हिन्दी | Epaper
అఖిలాండ నాయకుని ఆనంద ఉత్సవం పోషకాహారమే జీవనాధారం సీజనల్ వ్యాధులకు చెక్ మార్కెట్ మాయలోజనం విలవిల మువ్వన్నెల వికసిత భారత్ భగవంతుని ప్రతిరూపం అమ్మ నేటి యువకులే రేపటి పాలకులు ఆరోగ్య సిరికి’నవ రత్నాలు ఆరోగ్య సిరికి’నవ రత్నాలు ప్రసిద్ధ నీతి కథలు ‘పంచతంత్ర’ అఖిలాండ నాయకుని ఆనంద ఉత్సవం పోషకాహారమే జీవనాధారం సీజనల్ వ్యాధులకు చెక్ మార్కెట్ మాయలోజనం విలవిల మువ్వన్నెల వికసిత భారత్ భగవంతుని ప్రతిరూపం అమ్మ నేటి యువకులే రేపటి పాలకులు ఆరోగ్య సిరికి’నవ రత్నాలు ఆరోగ్య సిరికి’నవ రత్నాలు ప్రసిద్ధ నీతి కథలు ‘పంచతంత్ర’ అఖిలాండ నాయకుని ఆనంద ఉత్సవం పోషకాహారమే జీవనాధారం సీజనల్ వ్యాధులకు చెక్ మార్కెట్ మాయలోజనం విలవిల మువ్వన్నెల వికసిత భారత్ భగవంతుని ప్రతిరూపం అమ్మ నేటి యువకులే రేపటి పాలకులు ఆరోగ్య సిరికి’నవ రత్నాలు ఆరోగ్య సిరికి’నవ రత్నాలు ప్రసిద్ధ నీతి కథలు ‘పంచతంత్ర’ అఖిలాండ నాయకుని ఆనంద ఉత్సవం పోషకాహారమే జీవనాధారం సీజనల్ వ్యాధులకు చెక్ మార్కెట్ మాయలోజనం విలవిల మువ్వన్నెల వికసిత భారత్ భగవంతుని ప్రతిరూపం అమ్మ నేటి యువకులే రేపటి పాలకులు ఆరోగ్య సిరికి’నవ రత్నాలు ఆరోగ్య సిరికి’నవ రత్నాలు ప్రసిద్ధ నీతి కథలు ‘పంచతంత్ర’

The Silent Killer in Our Food : బతుకులపై ‘కల్తీ’ కాటు

Abhinav
The Silent Killer in Our Food : బతుకులపై ‘కల్తీ’ కాటు

నేడు కల్తీ అనే పేరు నలు దిశలా వినిపిస్తుంది. నిత్యా వసర వస్తువులలో అనవసర పదార్థాలను కలిపి చలామణి చేయడం నేరం. దీనినే కల్తీ చేయడం అంటారు. ఈ కల్తీ (Forgery) సరుకుల వల్ల ప్రజలు అనారోగ్యంపాలు అవుతున్నారు. సమయం కలిసిరాకపోతే ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. ఇప్పుడు ఉప్పు, పప్పు, కాలికి తొడిగే చెప్పుల నుండి పసిపిల్లలు తాగే పాలు, పాలపొడి నుండి వ్యాధిగ్రస్తులు వేసుకునే మందుల వరకు కల్తీ చేస్తూ కాదేదీ కల్తీకి అనర్హం అని రుజువు చేస్తున్నారు. మన కల్తీరాయుళ్లు. ధనార్జన చేయాలనే స్వార్థంతో ఇటువంటి కొందరు చేస్తున్న కల్తీ వలన ప్రజలు రోగాలబారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఒకప్పుడు తినే వస్తువులలో వేరే పదార్థాలు కలిపి కల్తీ చేసేవారు. ప్రస్తుతం ట్రెండ్ మారిపోయింది. కల్తీరాయుళ్ళు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని కల్తీలు చేస్తున్నారు. ఖరీదైన వంటనూనెలో, తక్కువ ఖరీదు వంటనూనెలను కలుపుతారు. దీనివల్ల వినియోగదారుడికి పూర్తి స్థాయిలో అనారోగ్యం కలగకపోయినప్పటికీ ఆర్థికంగా నష్టపోవడం జరుగుతుంది. మరికొందరైతే తెలివిగా నాణ్యమైన సరుకులో, నాణ్యతలేని సరుకులను కల్తీ చేసి లాభార్జన చేస్తున్నారు. పచ్చిపప్పుతో శనగపిండిని చేస్తుంటారు. ఒకప్పుడు బఠానీపిండిని ఇందులో కలిపి కల్తీ చేసేవారు. ఇప్పుడు కల్తీరాయుళ్ళు తెలివిమీరిపోయి నాణ్యత లోపంచిన, విడిగా అమ్ముడుపోని పుచ్చు, సచ్చు పచ్చిపప్పును సైతం ఇందులో వేసి పిండి చేసి, అందులో రంగు కలిపి ఆకర్షణీయంగా తయారుచేసి అమ్మేస్తున్నారు.  ఒకప్పుడు కల్తీ చేసే పద్ధతులు ఒకప్పుడు కల్తీ చేసే ప్రక్రియల పట్ల ప్రజల్లో అవగాహన పెరిగి వాటి పట్ల జాగ్రత్త వహిస్తున్నారు. 

