हिन्दी | Epaper
అఖిలాండ నాయకుని ఆనంద ఉత్సవం పోషకాహారమే జీవనాధారం సీజనల్ వ్యాధులకు చెక్ మార్కెట్ మాయలోజనం విలవిల మువ్వన్నెల వికసిత భారత్ భగవంతుని ప్రతిరూపం అమ్మ నేటి యువకులే రేపటి పాలకులు ఆరోగ్య సిరికి’నవ రత్నాలు ఆరోగ్య సిరికి’నవ రత్నాలు ప్రసిద్ధ నీతి కథలు ‘పంచతంత్ర’ అఖిలాండ నాయకుని ఆనంద ఉత్సవం పోషకాహారమే జీవనాధారం సీజనల్ వ్యాధులకు చెక్ మార్కెట్ మాయలోజనం విలవిల మువ్వన్నెల వికసిత భారత్ భగవంతుని ప్రతిరూపం అమ్మ నేటి యువకులే రేపటి పాలకులు ఆరోగ్య సిరికి’నవ రత్నాలు ఆరోగ్య సిరికి’నవ రత్నాలు ప్రసిద్ధ నీతి కథలు ‘పంచతంత్ర’ అఖిలాండ నాయకుని ఆనంద ఉత్సవం పోషకాహారమే జీవనాధారం సీజనల్ వ్యాధులకు చెక్ మార్కెట్ మాయలోజనం విలవిల మువ్వన్నెల వికసిత భారత్ భగవంతుని ప్రతిరూపం అమ్మ నేటి యువకులే రేపటి పాలకులు ఆరోగ్య సిరికి’నవ రత్నాలు ఆరోగ్య సిరికి’నవ రత్నాలు ప్రసిద్ధ నీతి కథలు ‘పంచతంత్ర’ అఖిలాండ నాయకుని ఆనంద ఉత్సవం పోషకాహారమే జీవనాధారం సీజనల్ వ్యాధులకు చెక్ మార్కెట్ మాయలోజనం విలవిల మువ్వన్నెల వికసిత భారత్ భగవంతుని ప్రతిరూపం అమ్మ నేటి యువకులే రేపటి పాలకులు ఆరోగ్య సిరికి’నవ రత్నాలు ఆరోగ్య సిరికి’నవ రత్నాలు ప్రసిద్ధ నీతి కథలు ‘పంచతంత్ర’

Hearts hacked cyber shock! : గుండెలు హ్యాక్  సైబర్ షాక్!

Abhinav
Hearts hacked cyber shock! : గుండెలు హ్యాక్  సైబర్ షాక్!

సైబర్ నేరాలు నేడు ప్రపంచ వ్యాప్తంగా అతిపెద్ద సమస్యగా మారింది. భారత్ సహా అన్ని దేశాలు సైబర్ నేరాల బారినపడి విలవిలలాడుతున్నాయంటే పరిస్థితి తీవ్రతను ఊహించుకోవచ్చు. ఈ ఏడాది గత అక్టోబర్ నెల వరకు ప్రపంచ వ్యాప్తంగా 108.9 మిలియన్ల సైబర్ కేసులు (పది కోట్ల 89 లక్షలు) నమోదు కాగా ఇందులో భారత్లో నమోదైనవి 20 లక్షలకు పైగానే వున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఏటా లక్ష కోట్ల రూపాయలను సైబర్ నేరగాళ్లు దోచుకుంటుండగా భారత్ నుంచి 22 వేల కోట్ల రూపాయల వరకు వుంటోంది. సైబర్ నేరాలు గతంలో వున్నట్లుగా ఏదో ఒకటి లేదా రెండు రూపాలకు పరిమితం కాకుండా అనేక రూపాల్లో ఇది విస్తరించి అన్ని రంగాల వారిని పీడిస్తోంది. ఈ నేపథ్యంలో సైబర్ నేరాల నివారణకు సరైన జాగ్రత్తలు పాటించడం, ఉన్నత -ప్రమాణాలను అనుసరించడం ఒక్కటే మార్గమని సైబర్ నిపుణులు చెబుతున్నారు. సైబర్ నేరాలు అభివృద్ధి చెందిన దేశాలతో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాలను కూడా పీడిస్తున్న అంశంగా మారి అన్ని దేశాలకు కొరకురాని కొయ్యగా మారింది. గతంలో సెల్ఫోన్లలో వచ్చే బహుమతుల సైబర్ నేరంగా చెప్పుకునేవారు. కానీ నేడు అంతకు మించిన నేరాలు అన్ని వర్గాలను హడలెత్తిస్తున్నాయి. పెట్టుబడుల మోసం, మార్టిమోనియల్ మోసం, విదేశీ వస్తువుల గిఫ్ట్ మోసం, డిజిటల్ అరెస్టు, ఫోన్ల హ్యాకింగ్ ద్వారా వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసి వారికి తెలియకుండా బ్యాంకుల్లోని నగదును దోచుకోవడం వంటివి పెరిగాయి.

