हिन्दी | Epaper
అఖిలాండ నాయకుని ఆనంద ఉత్సవం పోషకాహారమే జీవనాధారం సీజనల్ వ్యాధులకు చెక్ మార్కెట్ మాయలోజనం విలవిల మువ్వన్నెల వికసిత భారత్ భగవంతుని ప్రతిరూపం అమ్మ నేటి యువకులే రేపటి పాలకులు ఆరోగ్య సిరికి’నవ రత్నాలు ఆరోగ్య సిరికి’నవ రత్నాలు ప్రసిద్ధ నీతి కథలు ‘పంచతంత్ర’ అఖిలాండ నాయకుని ఆనంద ఉత్సవం పోషకాహారమే జీవనాధారం సీజనల్ వ్యాధులకు చెక్ మార్కెట్ మాయలోజనం విలవిల మువ్వన్నెల వికసిత భారత్ భగవంతుని ప్రతిరూపం అమ్మ నేటి యువకులే రేపటి పాలకులు ఆరోగ్య సిరికి’నవ రత్నాలు ఆరోగ్య సిరికి’నవ రత్నాలు ప్రసిద్ధ నీతి కథలు ‘పంచతంత్ర’ అఖిలాండ నాయకుని ఆనంద ఉత్సవం పోషకాహారమే జీవనాధారం సీజనల్ వ్యాధులకు చెక్ మార్కెట్ మాయలోజనం విలవిల మువ్వన్నెల వికసిత భారత్ భగవంతుని ప్రతిరూపం అమ్మ నేటి యువకులే రేపటి పాలకులు ఆరోగ్య సిరికి’నవ రత్నాలు ఆరోగ్య సిరికి’నవ రత్నాలు ప్రసిద్ధ నీతి కథలు ‘పంచతంత్ర’ అఖిలాండ నాయకుని ఆనంద ఉత్సవం పోషకాహారమే జీవనాధారం సీజనల్ వ్యాధులకు చెక్ మార్కెట్ మాయలోజనం విలవిల మువ్వన్నెల వికసిత భారత్ భగవంతుని ప్రతిరూపం అమ్మ నేటి యువకులే రేపటి పాలకులు ఆరోగ్య సిరికి’నవ రత్నాలు ఆరోగ్య సిరికి’నవ రత్నాలు ప్రసిద్ధ నీతి కథలు ‘పంచతంత్ర’

Teachers : కాంతి దాతలు.. శాంతి దూతలు గురువులే

Hema
Teachers : కాంతి దాతలు.. శాంతి దూతలు గురువులే

గురుదేవ.. గురువునే దైవంగా భావించడం. విశ్వ కళాక్షేత్రంలో విజ్ఞానం నిండించేది, విద్యార్థినీ విద్యార్థుల మదిలో బంగారం పండించేదీ గురువే! ఉపాధ్యాయుడు, బోధకుడు, అధ్యాపకుడు, శిక్షకుడు, ఆచార్యుడు, ప్రాచార్యుడు.. ఇలా ఎన్నో పేర్లు. ఏ స్థాయిలోనైనా, ఏ దశలో అయినా గురువు గురువే; బోధన ప్రాధాన్యం బోధనదే. జగతి ప్రగతి మార్గంలో జైత్రయాత్ర సాగించాలన్నా, జనహృదిలో విజయభేరి మోగించాలన్నా ఆ శక్తీ యుక్తీ గురువర్యునికే. ఉర్వికెల్ల కాంతిదాత, అచ్చమైన శాంతిదూత టీచరే. పురుషులైనా, మహిళలైనా ఆ ‘టీచింగ్’ ప్రతీ బాలికకీ, బాలుడికీ జీవితమంతా గుర్తుంటుంది. ఒకే ఒక్క మాటలో టీచర్లు ‘వైతాళికులు’. విద్యాలయం లోపలా, వెలుపలా జీవన రీతిని తీర్చిదిద్దే మార్గదర్శకులు. సెప్టెంబరు ఐదున భారత జాతీయంగా, సరిగ్గా నెల రోజులకు అక్టోబరు ఐదున ప్రపంచ వ్యాప్తంగా ఊరూ వాడా ఉపాధ్యాయుల దినోత్సవం (Teacher’s Day)

‘ఆచార్య దేవోభవ’ కర్త అన్నట్లు విద్యాబుద్ధులు నేర్పేవారి మాట వరాల మూట! గురువుల సన్నిధే విద్యార్థులకు పెన్నిధి.

