దేశంలో కరోనా వైరస్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. హాంకాంగ్, సింగపూర్ తర్వాత భారత్‌లోనూ కోవిడ్ సోకిన వారిన సంఖ్య వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో వైరస్ సోకిన వారి సంఖ్య 1009కు చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కొత్తగా 752 కేసులు నమోదైనట్లు వెల్లడించింది. అలాగే, ప్రస్తుతం అత్యధికంగా కరోనా కేసులు ఉన్న రాష్ట్రాల్లో కేరళ మొదటి స్థానంలో ఉంది. కేరళలో యాక్టివ్ కేసుల సంఖ్య 430కి పెరిగాయి. గత 24 గంటల్లో కేరళలో 335 కొత్త కేసులు నమోదు కావడం ఆందోళన కలిగించే అంశం. ఇండియన్ జీనోమిక్స్ కన్సార్టియం ప్రకారం, దేశంలో ప్రస్తుతం రెండు కొత్త వేరియంట్లు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఈ వేరియంట్లపై ఇంకా పూర్తి అధ్యయనం జరుగుతున్నప్పటికీ, వేగంగా వ్యాపించే లక్షణాలు ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్‌లో కరోనా వైరస్ (Coronavirus) మళ్లీ వేగంగా వ్యాప్తి చెందుతుండటం జనంలో గుబులు పుట్టిస్తోంది. దేశంలో కోవిడ్ 19 పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది.. కరోనా (Coronavirus) తో ఇప్పటివరకు నలుగురు మృతి చెందారు.. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా బాగా పెరిగింది.. చాప కింద నీరులా చల్లగా పాకేస్తోన్న కరోనా (Coronavirus) యాక్టివ్ కేసుల సంఖ్య దేశంలో వెయ్యి దాటిపోయింది.. తమిళనాడు, మహరాష్ట్ర, కర్నాటక, ఢిల్లీలో బాధితులు పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో అక్కడి వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమై కోవిడ్ నిబంధనల్ని, టెస్టులను చేయడం మొదలుపెట్టింది.

గత వారం కొత్త కేసుల గణాంకాలు
దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 1,009కి పైగా ఉంది. కేరళలో 403, మహారాష్ట్రలో 209, ఢిల్లీలో 104, గుజరాత్‌లో 83, కర్నాటకలో 47, ఉత్తరప్రదేశ్ 15, పశ్చిమ బెంగాల్ లో 12 కరోనా (Coronavirus) కేసులు నమోదయ్యాయి. కోవిడ్ కారణంగా కేరళలో ఇద్దరు, మహారాష్ట్రలో ఒకరు, కర్ణాటకలో ఒకరు మరణించారు. దేశంలోని కోవిడ్ కొత్త వేరియంట్ తీవ్రత అధికంగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలోనే వందకు చేరింది. దేశంలో గత వారం రోజులలో 752 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ తెలిపింది. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల్లోనే అధిక సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. కేరళలో 335 కొత్త కేసులు మహారాష్ట్రలో 153 కేసులు, ఢిల్లీలో 99 కొత్త కేసులు వెలుగుచూశాయి.
కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు
కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలను అలర్ట్ చేసంది. అన్ని సౌకర్యాలతో ఆస్పత్రులను సిద్ధం చేసుకోవాలని సూచించింది.. రెండు కొత్త వేరియంట్లలో కరోనా (Coronavirus) ప్రభావం చూపిస్తున్నట్లు ఇండియన్ జీనోమిక్స్ కన్సార్టియం నిపుణులు గుర్తించారు.భారత్‌లో కరోనా మళ్లీ తీవ్రత పెంచుతున్న నేపథ్యంలో, ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య శాఖ సూచనలు పాటిస్తూ, సామూహిక భద్రతను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. కోవిడ్‌ను మరువకండి – అది తిరిగి మళ్లొస్తోంది.
Read Also: Operation Sindoor: పాకిస్థాన్‌పై భారత్ ప్రతిస్పందన..