వీటికి తోడుగా బ్యాంకుల సర్వర్లను, గేట్ వే పేమెంట్లను హ్యాక్ చేసి నిమిషాల వ్యవధిలో కోట్లాది రూపాయలను కాజేయడం, ఆన్లైన్ల ద్వారా నగదు చలామణి సంస్థలకు -వస్తున్న మెసేజ్లు, డేటా ఉల్లంఘనల కేసులు మరిన్ని నేరాలకు బాట వేస్తున్నాయి. ఇటీవల కాలంలో డిజిటల్ అరెస్టుల పేరిట అనేక మందిని సైబర్ నేరగాళ్లు టోకరా వేసి పదుల కోట్ల రూపాయలను దోచుకున్న తీరు సంచలనం రేపుతోంది. గడచిన ఐదేళ్ల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా సైబర్ నేరాలు 200 శాతం పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. సైబర్ నేరాలలో ఎప్పటి నుంచో వుంటూ ఇప్పటికీ నిపుణులకు అంతు చిక్కకుండా వున్న నేరం ఫిషింగ్. ఇంటర్నెట్ వాడుతున్న ‘వారిలో అనేక మంది దీని బారిన పడిన ఉదంతాలు న్నాయి. బ్రిటన్, అమెరికాలో ఈ ఏడాది 50 శాతం మంది వ్యాపారులు సైబర్ నేరగాళ్ల బారినపడినట్లు గణాంకాలు చెబుతున్నాయి. గతంలో ఇది 83 శాతంగా వుండేది. గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా డేటా ఉల్లంఘనల నేరాల వల్ల 4.88 మిలియన్ల నష్టం వాటిల్లిందని సైబర్ నే రాల విభాగం చెబుతోంది. ఇదే సమయంలో 236 మిలియన్ రాన్సమ్ వేర్ సైబర్ దాడులు జరిగాయి. వీటితో పాటు మాల్వేర్ దాడులు కూడా అనేక రంగాలను కలవరానికి గురిచేస్తున్నాయి. ప్రపంచంలోని అన్ని కార్యకలాపాల కోసం ఇంటర్నెట్ను వాడాల్సి వుండడం, ఇందులో చాలా మంది తగిన జాగ్రత్తలు పాటించక పోవడం, నిపుణులైన ఐటి సిబ్బంది పర్యవేక్షణ వుండకపోవడం సైబర్ నేరగాళ్లకు ఊతంగా మారిందని సైబర్ నిపుణు చెబుతున్నారు. 