కాలం అనేది నిరంతర జీవధార. ఆగకుండా సాగుతూనే ఉంటుంది. అంతటి వేగ గమనంలో ఆగేదీ ఒక్కోమారు దారి మళ్లేదీ మనిషే. నిత్యకృత్యాల పెను ఒత్తిళ్ల మధ్య అతను/ఆమె పరిభ్రమించడమే లోకరీతి. ఆ భ్రమణ పర్వంలో అజ్ఞాన తిమిరాన్ని తొలగించి విజ్ఞాన దీపాన్ని వెలిగించడమే గురు లక్ష్యం, లక్షణం. మేలుకొలుపు పాడి, మేలిమి బాటన నడిపించినందునే గురువుకి ఇంతటి దైవత్వం. బాల్యంతో పాటు యౌవన, కౌమార, వార్ధక్యం దశలన్నింటా లెక్కకు మిక్కిలి అనుభూతులు, అనుభవాలు. వీటిలో మరపురానివి పాఠశాల దశలో అనేకం. అందుకే ప్రాథమిక స్థాయిన గురువులెవ్వరినీ మనం మరవలేం. వారిని తలవకుండా ఉండలేం!

మన దేశంలో ఉపాధ్యాయ దినోత్సవం ఉత్సాహం సెప్టెంబరు ఐదున అంతటా వెల్లివిరుస్తుంది. ఆ రోజునే ఎందుకంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు: వ్యక్తిగతంగా తనకు కాదు.. ‘ఉపాధ్యాయులందరికీ’ ఉత్సవం చేయండని చెప్పిన రోజు. “ఎప్పుడైనా స్పష్టమైన ఆలోచన బోధకుడు పొత్తు” అనేది ఆయన నిశ్చిత అభిప్రాయం. అంతకుమించి ప్రగాఢ విశ్వాసం. అందువల్లనే దేశంలో ఉపాధ్యాయ దినోత్సవానికి అంతటి సుపుసిద్ధత. ఆంధ్రా విశ్వవిద్యాలయంతో పాటు బెనారస్ హిందూ వర్సిటికీ ఉప కులపతిగా పని చేశారాయన. మద్రాసు కళాశాలలో తత్వశాస్త్ర బోధన చేసిన ఆచార్యవర్యులు. కోల్కతాలోనూ
బాధ్యతలు ‘భారతీయ తత్వశాస్త్రం’ పేరిట గ్రంథ రచన చేశారు.

ఒక సందర్భంలో మాతృభాష (mother tongue) గురించి మాట్లాడుతూ “మనల్ని ఎప్పుడూ కలిపి ఉంచేది. అమ్మభాష. మీది అభిమానమే” అనడం ఆయన గురుత్వానికి గురువులే… ఆయన తెచ్చిన గుర్తింపు, గౌరవం అపారం. ‘ఆదర్శవాది జీవిత దృక్పథం’ అంటూ భాష, బోధన, శాస్త్రం, కళలు, ప్రయోజనాలకు సంబంధించిన అభిప్రాయాలను విపులీకరించారు. ఆత్మకథ ‘సత్యశోధన’లో సైతం బోధన అనుభవాలను విపులీకరించారు. (ఉదాహరణలతో సహా). ఇంతింత ఘనతర చరితను సొంతం చేసుకున్న ఆయన చదువుకున్నది తిరుపతిలోని ఒక పాఠశాలలో, ఉపకార వేతనాలతోనే విద్యాభ్యాసమంతా కొనసాగింది. మద్రాసులో అధ్యాపకుడిగా చేరినపుడు వయసు ఇరవై యేళ్లు. నిత్యమూ గంటల తరబడి చదివేవారు. కళాశాల యువతను ఎంతగానో ఆకట్టుకునేలా పాఠాలు చెప్పేవారు. రూపొందించి, సభావేదికల పైన సమర్పించిన పరిశోధన పత్రాలూ లెక్కలేనన్ని. మైసూరు ప్రాంతంలోనూ యూనివర్సిటీ యువతరం రాధాకృష్ణన్ బోధన వినేందుకు ఎంతెంతో ఉత్సుకత చూపడం విశేషాంశం. శిష్యవాత్సల్యానికి ప్రతిగా ఎంతటి అద్భుత గురుదక్షిణ లభించిందో తెలుసుకుందాం.

