్వాలు పిలుపునిస్తున్నాయి. ఈ మధ్యే డెల్టా వేరియంట్ మళ్లీ కొన్ని దేశాల్లో తలెత్తిన నేపథ్యంలో, భారత ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.
Read also: Bengaluru: బెంగుళూరులో జీవనోపాధి కోల్పోయిన లక్ష మంది రైడర్స్