ఇక సైబర్ నేరాల నివారణకు పటిష్టమైన ప్రాంతాలకు చెందిన వ్యాపారులు తమ వ్యాపార భద్రతను కలిగివున్న దేశాలలో పోలాండ్ 90.93 శాతంతో మొదటి స్థానంలో వుండగా ఎస్టోనియా 85.83 శాతంతో రెండవ స్థానంలోనూ, ఉక్రెయిన్ 80.83 శాతంతో మూడవ స్థానంలోనూ లాట్వియా 79.17 శాతంతో నాలుగవ స్థానంలోనూ, బ్రిటన్ 75 శాతంతో ఐదవ స్థానంలో వుంది. భారత్ ఈ విషయంలో 40 శాతంలోపు కూడా లేకపోవడం గమనార్హం. ఇక సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలు ఆసియాలోనే వుండడం గమనార్హం. మొత్తం నేరాల్లో ఆసియాలో 26 శాతం, యూరప్లో 24 శాతం, ఉత్తర అమెరికాలో 23 శాతం, మధ్య ప్రాచ్చం, ఆఫ్రికా దేశాలు 14 శాతం, లాటిన్ అమెరికా 13 శాతం వాటా వుంది. ప్రపంచ వ్యాప్తంగా కలవరపెడుతున్న సైబర్ నేరాలలో డేటా ఉల్లంఘన కేసులు. ఈ విషయంలో చైనా 48.52 శాతంతో మొదటి స్థానంలో వుండగా ఇక్కడ 14,15 లక్షల 7775 కేసులున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. జపాన్లో 14.23 శాతంతో కోటీ 24 లక్షల 6373 కేసులు, దక్షిణ కొరియాలో 10.07 శాతంతో కోటి 66 లక్షల 9124 కేసులున్నాయి. భారత్ పొరుగు దేశం శ్రీలంకలో 14 లక్షల 40 వేల 432 కేసులు నమోదయ్యాయి. సైబర్ నేరాలకు అడ్డాగా వున్న మియన్మార్లో 17 వేల 887 కేసులు, ఇరాక్లో 16 వేల 113 కేసులు నమోదయ్యాయి. ఈ కామర్స్ మోసం వల్ల గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా రిటైల్ రంగానికి 48 బిలియన్ల నష్టం వాటిల్లింది. 

ఇక ఆన్లైన్ చెల్లింపులపై రక్షణ ప్రమాణాలు పాటించకుంటే 2027 నాటికి 343 బిలియన్ల నష్టం కలుగుతుందని సైబర్ నిపుణులు చెబుతున్నారు. భారత్ వరకు వస్తే సైబర్ నేరాలు అనేక రంగాలను కుదేలు చేస్తోంది. 2018 లో రెండు లక్షల 8456 కేసులు మాత్రమే నమోదు కాగా 2025 అక్టోబర్ వరకు వచ్చే సరికి ఇది 20 లక్షలకు చేరింది. భారత్కు చెందిన 70 శాతం పైగా కంపెనీల రాన్సమ్వేర్ దాడిని చవిచూస్తున్నట్లు సైబర్ క్రైం పోర్టల్ నివేదిక చెబు తోంది. భారత్లో అత్యంత సాధారణ సైబర్ నేరం ఆర్థిక మోసంగా గణాంకాలు చెబుతున్నాయి. 2020 నుంచి 2024 మధ్య కాలంలో వెలుగు చూసిన మొత్తం సైబర్ నేరాలలో 77 శాతం ఇవే కావడం గమనార్హం. డిజిటల్ అరెస్ట్ డిజిటల్ అరెస్టు వరకు వస్తే భారత్ లో ఈ ఏడాది అక్టోబర్ నెల వరకు 90 వేల పైచిలుకు కేసులు నమోదవగా వీటి వల్ల రెండు వేల కోట్ల రూపాయలను బాధితుల నుంచి సైబర్ నేరగాళ్లు దోచుకున్నారు. 2024 లో డిజిటల్ అరెస్టులకుగానూ 1935.51 కోట్ల రూపాయలను సైబర్ నేరగాళ్లు దోచుకున్నారు. దీని తరువాత జాఫ్ ఫ్రాడ్, ఆన్లైన్ ఫ్రాడ్, మాట్రిమోనియల్ ఫ్రాడ్ కేసుల్లో మరో పది వేల కోట్ల రూపాయలు లూటీ అయ్యాయి. వీటికన్నా భిన్నంగా సర్వర్లతో పాటు గేట్ వే పేమెంట్లను హ్యాక్ చేయడం ద్వారా యేటా సైబర్ నేరగాళ్లు వెయ్యి కోట్ల రూపాయల వరకు దోచుకుంటున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో ముఖ్యంగా చెప్పాల్సింది బంజారాహిల్స్ లోని మహేష్ బ్యాంక్ ఉదంతం గురించి. 2022 జనవరి నెలలో ఈ బ్యాంకు సర్వర్ను నైజీరియా నుంచి సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసి 12 కోట్ల రూపాయలను లూటీ చేశారు. 