మాటా, బాటా ఒకటే!

అప్పట్లో రాధాకృష్ణన్కు మైసూరు నుంచి కోల్కతాకు బదిలీ అయింది. అప్పుడు ఆయన ప్రొఫెసరుగా ఉంటుండేవారు. వీడ్కోలు పలికేందుకు వందలాది విద్యార్థులు తరలివచ్చారు. యంత్రం వాహనం కాదు, ఒక గుర్రపు బండిని అందంగా అలంకరించారు. పలు రకాల పూలతో ఆసాంతం దిద్దితీర్చారు. బండిలో గురువును కూర్చోబెట్టి ప్రయాణమై వెళ్లే రైల్వే స్టేషన్ వరకు బండిని లాగుతూ తీసుకెళ్లారు. కాలు కింద పెడితే కందిపోతుందా? అన్నంత అపురూపంగా చూసుకున్నారు. అందులో మానవ శ్రమ కన్నా గౌరవాభిమానాలు వ్యక్తమయ్యాయి. అదంతా తనలోని బాధ్యతాయుతపు ప్రవృత్తిని రెట్టింపు చేసిందని, మంచిమాట-మేలిమి బాటను పరుస్తుందని తేటతెల్లమైందనీ స్వీయ చరిత్రలో రాసుకున్నారాయన. తన బోధనాంశాలను ంశాలను శిష్యులు ఆచరణకి తేవడమే నిజమైన గురుసత్కారమని వ్యాఖ్యానించారు.

ప్రాచ్య పాశ్చాత్య తత్వ జ్ఞాన సమ్యక్ సమన్వయంబడిన మహా మనస్వి! ఖండ ఖండాంతర ఖ్యాతమౌ దివ్య వాగమృతంబు కురియు.. ఆహో యశస్వి! జ్ఞాన నిష్ఠకు కర్మ సంధానమందించు ఆత్మజ్ఞుడైన నవ తపస్వి! పరమ శాంతోదార పరిపూర్ణ భావ వాంతర్యమెరుగు జయ వచస్వి! ధర్మ సంస్కృతి తెలుపు అద్వైతమూర్తి! అఖిల తత్వమ్ము నరయు మహామనీష నిండి వెలుగు రాధాకృష్ణ పండితేంద్ర!
అని అక్షరాంజలి సమర్పిస్తోంది విద్యార్థి లోకమంతా. సర్వేపల్లిది నాలుగు దశాబ్దాల అధ్యాపకత్వం. అన్ని విద్యలకూ కీలకం వ్యక్తిత్వ నిర్మాణం అనేవారు. ఉన్నతస్థాయి మనస్కులే ఉపాధ్యాయులుగా ఉండాలని కోరుకున్నారు. పుస్తకాలను సాంస్కృతిక వారధులుగా అభివర్ణించారు. జ్ఞానం మనకు శక్తి ఇస్తే, పరిపూర్ణతనిచ్చేది ప్రేమతత్వమేనని చాటిచెప్పారు. అసలైన గురువులు ఆలోచనల వ్యాప్తికి కారకులని ప్రస్పుటం చేశారు. నైతిక మార్పు తెచ్చేదీ ఉత్తమ విద్యా విధానం. ఆచరణకు తేవాల్సింది బోధకులేనని ప్రకటించారు. మంచి పనులకు పునాది క్రమశిక్షణ. అది ఉపాధ్యాయుల వల్లనే లభిస్తుందన్నది నాడూ నేడూ ఏనాడూ అక్షర సత్యం. “నీ భవితను నువ్వే నిర్ణయించుకో” అని చెప్పే వ్యక్తి టీచరే! బాలలు మొదలు అందరికీ ఇచ్చే సందేశం, ఉపదేశం ఇదే.