కల్తీ జరిగితే ఎలా కనిపెట్టాలి? అనే విషయం ప్రజలు తెలుసుకుని అప్రమత్తంగా మెలగసాగారు. భారత ఆహార పరిరక్షణ, నాణ్యతా ప్రమాణాల సంస్థ(ఎఫ్ఎస్ఎస్ఏ) తరచూ కొన్ని చిట్కాలను ప్రజలతో పంచుకుంటుంది. ‘డిటెక్టింగ్ ఫుడ్ అడెల్టెట్స్’ పేరుతో సామాజిక మాధ్యమాల వేదికగా కొన్ని వీడియోలు పంచుకుంటుంది. వీటి ద్వారా మనం తీసుకునే ఆహార పదార్థాలు మంచివా? కల్తీవా? అనే విషయాలపై సులభంగా అవగాహన కల్పిస్తోంది. ఆహార పదార్థాల నాణ్యత, స్వచ్ఛతకు సంబంధించి ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రజలతో పంచుకున్న కొన్ని చిట్కాలతో పాటు ఒకప్పటి కల్తీ నుండి నేటి కల్తీల వరకూ ఎలా జరుగుతున్నాయో తెలుసుకుందాం. చక్కెరలో సుద్ద: చక్కెరలో సుద్దను కలిపేవారు. పారదర్శక గాజుగ్లాసులోకి మంచినీరు తీసుకోవాలి. అందులో పది గ్రాముల చక్కెర కలపండి. అడుగు భాగంలో సుద్ద పేరుకుంటే అది కల్తీదే. కొందరైతే పానీయాలలో తీపిని పెంచేందుకు చక్కెరకు బదులు చాక్రిన్ను వాడుతున్నారు. ఇటువంటివి ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి. పాలల్లో నీళ్లు: నున్నగా, ఏటవాలుగా ఉన్న ఏదైనా వస్తువు ఉపరితలంపై పాలచుక్కను వేయండి. స్వచ్ఛమైన పాలైతే అది నిలిచి ఉంటుంది. లేదా నెమ్మదిగా కిందికి జారుతుంది. ఆ క్రమంలో తెల్లటి మరక ఏర్పడుతుంది. నీళ్లు కలిపిన పాలైతే వెంటనే జారిపోతుంది. మరక ఏర్పడదు. ఇటీవల కొన్ని ప్రాంతాలలో పాలల్లో కొన్ని రసాయనాలు, పాలకు సంబంధం లేని రసాయన పిండి పదార్థాలను కలిపి చిక్కనైన చక్కని పాలు తయారుచేసి అధిక ధరకు అమ్ముతున్నారు. పలుచోట్ల తనిఖీల లో వీరి గుట్టు రట్టు కేసులను నమోదు చేయడం జరిగింది. గోధుమ పిండిలో ఊక: పారదర్శక గాజుగ్లాసులోకి మంచినీరు తీసుకోవాలి. 