వరుసగా రెండవ శనివారం, ఆదివారం సెలవులు రావడంతో నేరగాళ్లు బ్యాంకు సర్వర్లో చొరబడి ఖాతాలను ఖాళీ చేశారు. ఈ కేసులో కొందరు నేరగాళ్లు పట్టుబడినా దోపిడి సొమ్ము మాత్రం లభించలేదు. అంతకుముందు దేశ వ్యాప్తంగా మరో మూడు జాతీయ, సహకార బ్యాంకులు ఇదే తరహాలో లూటీ అయ్యాయి. దీంతో పాటు పలు కార్పొరేట్ సంస్థల గేట్ వే పేమెంట్లు కూడా ఇదే తరహాలో హ్యాక్ చేసిన నేరగాళ్లు కోట్ల రూపాయలను లూటీ చేశారు. ఇక భారత్లో సైబర్ నేరాలలో బెంగళూరు నగరం మొదటి స్థానంలో వుండగా, హైదరాబాద్ ద్వితీయ స్థానంలో, ముంబాయి తృతీయ స్థానంలో, ఢిల్లీ నాలుగు, లక్నో ఐదవ స్థానంలో వుంది. సైబర్ నేరాలకు సంబంధించి నేరగాళ్లపై ఛార్జిషీట్ల దాఖలులో ఈశాన్య రాష్ట్రం మిజోరం వంద శాతంతో దేశంలోనే అగ్రభాగాన నిలిచింది. ఉత్తరాదితో పాటు దక్షిణాది రాష్ట్రాల నగరాలు ఈ విషయంలో బాగా వెనుకబడ్డాయి. సైబర్ నేరాలకు అడ్డాగా వున్న రష్యా, తరువాతి స్థానాల్లో ఉక్రెయిన్, చైనా, అమెరికా సైబర్ నేరాల పేరు చెప్పగానే అందరు గోల్డెన్ ట్రయాంగల్ పిలిచే మియన్మార్, వియత్నాం, కాంబోడియా దేశాల పేర్లే అందరికి గుర్తుకు వస్తాయి. ఆసియా దేశాలు ముఖ్యంగా భారత్లో జరిగే 90 శాతం సైబర్ నేరాలకు గోల్డన్ ట్రయాంగల్ దేశాలే కీలకంగా వున్నాయని పోలీసు గణాంకాలు చెబుతున్నాయి. గోల్డన్ ట్రయంగల్ దేశాలను మించి సైబర్ నేరాలు జరిగేది రష్యా దేశం కావడం గమనార్హం. 