Teachers : కాంతి దాతలు.. శాంతి దూతలు గురువులే
Teachers : కాంతి దాతలు.. శాంతి దూతలు గురువులే

జాతీయ, అంతర్జాతీయ ప్రశస్తి

‘టీచర్స్ డే’ అంటే కేవలం సభలూ, సమావేశాలూ కాదు. జిల్లా, రాష్ట్ర, జాతీయ తీయ స్థాయి పురస్కారాల పరంపరలు మాత్రమే కావు. నిజానికి ఇదే సెప్టెంబరు నెలలో అర్జెంటీనా, చైనా, హాంకాంగ్, సింగపూర్లలోనూ
ఉపాధ్యాయ దినోత్సవాలు జరుగుతాయి. అంతర్జాతీయంగా అక్టోబరులో ఆస్ట్రేలియా, అజర్బైజాన్, బ్రెజిల్, చిలీ, లిథువేనియా, పాక్, ఫిలిప్పైన్స్, పోలండ్, రష్యా దేశాల్లో జరుగుతుంటాయి. ప్రపంచ దినోత్సవం నిర్వహణ విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ (ఐక్యరాజ్యసమితి అనుబంధం) నుంచి మొదలైంది. దరిదాపు ఆరు దశాబ్దాల క్రితం ప్యారిస్లో ఏర్పాటైన ప్రత్యేక సదస్సు ప్రపంచంలోని ఉపాధ్యాయుల స్థితిగతులను చర్చించింది. సమగ్ర పత్రాన్ని రూపుదిద్ది ఆమోదించిన తేదీ అక్టోబరు ఐదు. ఆ కారణంగానే విశ్వవ్యాప్త దినోత్సవాన్ని ఏటా ఆ రోజున నిర్వహిస్తున్నారు. విద్యాలయాల బోధకుల బాధ్యతలు, హక్కులను గుర్తు చేస్తున్నారు. వారి హోదాను పెంపొందించడం కీలక అంశం.

జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ఇదే ప్రధానం!

నినాదాలూ.. విధానాలూ.. ఈ సందర్భంలో పాఠశాలల, కళాశాలల, విశ్వవిద్యాలయాల బోధకుల పని పరిస్థితులను చర్చిద్దాం. “అందరికీ నాణ్యమైన విద్య” నినాదంగా ముందుకొచ్చింది 2019 జాతీయ విధానం. పారదర్శక రీతిన ఉపాధ్యాయ నియామకాలు జరపాలంది. పనితీరు అంచనాలు, మదింపులతో పదోన్నతులు ఉంటాయంది. శిక్షణకు సంబంధించి, అత్యాధునిక విధానాలు అనుసరిస్తా మంది. వృత్తి పరంగా టీచర్ల సంఘాలను సుశిక్షతం చేయాల్సిన అవసరాన్నీ నొక్కి చెప్పింది. బలోపేతం చేయడమన్నది ఇందులో అంతర్లీనం. ఉన్నత విద్యాపరంగా ఏకీకృత వ్యవస్థకు చర్యలు తీసుకుంటామని హామీనిచ్చింది. సృజన, నైపుణ్య శక్తులకు పెద్ద పీట వేస్తామంది. ఈ ఏడాది(2025) చివరి నాటికి సగం శాతం అభ్యాసకులకు వృత్తి విద్యను అందించాల్సి ఉంటుందన్న మాట. భారతీయ భాషల ఉన్నతీకరణ, దీటుగా శాస్త్రాల విస్తరణను ప్రతిపాదించింది.
ఆశలూ, ఆశయాలూ ఎన్నో ఉన్నాయి. ఊరిస్తూ ఎదుట కనిపిస్తున్నాయి. విద్యా మంత్రిత్వశాఖ పరిధిలో చేయాల్సినవి లెక్కలేనన్ని. బాలబాలికల్లో అభ్యాస సంక్షోభాన్ని నివారించాలని కేంద్రం, రాష్ట్రాలు తమ వంతు ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాయి. అవి ఏ మేరకు సఫలీకృతం అయ్యాయనేది ఇప్పుడు మన కళ్లకు కడుతూనే ఉంది. ఇందులో బోధకుల బాధ్యత అత్యంత ప్రథమం.

ప్రతీ తరగతి గదిలోనూ విద్యార్థి- ఉపాధ్యాయ నిష్పత్తి ఆశావహంగా ఉండాలి కానీ ప్రస్తుతం అటువంటి ‘వాతావరణం’ ఎక్కడుంది?