దానిలో ఒక చెంచా గోధుమ పిండిని చల్లండి. స్వచ్ఛమైన గోధుమ పిండి నీటిలో కలిసిపోతుంది. పిండిలో కల్తీ కలిపిన ఊక మాత్రం పైభాగంలో తేలుతుంది. పసుపు కల్తీ: సింథటిక్ రంగులు, చాక్ పౌడర్లు, రంగులు లేదా రసాయనాలు పసుపుకు కలుపుతారు. వాటిని పరీక్షించడానికి ఒక గ్లాసులో గోరువెచ్చని నీటిని తీసుకుని, దానికి ఒక చెంచా పసుపు జోడించండి. పసుపు కరిగి ముదురు. పసుపు రంగులోకి మారితే అది కల్తీ అని అర్థం. అదే స్వచ్ఛమైన పసువు అయినట్లైతే వసువంతా నీటి అడుగు భాగానికి చేరుకుంటుంది. తేనెలో చక్కెర పారదర్శకంగా ఉండే గాజుగ్లాసులో మంచి నీటిని తీసుకోవాలి. ఇందులో ఒక చుక్క తేనెను వేయాలి. స్వచ్ఛమైన తేనె నీటిలో కరిగిపోదు. ఒకవేళ తేనె నీటిలో అదృశ్యమైతే, అందులో చక్కెర కలిసినట్లే. మరో పరీక్ష ద్వారా కూడా తేనె నాణ్యతను తెలుసుకోవచ్చు. పత్తితో చేసిన వత్తిని స్వచ్ఛమైన తేనెలో ముంచి వెలిగిస్తే వెలుగుతుంది. ఒకవేళ కల్తీ తేనె, చక్కెర, బెల్లంపాకం కలిపితే అంటుకోదు. అంటించడానికి ప్రయత్నిస్తే చిటపటలాడుతుంది. దాల్చిన చెక్క తరచుగా దాల్చిన చెక్క పేరుతో చైనీస్ కాసియాను విక్రయిస్తారు. రెండూ ఒకేలా ఉంటాయి. కానీ నిజమైన దాల్చినచెక్క సువాసన చాలా బాగుంటుంది. సన్నగా ఉంటుంది. కాసియా కరుకుగా మందంగా ఉంటుంది. దీని సువాసన కూడా చాలా తక్కువ. దాల్చిన చెక్కపొడి పై అయోడిన్ చుక్క వేయండి. పౌడర్ నీలం రంగులోకి మారితే అది కల్తీ అని అర్థం. కూరగాయలపై ఆకుపచ్చ దూదిముద్దను నీటిలోగానీ, వంటనూనెలోగానీ ముంచి కూరగాయలపై రుద్దాలి. దూదికి ఆకుపచ్చ రంగు అంటితే ఆ కూరగాయలు రంగుపూతకు గురైనట్లే. ముఖ్యంగా పచ్చి బఠానీతో పాటు అనేక ఆకుకూరలను రంగుల్లో ముంచి అందంగా, తాజాగా కనిపించేలా తయారుచేసి అమ్మేస్తున్నారు.

కారంలో చెక్కపొట్టు నీటితో నిండిన పారదర్శక గాజుగ్లాసులో కారంపొడిని కలపాలి. స్వచ్ఛమైన కారంపొడి నీటి అడుగు భాగానికి చేరుతుంది. చెక్కపొట్టు పైభాగంలో తేలియాడుతుంది. నేడు కల్తీరాయుళ్లు మరో అడుగు ముందుకు వెళ్లి కారం బాగా రంగు వచ్చేందుకు ఇటుకపొడి, ఇసుక, సోవ్స్టోన్ పౌడర్, ఉప్పు, ట్కాలం పౌడర్, ఇతర సింథటిక్ ఉత్పత్తులను కలిపేస్తున్నారు. ఇటువంటి కారం వంటల్లో కలిపి తింటే కేన్సర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఒక గ్లాసు నీటిలో ఒక టీ స్పూను కారంపొడి కలపాలి. కొద్దిసేపయ్యాక నీటి అడుగు భాగంలో ఉన్న కారం నీటిలో ఒక టీ స్పూన్ కారంపొడిని కొద్దిగా అరచేతిలోకి తీసుకుని వేలితో రుద్దాలి. రాళ్లలా గట్టిగా అనిపిస్తే అందులో ఇటుకపొడి లేదా ఇసుక కలిపినట్లు. అలా కాకుండా సబ్బులా మృదువుగా అనిపిస్తే కారంలో సోప్ స్టోన్ పౌడర్ కలిపారని అర్థం చేసుకోవాలి. కారంలో రంగులు కృత్రిమ రంగు, సింథటిక్ డై, డిటర్జెంట్, ఇటుకపొడి, టాల్క్ మొదలైనవి ఎండుమిరపకాయల్లో కలిపి కారం తయారు చేయడం పాత పద్ధతి. నేడు కొత్త పద్ధతులు వచ్చేశాయి. నాణ్యమైన ఎండు మిరపకాయల్లో తాలు మిరపకాయలు, వాటి తొడాలు కూడా వేసి కారం తయారుచేసి ఇందులో మోతాదుకు మించి రంగు కలిపి ఆకర్షణీయంగా తయారుచేసి నాణ్యమైన కారంగా చెలామణీ చేస్తూ అధిక ధరకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఉప్పులో సుద్ద నీటితో నిండిన గాజుగ్లాసులో కాసింత ఉప్పును కలపాలి. స్వచ్ఛమైన ఉప్పు అడుగు భాగంలోకి చేరుతుంది. సుద్ద కలిపిన ఉప్పు తెల్లని ద్రావణంగా మారుతుంది. విధమైన కల్తీలు చేయడం ఒకనాటి మాట. ఇటువంటి విషయాల పట్ల ప్రజల్లో అవగాహన పెరిగింది. దాంతో కల్తీరాయుళ్లు ఆధునిక ప్రక్రియల్లో కల్తీలు చేస్తున్నారు. వాటి గురించి కూడా తెలుసుకుందాం. 