వరల్డ్ సైబర్ క్రైం ఇండెక్స్ 2024 అనే సంస్థ విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం ప్రపంచంలో జరిగే సైబర్ నేరాలకు మూలాలు రష్యాలోనే వున్నాయి. రష్యాలో పేరుమోసిన సైబర్ నేరగాళ్లు వున్నారని, వీరంతా ఎక్కడికి ప్రయాణించకుండా కేవలం వున్నచోటు నుంచే నేరాలకు పాల్పడుతూ కోట్లాది రూపాయలను కొల్లగొడుతున్నారని వరల్డ్ సైబర్ క్రైం ఇండెక్స్ 2024 వెల్లడించింది. రష్యా తరువాత సైబర్ నేరాలకు మూలాలు వున్న దేశం ఉక్రెయిన్గా ఆ సంస్థ పేర్కొంది. దీని తరువాత చైనా, అమెరికా, నైజీరియా, రొమేనియా దేశాలు సైబర్ నేరాలకు, బడా సైబర్ నేరగాళ్లకు సురక్షిత స్థావరాలుగా వున్నాయి. ఈ దేశాలలో వుండే బడా సైబర్ నేరగాళ్లు ప్రపంచంలోని అనేక దేశాలకు చెందిన సైబర్ నేరగాళ్లతో దోస్తీ వుండడం విశేషం. 2022 జనవరిలో హైదరాబాద్లోని మహేష్ బ్యాంకులో వెలుగు చూసిన సైబర్ క్రైంలో మూలాలు నైజీరియా, రష్యాలో వెలుగు చూడడం గమనార్హం. ఈ కేసులో సైబర్ నేరగాళ్లు 12 కోట్ల రూపాయల నగదును కాజేయడం అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. మహేష్ బ్యాంకు సర్వర్లో చొరబడి తెలివిగా బ్యాంకులోని కీలక సమాచారాన్ని చోరీచేసి దీని ఆధారంగా నగదును కాజేయడం బ్యాంకింగ్ రంగాన్ని షాక్ కు గురి చేసింది. ఈ కేసులో కొందరు నేరగాళ్లు పట్టుబడినా అసలైన నేరస్తులు ఇప్పటికీ చిక్కకపోగా పోయిన నగదు కూడా తిరిగిరాలేదు. గ్లోబల్ సైబర్ క్రైం నివేదిక ప్రకారం 2025 నాటికి ప్రపంచ దేశాలు సైబర్ భద్రతకు పది ట్రిలియన్ డాలర్లు (సుమారు 300 కోట్ల రూపాయలు) ఖర్చు చేయాల్సి వుంటుంది. 

ఇదే సమయంలో ప్రపంచ దేశాలు సైబర్ నేరాల నివారణలో సమన్వయంగా మెలగుతూ నేరగాళ్ల సమాచారంతో పాటు కొత్త తరహా నేరం జరిగిన వెంటనే ఇతర దేశాలకు దీనిపై సమాచారం అందించి ఆయా దేశాల్లో ఇటువంటివి జరగకుండా జాగ్రత్త పడాల్సి వుంది. గడచిన 11 యేళ్లలో సైబర్ నేరాలు 15.63 ట్రిలియన్ డాలర్లకు చేరినట్లు సైబర్ నేరాలపై పరిశోధన చేసే స్టాటిస్టా అనే మరో అంతర్జాతీయ సంస్థ పేర్కొంది. 2029 నాటికి ఇది మూడు రెట్లు పెరిగి 47 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఆ సంస్థ పేర్కొంది. సైబర్ నేరగాళ్ల ధాటికి ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అనేక కంపెనీలు కృత్రిమ మేధస్సుతో తమ డాటాను భద్రపరుచుకుంటున్నాయని ఆ సంస్థ వెల్లడించింది. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన టూల్స్ ను సమకూర్చుకుంటున్నాయని ఆ సంస్థ పేర్కొంది. అయినప్పటికీ సైబర్ నేరగాళ్ల నుంచి ఆయా కంపెనీలకు పూర్తిగా భద్రత లభించడం లేదని ఆ సంస్థ పేర్కొంది.

గోల్ మాల్ సైబర్ నేరాలకు కేరాఫ్ రాజస్తాన్

భారత్  వెలుగు చూస్తున్న సైబర్ నేరాలకు రాజస్తాన్లోని రెండు నగరాలు కేరాఫ్ గా మారాయి. దీంతో పాటు ఢిల్లీ, బెంగాల్, యుపిలోని ఇంకొన్ని నగరాలకు చెందిన కేటుగాళ్లు సైతం అమాయకులను నిండా ముంచేస్తున్న వైనం రోజురోజుకు పెరిగిపోతోంది. లాటరీలు, బహుమతులు, పెళ్లి సంబంధాల పేరిట మోసగాళ్లు.. ఇలా అనేక రకాల సైబర్ నేరాలకు ఈ నగరాలకు చెందిన నేరగాళ్లు పోలీసులకు సవాల్ విసురుతున్నారు. 