వచ్చే 2030 నాటికి (మరో ఐదేళ్లకు) సార్వత్రిక నాణ్యనాయుత విద్య అనేది కాగితాల్లో నలుగుతోంది ఇంకా. విద్యాహక్కు చట్ట విస్తరణలు, సమాజ అవసరాలకు తగిన రీతిలో పాఠ్య ప్రణాళికలు, ఉపాధ్యాయ వృత్తికి భరోసాలన్నవీ నాయకుల ప్రకటనల్లోనే వినవస్తున్నాయి. ఏ మార్పుకైనా మార్గ నిర్దేశకులు ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులే. ‘బలమైన ప్రక్రియ ద్వారా వారి నియామకాలు’ వాగ్దానాలకే పరిమితం కాకూడదు. మరో విషయం.. పాఠశాల/కళాశాల పనివేళల్లో ఎటువంటి అవాంతరాలూ లేని బోధన. ఇది ఎంత వరకు సుసాధ్యమవుతోందో పలు అనుభవాలే వెల్లడిస్తున్నాయి.

అనుదినానుబంధం

ఉపాధ్యాయునికీ, ‘కాలసూచిక’కీ అవినాభావ సంబంధముంది.

‘ఆ గడియారం ఆగేది కాదు; కాలంతో పాటు సాగేది చేతికి పెట్టుకున్నా, టేబుల్ మీద పడుకోబెట్టినా దాని చలన శీలంలో మార్పంటూ ఉండదు పగలైనా రాత్రి అయినా సచేతనమే. గడియారమే ఉపాధ్యాయ దినచర్యకు దిక్సూచి ఎవరైనా ఎప్పుడైనా బద్దకించి నియమ ఉల్లంఘన చేసినపుడు గడియారం మౌనంగా హుంకరిస్తుంది కార్యక్రమాలను నిర్దేశించేది డైరీ అయినా సారధ్యం వహించేది మాత్రం గడియారమే అదృశ్యంగా కదిలిపోయే కాలానికి అదొక దృశ్య ప్రతీక, వృత్తి నిబద్ధతకు పతాక’
ఆధ్యాపక నియామక ప్రక్రియ అంతా విద్యా విషయ నిపుణుల ఆధారంగా జరగాల్సి ఉన్నా, పరిస్థితులు వేరుగా గోచరిస్తున్నాయి. స్వేచ్ఛాయుత పరిశోధనలు, వేతనాల నిర్వహణలు, క్షేత్ర స్థాయి ప్రయోజనాల రీత్యా జరిగినవికొన్నే: ఇంకా జరగాల్సినవి ఎన్నెన్నో. విద్యా రంగంలో సంసనకరణల పేరుతో నిత్యమూ మార్పు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. వాటి ఫలితాలు మటుకు ఎవరికీ అంతుపట్టని రీతిలో ప్రత్యక్షమవుతున్నాయి. బోధకుల సర్వీసు నిబంధనలకు సంబంధించి, ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఇప్పటికీ ఉన్న అసంబద్ధతను తొలగించాలనీ సంఘాలు నినదిస్తున్నాయి, ఉద్యమిస్తున్నాయి. ఉన్నతీకరించిన భాషా పండితుల పోస్టులను పదోన్నతులతో ప్రభుత్వం పూరించాలంటున్నాయి. తెలుగు మాధ్యమాన్ని కొనసాగించాలని ఉభయ తెలుగు రాష్ట్రాల (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) ఉపాధ్యాయ బంధాలూ కోరుతూనే ఉన్నాయి. బడిపిల్లల అవసరాల మేర టీచర్ల ఖాళీలను భర్తీ చేయడం, ఇతరేతర పనిభారాన్ని తగ్గించడం, బోధనతో సంబంధం లేని వాటిని పరిహరించడం, పాఠశాలల్లో రాజకీయ జోక్యాన్ని నియంత్రించడం అనేవీ మరికొన్ని విన్నపాలు.

Teachers : కాంతి దాతలు.. శాంతి దూతలు గురువులే

సంతృప్తి ఎప్పుడు, ఎక్కడ?