ప్రస్తుతం మార్కెట్లో లభించే అనేక నిత్యావసర వస్తువుల్లో కల్తీ జరుగుతున్నది అనే విషయం జగమెరిగిన సత్యం. పాలు, నీళ్లు, కారం, ఉప్పు, పసుపు, మసాలా దినుసులు.. ఇలా మార్కెట్లో దొరికే పదార్థాలన్నింటినీ కల్తీ చేస్తున్నారు మార్కెట్ కల్తీగాళ్లు. అన్ని మసాలా దినుసులను సరైన పరిమాణంలో చేర్చినప్పటికీ, మనం అనుకున్నట్లు ఆహారంలో రుచి రాదు. దీనికి కారణం కల్తీ మసాలాల సరుకును నాణ్యమైన వాటిలో కలపడమే. ఇలా చేయడం వల్ల సుగంధ ద్రవ్యాలు సైతం సహజత్వాన్ని కోల్పోతున్నాయి. అటువంటి సమయంలో వాటి వాసన, పరిమానాన్ని పెంచడానికి, వాటి రంగు, ఆకృతిని పోలి ఉండే వస్తువులు కల్తీ చేస్తుంటారు. ఉదాహరణకు.. ఎర్ర మిరపకాయలో ఎర్ర ఇటుకపొడి లేదా డిటర్జెంట్ కలుపుతారు. ఎండిన బొప్పాయి గింజలను కూడా ఎండుమిర్చిలో కలుపుతారు. ఇతర పదార్థాలు కలపడం వల్ల కల్తీని తేలికగా గుర్తిస్తున్నారు. ఆ కారణంగా ఇప్పుడు నాణ్యమైన సరుకులో నాణ్యత లోపించిన సరుకును కలపడం వల్ల లాభార్జన చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల వినియోగదారుడి ఆరోగ్యానికి ఎటువంటి నష్టం కలగకపో యినప్పటికీ ఆర్థికంగా నష్టపోతున్నాడు. కొన్ని రకాల కల్తీలు వినియోగదారుడిని రోగాలపాలు చేస్తే మరికొన్ని రకాల కల్తీలు ఆర్థికంగా దెబ్బతినేలా చేస్తున్నాయి. నెయ్యి కల్తీ: ఇందులో ఎక్కువగా వనస్పతిని కలిపి అన్ని ప్రముఖ సంస్థల పేర్లతోనూ విపణిలోకి తీసుకొస్తున్నారు. సాధారణ ఉష్ణోగ్రతలో స్వచ్ఛమైన నెయ్యి గడ్డ కట్టదు. బాగా చల్లని వాతావరణంలో కొద్దిగా గడ్డ కడుతుంది. వనస్పతిని కలిపిన నెయ్యి సాధారణ వాతావరణంలోనూ గడ్డ కడుతుంది. వేడి చేస్తేగానీ కరగదు. పండ్లు కల్తీ: మామిడి, అరటి పండ్లను ప్రత్యేక రసాయనాల్లో మగ్గబెడుతున్నారు. ఈ రసాయనాలు ఉపయోగించడం వల్ల ఆ పండ్ల పైపొర రంగు మారి పండినట్లు కనిపిస్తుంది. 

కానీ లోపల ఇటువంటి పండ్లు తినడం మాత్రం పచ్చిదనం అలాగే ఉంటుంది. వల్ల రోగాలపాలు కాక తప్పదు. నూనె కల్తీ: ‘బ్లెండెడ్ వెజిటెబుల్ ఆయిల్’ పేరుతో రెండు రకాల నూనెలను కలిపి విక్రయిస్తారు. ‘బ్లెండెడ్’ అనే పదాన్ని చాలా చిన్నగా ముద్రించి అమ్ముతుంటారు. ఉదాహరణకు వేరుశనగ నూనె(80 శాతం), పామాయిల్(20 శాతం)ను కలిపి ఒక కిలో ప్యాకెట్ చేస్తే ఏది ఎంత మోతాదులో ఉందో స్పష్టంగా కనిపించేలా ముద్రించాలి. కానీ ఉత్పత్తిదారులు తక్కువ ధర ఉన్న నూనెను ఎక్కువ మోతాదులో కలిపి ఆ వివరాలేవీ కనిపించకుండా ‘వేరుశనగల బొమ్మలను కవరుపై పెద్దగా ముద్రిస్తారు. దీనివల్ల వినియోగదారులు ఆర్థికంగా నష్టపోతారు. కొందరైతే బ్రాండెడ్ నూనె కంపెనీల పేరు, ప్యాకింగ్లను తయారు చేసి, తక్కువ ధర నూనెతో ప్యాకింగ్ చేసి అధిక ధరలకు అమ్ముతున్నారు. ఇటువంటివారి గుట్టురట్టు అయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. మాంసం కల్తీ పశువైద్య నిపుణుల ఆమోదముద్ర ఉన్న మేకలు, గొర్రెల మాంసాన్ని విక్రయించాల్సి ఉండగా అన్ని చోట్ల అది అమలు కావడం లేదు. ఖరీదైన గొర్రె మాంసంలో ఖరీదు తక్కువ గొడ్డుమాంసం కలిపేసి అమ్మిన సందర్భాలు అనేక ఉన్నాయి. కొన్ని నగరాలలో గొర్రెమాంసం బిర్యానీ తినడానికి చాలామంది భయపడతారు. అందులో గొడ్డుమాంసం కలుస్తుందని దృఢంగా నమ్మేవాళ్లు చాలా మంది ఉన్నారు. ఇందులో సత్యం లేకపోలేదు. చేపలు ఆరోగ్యానికి చాలా మంచిదని భావిస్తుంటారు. చాలా చోట్ల చెరువుల్లో పెంచే చేపలకు కోడిమాంసం నుండి వచ్చిన వ్యర్థాలను ఆహారంగా వేస్తున్నారు. ఇటువంటి చేపలను తినడం ఆరోగ్యానికి హానికరం. కోళ్లు వేగంగా ఎదిగేందుకు, బరువు పెరిగేందుకు వాటి మెడకు సూదిమందు వేస్తుంటారు. ఇటువంటి కోడిమాంసం కూడా అనారోగ్యంపాలు చేస్తుంది. నకిలీ బాసుమతి బిర్యానీ బాసుమతి బియ్యం పేరు చెప్పి, దాన్ని పోలిన పొడవాటి తక్కువ రకం బియ్యాన్ని వండి బాసుమతి బిర్యానీ అని మోసం చేస్తుంటారు

నాణ్యమైన బాసుమతి బియ్యం పొడవుగా ఉండి ఒక రకమైన పరిమళాన్ని వెదజల్లుతుంటాయి. ఖరీదైన బాసుమతి బియ్యంలో ఎటువంటి పరిమళం లేని, తక్కువ ధరగల లాంగ్స్ అనే బియ్యాన్ని కల్తీగా కలుపుతున్నారు. ఈ బియ్యం చూడటానికి బాసుమతి బియ్యంలా పొడవుగా ఉంటాయి. వీటిలో ఎటువంటి పరిమళం ఉండదు. ఇటువంటి బియ్యం కొనడం వల్ల వినియోగదారుడి ఆరోగ్యానికి ఎటువంటి హాని కలుగకపోయినప్పటికీ ఆర్ధికంగా నష్టపోతాడు. చికెన్, మటన్, బిర్యానీలు, తందూరీ చికెన్లలోనూ రంగులేస్తుంటారు. ముఖ్యంగా ఫాస్ట్ఫుడ్ కేంద్రాల్లో చికెన్ను దోరగా వేయించి, వేలాడదీసి అమ్ముతుంటారు. చిత్రమైన రంగులో మెరుస్తుంటుంది. ఇలా రంగు రావడానికి చికెన్కు రంగులు వేసి ఆకర్షణీయంగా తయారుచేసి సొమ్ము చేసుకుంటున్నారు. మిఠాయిలు కల్తీ ఆహార పదార్థాలలో పరిమిత స్థాయిలో రంగులేయాల్సి ఉంటుంది. కిలో పరిమాణానికి 10 మి.గ్రా రంగువేయాలి. అది కూడా అనుమతించిన రంగునే వేయాలి. చాలామంది ఈ ప్రమాణాలు పాటించరు. కొన్ని మిఠాయి దుకాణాల్లో నిషేధిత మెటానిల్ పసుపురంగును జిలేబీల తయారీలో, ‘రొడొమిన్ బి’ పింకురంగును పీచు మిఠాయిలకు వాడుతుంటారు. కొన్ని మిఠాయిలపై వెండి రేకుల భ్రమించే తరగం అంటిస్తారు. ఇటువంటివి తింటే కేన్సర్ బారిన పడతారు. జనం కూడా ముదురురంగుతో, అందంగా, ఆకర్షణీయంగా కనిపించే మిఠాయిలను కొనడానికే ఎగబడి, వాటిని తిని కోరి మరీ జబ్బులు తెచ్చుకుంటుంటారు. నకిలీ విత్తనాలు- ఎరువులు ఆరుగాలాలు కష్టించి పనిచేసే రైతన్నను సైతం కల్తీ భూతం వదలడం లేదు. నకిలీ విత్తనాలు అమ్మి రైతులను మోసం చేస్తున్నారు. ఎరువుల్లో సైతం కల్తీ కలిపి రైతన్న శ్రమను దోచుకుంటున్నారు.