గడచిన రెండేళ్ల వ్యవధిలో ఒక్క తెలుగు రాష్ట్రాలలోనే ఈ తరహా కేసుల్లో 500 మందికి పైగా నేరగాళ్లు దొరికిపోవడం గమనార్హం. లాటరీలు, ఖరీదైన బహుమతులు వచ్చాయంటూ.. మోసగాళ్లు చేస్తున్న ఫోన్లకు స్పందిస్తున్న కొందరు అత్యాశపరులు లేనిదానికి ఆశపడుతూ ఉన్నదానిని కూడా పోగొట్టుకుంటూ లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్న ఘటనలు నిత్యం వెలుగు చూస్తూనే వున్నాయి. ఈ తరహా మోసాలపై పోలీసు శాఖ పదే పదే హెచ్చరిస్తున్నా మోసగాళ్ల ఆగడాలు తగ్గకపోగా ఇదే సమయంలో బాధితుల సంఖ్య పెరిగిపోతుండడం విశేషం. ఈ తరహా మోసాలలో కీలక పాత్ర వహిస్తున్న బల్క్ ఎస్ఎంఎస్లపై నిషేధం విధించాలని కేంద్ర హోం శాఖ చాలా కాలం క్రితమే నిర్ణయించినా ఆచరణలో ఇది ఇప్పటి వరకు అమలుకాకపోవడం గమనార్హం. ఈ తరహా మోసాలు చేసేవారు ఒకప్పుడు నైజీరియా దేశస్తులు కాగా ఇప్పుడు రాజస్తాన్లోని భరత్పూర్, జాంతారాతో పాటు ఢిల్లీ, యుపి, బెంగాల్ లోని కొన్ని నగరాలకు చెందిన కేటుగాళ్లు కావడం విశేషం. రాజస్తాన్లోని భరత్పూర్, జాంతారకు చెందిన బడా కేడీలు తమ సెల్ఫోన్ నంబర్లు ఇతర నగరాలలో వున్నట్లుగా మాయచేస్తూ ఆయా నగరాలలోని స్థానిక నేరగాళ్లతో మిలాఖత్ అవుతూ మోసాలు చేస్తున్న తీరు పోలీసులను సైతం షాకు గురిచేయసాగింది.

ఈ మోసాలకు పాల్పడే నేరగాళ్లు ముందుగా బల్క్ ఎస్ఎంఎస్లను దేశ వ్యాప్తంగా లక్ష మందికి ఒకేసారి పంపుతూ అందినంత దోచుకుంటున్నారు. మీకు విదేశీ లాటరీ వచ్చిందని, దీని విలువ కోటి రూపాయలని, ఖరీదైన బహుమతి వచ్చిందని కూడా వుంటుంది. ఈ లాటరీ, బహుమతిని తీసుకోవడానికి కొంత ఖర్చు అవుతుందని అందులో వుంటుంది. ఈ తరహా ఎస్ఎంఎస్లను చాలా మంది నమ్మరు. కానీ వేలల్లో ఒకరు దీనిని నమ్ముతూ మోసగాళ్లు చెప్పినట్లుగా నడుచుకుంటారు. దీని తరువాత అసలు మోసానికి తెరలేస్తుంది. మీ లాటరీ లేదా బహుమతి మీకు రావాలంటే ముందుగా మేం చెప్పినట్లుగా ఫలానా బ్యాంకులో కొంత నగదు జమా చేయండని మోసగాళ్లు చెబుతారు. అయితే మోసగాళ్లు చెప్పే బ్యాంకు ఖాతాలు వారివి కావు. వారికి సహకరించే స్థానిక నేరగాళ్లవి కావడం విశేషం. బ్యాంకుల్లో నగదు జమా చేయడం వల్ల ఒకవేళ మోసపోయినా పోలీసులకు ఫిర్యాదు చేస్తే మోసగాళ్లు ఎలాగూ పట్టుబడతారనే ఉద్దేశంతో చాలా మంది వారు సూచించినట్లుగా రాజస్తాన్, ఢిల్లీ, ముంబాయి, ఉత్తరప్రదేశ్లోని మారుమూల పట్టణాలలో వున్న బ్యాంకుల్లో నగదు జమ చేస్తారు. ఒకసారి నగదు జమ చేసిన తరువాత మోసగాళ్లు వెంటనే వాటి నుంచి నగదును డ్రా చేసేస్తుంటారు. ఒకసారి నగదు డ్రా చేసుకున్న తరువాత మోసగాళ్లు బాధితులకు మళ్లీ మళ్లీ ఫోన్లు చేస్తూ రకరకాల ఖర్చుల పేరిట ఐదారుసార్లు అంతకు మించి నగదు పంపాలని కోరుతూ డబ్బులను తెప్పించుకుంటున్నారు.