వీటన్నింటి రణగొణల నడుమ మళ్లీ ఇప్పుడు ఉపాధ్యాయ దినోత్సవం వచ్చేసింది. విద్యా వికాసం అనే పదమైతే పరివ్యాప్తమైంది. స్వయంపోషక స్వతంత్ర పాఠశాలల అంశమూ విస్తృత చర్చకొచ్చింది. చట్టాలు, నియమాలు, నిబంధనలు, సంస్కరణలు- వీటి మాట ఎలా ఉన్నా- ఉపాధ్యాయులకు వృత్తి పరమైన సంతృప్తి మిగులుతోందా? అన్నదే ప్రశ్న. వారు సరిగ్గా పాఠాలు చెప్పడం లేదని తల్లిదండ్రులు, చేయాల్సి వని ఇంకా చేయడం లేదని విద్యాశాఖ అధికారులు, ఇది చాలదన్నట్లు నానా రకాల కార్యక్రమాల జోరూ శిక్షణ పరంపరల హోరుతో ఉపాధ్యాయ హృదయం ఉక్కిరి బిక్కిరవుతోంది. పిల్లలకు భయభక్తులు నేర్పడమన్నది టీచర్లకు సవాలుగా మారుతోంది మరి. ఈ మాదిరి స్థితిలో ఒకరోజు ఉత్సవంతో ఒరిగేదేమిటి?

బోధక వృత్తిని ఎవరైనా ఎందుకు ఎంచుకుంటారు?

  • విద్యార్థుల మీద శాశ్వత ప్రభావం ఉంటుందని.
  • ఉపాధ్యాయ వృత్తిలో స్థిరత, భద్రత తగినంత కలుగుతుందని.
  • ప్రవీణత, నిపుణతకు ఆస్కారం ఏర్పడుతుందని.
  • ఏ రోజుకు ఆ రోజు బోధనలో సంతృప్తిని ఆస్వాదించవచ్చని.
  • పిల్లలకు మంచి భవిష్యత్తు చూపాలని, మేలు చేయాలని.
  • పరీక్షలను ఎదుర్కొనేలా తయారు చేయాలని, పటిమను పెంచాలని.
    ఇవాళ ఎదురవుతోంది ఏమిటి? అసలంటూ ఏం జరుగుతోంది?
  • పిల్లల ప్రవర్తనను నియంత్రించడం కష్టతరమవుతోంది. వాళ్ల కట్టూ-బొట్టూ వేష భాషల గురించి ఏ ఉపాధ్యాయుడూ నోరు తెరవలేని పరిస్థితి.
  • బడిలోపలా, వెలుపలా కూడా టీచర్లకు అభద్రత. పాఠశాల వ్యవహారాల్లో ఊరి రాజకీయాలు, అధికారులు తెచ్చే రోజువారీ ఒత్తిడితో కలత.
    బోధనేతర పనులు, ఏవేవో గణాంక సమీకరణలు, విద్యార్థుల పరీక్షలతో ప్రమేయం లేని నానా రకాల కార్యక్రమాలతో విసిగివేసారుతున్నారు టీచర్లు.
  • విధుల కేటాయింపు, చీటికీ మాటికీ మార్చడం, బదిలీల తీరుతెన్నులు, కొన్ని ఉపాధ్యాయ సంఘాల అత్యుత్సాహం వల్ల అవస్థలు.
  • ఎక్కడ ఏ సభ జరిగినా పిల్లలను తలించడమన్నది ఇంకా సంభవిస్తోంది. బడిలోపల ఉండాల్సిన వాళ్లను వెలుపలికి రప్పించి, నాయకులకు స్వాగతాలంటూ ఎండల్లో నిలబెడుతుండటం ఎక్కువవుతోంది. దీనికి ఉపాధ్యాయులను వినియోగించడమన్నది అన్ని విధాలా శోచనీయమే.
  • ఉత్తీర్ణత శాతం పెంచడమన్నది టీచర్ల బాధ్యతే. అలా అని వారి మీద ఒత్తిళ్లు పెంచి ఆరోగ్యం దెబ్బ తినేలా చేయడం క్షంతవ్యం కాదు. అధికార వర్గాలు, రాజకీయ ప్రాబల్యాలు కలగలిసి విద్యా వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయి.