ఎరువుల్లో కల్తీ అనేక రకాలుగా ఉంటుంది. కొందరు వ్యాపారులు ఎరువులను ఆక్రమ పద్ధతుల్లో విక్రయిస్తారు. తక్కువ ధర కలిగిన ఒక రసాయన ఎరువును, ఎక్కువ ధర ఉండే వేరే రసాయన ఎరువు పేరుతో అమ్మడం, చలామణిలో ఉన్న ఎరువును పోలిన నకిలీ ఎరువును కానీ ప్రత్యామ్నాయంగా మరొక దానిని కానీ ఆ పేరుతో అమ్మడం, నిర్ణయించిన ప్రమాణాలు లేకున్నా అవి ఉన్నట్లు బస్తాలపై ముద్రించి అమ్మడం చేస్తున్నారు. ఇవి కాక యూరియా, అమ్మోనియం క్లోరైడ్, అమ్మోనియం సల్ఫేట్, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వంటి ఎరువుల్లో ఉప్పు కలిపి కల్తీ చేస్తారు. సూపర్ ఫాస్పేట్, రీలేటెడ్ జింక్లో సున్నం, డి.ఎ.పి., ఇతర కాంప్లెక్స్ ఎరువులలో బొగ్గు, పొటాష్, మ్యూరేట్ ఆఫ్ పొటాష్, సల్ఫేట్ ఆఫ్ పొటాష్ లో ఇసుక, డి.ఎ.పి..ఇతర ఎరువులలో నల్లమట్టి, సూపర్ ఫాస్ఫేట్, సల్ఫేట్ ఆఫ్ పొటాష్ ఇత్యాదివి కలిపి కల్తీ చేస్తున్నారు. నగరాల్లో ఆహార కల్తీ నగరాల్లో కల్తీ విచ్చలవిడిగా విజృంభిస్తుంది. కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా కొందరు స్వార్థపరులు చేసే కల్తీల వల్ల ప్రజలు భయంకర వ్యాధులకు లోనై ప్రాణాలు విడుస్తున్నారు. పెద్ద నగరాలలోని ప్రజలు న్యూడిల్స్, మంచురియాలలో టమాటా సాస్ కలుపుకుని తింటుంటారు. ఈ సాస్ను కూడా కల్తీ చేస్తున్నారు. టమాటా సాస్లలో టమాటో లేకుండానే తయారు చేస్తున్నారు. గుమ్మడికాయల గుజ్జు, మైదా, గంజిపొడి, ఎర్రరంగుతో టమాటా సాస్ తయారు చేస్తున్నారు. బొప్పాయి విత్తనాలతో మిరియాలు, బొంబాయి రవ్వతో నకిలీ గసగసాలు చేస్తున్నారు. చీపురు ముక్కలకు రసాయనాలు జతచేసి నకిలీ జీలకర్ర, చెడిపోయిన అల్లంతో నకిలీ శొంఠి, కుళ్లిన దుంపలు, అరటిబోదెలు, రసాయానాలతో అల్లం-వెల్లుల్లి ముద్ద, జంతు కళేబరాలను మరిగించి నూనె, నెయ్యి తయారు చేస్తున్నారు. నీరు, పాలపొడి, కొన్ని రసాయనాలు కలిపిన పొడితో హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపిన పాల తయారీ, అపరిశుభ్రమైన జనరల్ వాటర్ను బాటిళ్లలో నింపి మినరల్ వాటర్ మోసం చేస్తున్నారు.