ఈ క్రమంలో లాటరీలు, బహుమతుల విలువలను పెంచుతున్నారు. ఇది నిజమని నమ్ముతున్న బాధితులు మోసగాళ్లు చెబుతున్నట్లు ప్రతీసారి 25 వేల రూపాయల నుంచి 30 వేల రూపాయలు పంపుతున్నారు. మొత్తం మీద ఒక్కో బాధితుడి నుంచి మోసగాళ్లు కనీస పక్షంలో ఐదారు లక్షల నుంచి 50 లక్షల రూపాయల వరకు వసూలు చేస్తూ ఆనక సెల్ఫోన్లను స్విచ్చాఫ్ చేస్తూ తప్పించుకుంటున్నారు. ఈ తరహా ఘటనలపై వస్తున్న ఫిర్యాదులపై పోలీసులు కొంత అసహనంగా వున్నా చివరకు చేసేదిలేక కేసులు నమోదు చేస్తూ రాజస్తాన్లోని జాంతార, భరత్పూర్తో పాటు ఢిల్లీ, ముంబాయి, కోల్కతా నగరాలలో వుంటున్న నేరగాళ్లను అరెస్టు చేస్తున్నారు. వారిని ఇక్కడికి తీసుకువస్తూ జైళ్లకు తరలిస్తున్నారు. అయితే వారి వద్ద నయాపైసా కూడా లేకపోవడంతో పోలీసులు బాధితులకు ఎలాంటి సహాయం చేయలేకపోతున్నారు. ఇక పెళ్లి సంబంధాల పేరిట మోసాలు చేసేవారు మరింత రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా భార్యలు లేదా భర్తలు చనిపోయి లేదా వారికి దూరంగా వుంటూ ద్వితీయ, తృతీయ వివాహాలు చేసుకోవాలనుకునే వారిని ఈ తరహా మోసాలు చేసే నేరగాళ్లు తెలివిగా ఉచ్చులోకి లాగి అందినంత దండుకుంటూ బిచాణా ఎత్తివేస్తున్నారు. మంచి శరీర సౌష్టవం, అందంగా వుండే యువకుల ఫొటోలు మహిళలకు: అందంగా, ఆకర్షణీయంగా వుండే మహిళల ఫొటోలు యువకులకు పంపుతూ వారిని నిండా ముంచుతున్నారు.