ఉత్తమత్వానికి బహుకృతి

ఉదాత్త వృత్తి-బోధన. ఆ ఉత్తమత్వానికే ప్రభుత్వాలు ఏటా పురస్కారలిచ్చి సత్కరిస్తున్నాయి. జాతీయంగా గౌరవాదరాలు అందచేస్తున్నాయి. అంతర్జాతీయంగా పేరొందిన గురూత్తముల్లో న్యూటన్ శాస్త్ర సిద్ధాంత కర్త. స్వతహాగా ఉపాధ్యాయుడు. సంఖ్యల పితామహుడుగా పేరొందిన పైథాగరస్ బోధకుడు. భౌతిక శాస్త్రంలో పరమోన్నత నోబుల్ పురస్కృతిని

అందుకున్న ఐన్స్టీన్ ఒక టీచరు. బహుముఖ ప్రజ్ఞాశాలి. అరిస్టాటిల్ ఉపాధ్యాయుడు, విద్యా సంస్థ స్థాపకుడు కూడా. మన దేశానికి చెందినంత వరకూ తొలి ఉపాధ్యాయిని సావిత్రీబాయి ఫూలే. ఎందరో మహనీయులు. వారందరికీ వందనాలు.

అనుభవశీలతను గుర్తించి గౌరవించాలందరూ, నిజాయితీ నిబద్ధతలకు గుర్తింపునివ్వాలి ఎప్పుడూ. నిరుడు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు ఉభయ రాష్ట్రాల నుంచీ నలుగురు ఎంపికయ్యారు. వారికి గురుపూజ ఉత్సవం రోజున నగదు మొత్తం, పతకం, ప్రశంసా పత్రంతో ఘన సత్కారాలు చేశాయి తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు. విజేతల్లో ఒకరిది ప్రయోగాత్మక విద్యాబోధన. మరొకరిది సాంకేతిక పరిజ్ఞాన వినియోగ చాతురి. ఇంకొకరిది బాలలను అనేకానే పోటీల్లో విజేతలను చేసిన దక్షత. వేరొకరిది శాస్త్రీయ అవగాహన పెంచడంలో కృషి. ప్రతీ సంవత్సరం పదుల సంఖ్యలో రాష్ట్ర స్థాయి పురస్కారాలిచ్చి, క్రమంగా వాటిని శతాధికంగా మలచి, ఉత్సా హపూరితంగా వ్యవహరిస్తున్నాయి రెండు ప్రభుత్వాలు. బోధక దినోత్సవం ఆ ఒక్కరోజే అని కాకుండా నిరంతరమూ వెలుగులీనాల్సిందే. అందుకు సమాజంలోని అందరిదీ సమబాధ్యత. సర్వేపల్లివారు చెప్పిందీ ఇదే!

ప్రదాన మాధురి

దాదాపు ఒకటిన్నర దశాబ్దం కిందట తెలంగాణ భాగ్యనగరంలో గురుపూజోత్సవాలు అంగరంగ వైభవంగా ఏర్పాటయ్యాయి. శ్రీమతి కందుకూరి రాజ్యలక్ష్మమ్మ మహిళా కళాశాల (రాజమహేంద్రవరం) అధ్యాపకురాలు డాక్టర్ జె.లలిత భారతి 2012 సెప్టెంబరు ఐదో తేదీన అప్పటి పాలక ప్రముఖుల చేతుల మీదుగా ఉత్తమ అధ్యాపక పురస్కృతిని స్వీకరించారు. ఆ వేదిక హైదరాబాద్లోనిది. నిర్వహించింది అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ. అనంతర కాలంలో ఉభయ రాష్ట్రాల్లోనూ ప్రతీ వత్సరం పురస్కార ప్రదానోత్సవాలు ఏర్పాటవుతున్నాయి. గురు-శిష్య స్ఫూర్తికి ఉదాహరణలవుతున్నాయి. ప్రదాన సందర్భాల్లో నేతలు తమ గురువులను తలచుకుని భావోద్వేగాలకు లోనైన దృశ్యాలు ఎన్నో! ఈ సంవత్సరం అవార్డుల పరంగా ఎంపిక ప్రమాణాలు నిర్దేశించారు. మార్గదర్శకాలను జారీ చేశారు, విధానాన్ని రూపుదిద్దారు.

Read also: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/goods-sales/cover-stories/531850/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870