చాలా పానీయాలు పండ్లతో కాకుండా ఎసెన్స్ తో తయారు చేస్తున్నారు. నిమ్మకాయను కాకుండా నిమ్మ ఉప్పుతో లెమన్వాటర్ తయారు చేయడం, మనకు దొరకని పండ్ల సువాసనలు వెదజల్లే రసాయనాలతోపాటు రంగులు కలిపి పానీయాలు తయారుచేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఇవి కాక పిజ్జాలు, బర్గర్లు, నూడిల్స్, కొన్ని రకాల బేకరీ పదార్థాలు, రంగులు కలిపిన పానీయాలు, ఐస్క్రీమ్లలు ఇత్యాది ఆరోగ్యానికి మేలు చేయని నకిలీ, కల్తీ ఆహార పదార్థాలను తినడం వల్ల ఆరోగ్యంపై తీవ్రప్రభావం చూపుతుంది. దేశంలోని మరణాల్లో 70శాతం ఆహార సంబంధమేనని వెల్లడైంది. ఇండియన్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ నిబంధనలు ఆహారంలో నాణ్యతా ప్రమాణాలు ఎలా ఉండాలనే విషయంపై భారత ఆహార పరిరక్షణ, నాణ్యతా ప్రమాణాలు సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఐ) వారు కొన్ని నియమ నిబంధనలు రూపొందించారు. ఆహార తయారీ వ్యాపారాలు తప్పనిసరిగా వీటిని పాటించాలి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా అనేది 2006లో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా చట్టం ప్రకారం స్థాపించబడిన ఒక చట్టబద్ధమైన సంస్థ, ఆహార భద్రతపై సరైన నియంత్రణ, పర్యవేక్షణ ద్వారా ప్రజారోగ్యాన్ని రక్షించడం, ప్రోత్సహించడం కోసం బాధ్యత వహిస్తుంది. ఈ చట్టం ఆహార పదార్థాల కోసం సైన్స్ అథారిటీ ప్రమాణాలను నిర్దేశించడానికి, వాటి తయారీ, నిల్వ, పంపిణీ, అమ్మకం, దిగుమతిని నియంత్రించడానికి, మానవ వినియోగానికి సురక్షితం, ఆరోగ్యకరమైన ఆహారం లభ్యతను నిర్ధారించడానికి అధికారం ఇస్తుంది. సురక్షితం, పరిశుభ్రంగా ఉండే ఆహారాన్ని తినడం ప్రాముఖ్యత గురించి ప్రజలకు తెలియజేయడానికి ఈ సంస్థ బాధ్యత వహిస్తుంది. ఫుడ్ అథారిటీకి కొన్ని ప్రధానమైన విధులున్నాయి. ఆహార, పానీయాల పరిశ్రమలో మోసపూరిత ప్రకటనలు పర్యవేక్షించడానికి అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సెల్ ఆఫ్ ఇండియాతో కలిసి పని చేస్తుంది. 

ఆహార ఉత్పత్తుల కోసం సైన్స్ ఆధారిత ప్రమాణాలను ఏర్పాటు చేయడం, వాటి తయారీ, నిల్వ, పంపిణీ, అమ్మకం, నాణ్యమైన ఉత్పత్తుల దిగుమతిని నియంత్రించడం, ఇది చివరికి మానవ వినియోగానికి ఆరోగ్యకరమైన, సురక్షితమైన ఆహారం లభ్యతకు హామీ ఇస్తుంది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్వి) సంస్థ బాధ్యతలు ఆహార భద్రత, అవగాహనకు సంబం ధించిన నియమనిబంధనలను వివరిం చడం, ఆహార పదార్థాలలోని కలుషితాలకు సంబంధించిన డేటాను సేకరించడం, ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ల కోసం ప్రక్రియలు, నిబంధనలను రూపొందించడం, అర్హత కలిగిన ఆహార వ్యాపారాలకు ఆహార లైసెన్సులు మంజూరు చేయడం, ఆహార రంగం, ఆహార సరఫరాలో జరిగే ప్రమాదాలను గుర్తించడం, కొత్త పాలసీలను రూపొందించడం, భారత ప్రభుత్వం ఆదేశాలను అమలు చేయడం, ప్రజలకు అందుబాటులో ఉన్న ఆహార పదార్థాలతో సమస్యలను గుర్తించడానికి హెచ్చరిక చేయడం, ఆహార వ్యాపారాల్లో నిమగ్నమైన, పాల్గొనాలని భావించే వ్యక్తుల కోసం శిక్షణా కార్యక్రమాలను నిర్వహించడం, ఆహారం, పారిశుద్ధ్యం, పైటో శానిటరీ ప్రమాణాల కోసం అంత ర్జాతీయ సాంకేతిక ప్రమాణాల అభివృద్ధికి దోహదం చేయడం ఇత్యాది అనేక బాధ్యతలను ఈ సంస్థ నిర్వహిస్తుంది. ప్రాంతీయ కార్యాలయాలు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఐ) ప్రస్తుతం 4 ప్రాంతీయ కార్యాలయాలతో తన పరిపాలను కొనసాగిస్తుంది. న్యూఢిల్లీలో దీని ప్రధాన కార్యాలయం ఉంది. ఇది హర్యానా, ఉత్తరాఖండ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, చండీగఢ్, ఉత్తరప్రదేశ్, లడఖ్, జమ్మూ- కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాల పర్యవేక్షణ చేస్తుంది. ముంబైలో ప్రధాన కార్యాలయం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, గోవా, దాదర్ నగర్ హవేలీ, దామన్ దీవులు ప్రాంతాల పర్యవేక్షణ, చెన్నై ప్రధాన కార్యాలం తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేంద్రపాలితలు పుదుచ్చేరి, లక్షదీప్ ప్రాంతాల పర్యవేక్షణ చేస్తుంటాయి. 

కోల్కతా కార్యాలయం పశ్చిమబెంగాల్, మైన ఒరిస్సా, బీహార్, జార్ఘండ్, ఛత్తీస్గఢ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మణిపూర్, మిజోరాం, మేఘాలయ, నాగాలాండ్, అస్సాం, (గౌహతి ప్రాంతీయ కార్యాలయం) ఇత్యాది ప్రాంతాలను పర్యవేక్షిస్తుంది. విచ్చిలవిడిగా ఆహార పదార్థాల కల్తీ కల్తీ ఆహార పదార్థాలు మార్కెట్లో రాజ్య మేలుతున్నాయి. కొందరు తయారీదారులు కనీస నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు. ఆయా ఆహార పదార్థాలపై తయారీ తేదీ, ఎంత కాలంలోగా విని యోగించాలనే వాటిని ముద్రించకుండానే విక్రయిస్తున్నారు. సుగంధ ద్రవ్యాలు, నెయ్యి, డాల్డా, పోపుగింజలు, మసాల దినుసులు, పొడులు, పసుపు, కారం తదితర వస్తువులతోపాటు పచ్చళ్లు, తదితర వస్తువులను పాలిథిన్ ప్యాకెట్లలో ప్యాక్ చేసి హోల్సెల్, రిటైల్ షాపులకు సరఫరా చేస్తున్నారు. ఆయా షాపుల నుంచి దుకాణాల ద్వారా వినియోగదారు లకు చేరుతున్నాయి. పాలల్లో డిటర్జంట్ పొడి, యూరియా, గంజి కలిపి కల్తీ చేస్తున్నారు. తేనెలో పంచదార, బెల్లం పాకం కలుపుతున్నారు. ఐస్క్రీమ్లో వాషింగ్  పౌడర్లు, అనుమతిలేని రంగులు కలుపుతున్నారు. మెరుపు వచ్చేందుకు యాపిల్ వంటి పండ్లపై మైనంను పూతగా పూస్తున్నారు. ఉప్పులో సుద్దపొడి కల్తీగా వాడుతున్నారు. ఒకచోట కల్తీ జరుగు తుందంటే ఎవరైనా నిఘా పెట్టగలరు. అడుగడుగునా కల్తీ మయమైనప్పుడు ఇంతమంది కల్తీ రాయుళ్లను కనిపెట్టడం పెద్ద సమస్యగా మారింది. సిబ్బంది కొరత వల్ల కల్తీ ఆహారపదార్థాల నివారణకు తూనికలు, కొలతలు, పౌర సరఫరాలు, కల్తీ నిరోధక శాఖ, విజిలెన్స్ వాణిజ్య పన్నులశాఖ అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారు. పైగా కల్తీని కనిపెట్టే ప్రయోగశాలలు పెద్ద నగరాలకే పరిమితమయ్యాయి. అక్కడి నుండి నివేదిక రావడానికి చాలా సమయం పడుతుంది. 

ఈలోగా నిందితులు చట్టా లను చుట్టాలుగా చేసుకునే పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటు న్నారు. ఆహార సంబంధిత వ్యాధుల కారణంగా ఏటా 1500 కోట్ల డాలర్ల మనదేశం నష్టపోతున్నట్లుగా లోగడ అధ్యయనాలు వెలువడ్డాయి. కేన్సర్ వంటి దాదాపు రెండొందల రుగ్మతలకు కల్తీ తిండి కారణభూతమవుతోందని వైద్యవర్గాలు హెచరిస్తున్నాయి. కొన్ని దేశాలలో ఇటువంటి కల్తీ అక్రమార్కులకు కఠినమైన శిక్షలు వేసి ఉక్కుపాదం మోపారు. అటువంటి శిక్షలు మనదేశంలో కూడా అమలు కావలసిన అవసరం ఉంది. వంట నూనెలు నియంత్రణ చట్టం 1947, నిత్యావసర సరకుల చట్టం 1955, ఆహార కల్తీ నిరోధక చట్టం 1954, పాల ఉత్పత్తుల నియంత్రణ చట్టం 1992 తదితర చట్టాలు ఉన్నప్పటికీ కల్తీలను అరికట్టలేకపోతున్నారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) వారి నియమ నిబంధన లకు అనుగుణంగా ఉత్పత్తులను తయారు చేయని సంస్థలపై చర్యలు తీసుకోవాలి. మనకు చాలా చట్టాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో కల్తీరాయుళ్లు భయపడే విధమైన శిక్షలు అమలు జరిగితేనే వీటిని అరికట్టగలమనేది జగమెరిగిన సత్యం. కల్తీలను అరికట్టడం ప్రభుత్వంతో పాటు దాని అనుబంధసంస్థది మాత్రమే బాధ్యత అని భావించరాదు. ప్రతి పౌరుడు తన – బాధ్యతగా భావించి ప్రభుత్వానికి సహకరిస్తే కల్తీని కొంతలో కొంత తగ్గించవచ్చు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870