ఫొటోలను చూసి ఫ్లాట్ అవుతున్నవారు తమకు ఫోన్ చేసే నేరగాళ్లు కోరినంతా ఇచ్చేస్తున్నారు. చివరకు ఇదంతా గోల్మాల్ వ్యవహారమని తెలిసి పోలీసులను ఆశ్రయిస్తున్నారు. విదేశీ ఉద్యోగాలపై మోజుపడే యువతపై సైబర్ నేరగాళ్ల వల ఏజెంట్ల మాటలు నమ్మితే అంతే సంగతులంటున్న టిజిసిఎస్బీ.. ఉన్నత చదువులు చదివిన యువత మంచి వేతనంతో విదేశాల్లో ఉద్యోగాలు చేసి, తమ కుటుంబాలను సంతోషపెట్టాలని భావిస్తున్న రోజులివి. అయితే ఈ విషయంలో ముందు వెనుక చూడకుండా ఏజెంట్ల మాటలను నమ్మితే సైబర్ నేరగాళ్ల వద్ద బానిసలుగా మారి, నిర్బంధ చాకిరి చేయాల్సి వుంటుందని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టిజిసిఎస్బి) హెచ్చరిస్తోంది. ఇటీవల కాలంలో భారత్ నుంచి గల్ఫ్ సహా పలు యూరప్, ఆసియా దేశాలలో బడా కంపెనీల్లో ఉన్నత ఉద్యోగాల కోసం అంటూ ఏజెంట్ల మాటలు నమ్మి మోసపోయిన వేలాది మంది ఇప్పుడు భారత్కు పొరుగు దేశం సైబర్ నేరగాళ్లకు అడ్డాగా మారిన మియన్మార్లో నిర్బంధ చాకిరీ చేస్తూ దుర్భరంగా జీవిస్తున్నారని టిజిసిఎస్బి అధికారులు చెబుతున్నారు. మియన్మార్ సహా పొరుగునే వున్న కాంబోడియా, లావోస్ లో వందల సంఖ్యలో సైబర్ నేరగాళ్ల అడ్డాలు వున్నాయని, వీటిలో వేల సంఖ్యలో భారతీయుల చేత బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్న విషయం బట్టబయలైందని ఆ విభాగం అధికారులు అంటున్నారు. ముందుగా కొందరు ఏజెంట్లు సోషల్ మీడియా ద్వారా మంచి జీతాలతో విదేశాల్లో ఉద్యోగాలు అంటూ యువతీ, యువకులను ఆకర్షించి వారిని ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఏజెంట్లు మోసాలకు శ్రీకారం చుడతారు. 

అనంతరం తమకు కావలసిన వారిని ఎంపిక చేసుకుని మీకు ఉద్యోగాలు వచ్చాయి అంటూ నమ్మబలికి వారి వద్ద 50 వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు వసూలు చేసి చైనా లేదా థాయ్లాండ్కు తీసుకుపోతారు. ఆ తరువాత ఆయా దేశాలలో ఇక్కడి యువతను అక్కడి ఏజెంట్లు మొదట మర్యాదగానే పలకరించి నాలుగైదు రోజులు బాగానే చూసుకుని ఆ తరువాత పాస్పోర్టులను స్వాధీనం చేసుకుంటారు. అనంతరం యువతీ, యువకులను బలవంతంగా సైబర్ నేరగాళ్ల అడ్డాలకు తరలిస్తున్నారు. సైబర్ నేరగాళ్ల అడ్డాలకు వెళుతున్న ఇక్కడి యువతకు మొదట ఏమీ అర్ధం కాకున్నా వెంటనే అక్కడి నేరగాళ్లు అన్ని విషయాలు చెప్పి మిమ్మల్ని తీసుకు వచ్చింది… సైబర్ నేరాలు చేయించేందుకు. మర్యాదగా మేం చెప్పింది చేయకుంటే అంతు చూస్తాం..” అంటూ బెదిరిస్తారు. మాట వినని వారిపై భౌతికదాడులు చేస్తున్నారు. దీంతో చేసేదిలేక అక్కడ చిక్కుకున్న యువత బలవంతంగా సైబర్ నేరాలు చేస్తున్నారు. అయితే ఇలా సైబర్ నేరాలు చేస్తున్న వారిలో కొందరు ధైర్యం చేసి తమ బాధలను భారత్లో వున్న తమవారికి చెప్పుకోవడం వల్ల అక్కడి నేరాలు వెలుగు చూస్తున్నాయి. ఒక్క భారత్ నుంచే కాకుండా పాకిస్తాన్, బంగ్లాదేశ్ సహా పలు ఆసియా దేశాల నుంచి యువకులకు ఇక్కడికి అక్రమ మార్గాన మియన్మార్కు తరలించి వారి చేత సైబర్ నేరాలు చేయిస్తున్నారు.

ఇలా అక్కడ చిక్కుకున్న వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు వందల సంఖ్యలో వున్నారని టిజిసిఎసిబి అధికారులంటున్నారు. వీరిని వెనక్కు రప్పించే కార్యక్రమం వేగంగా సాగుతోంది. ఈ క్రమంలోనే ఇక్కడి యువకులను అక్కడికి పంపిన ఏజెంట్లు అరెస్టవుతున్నారు. ఇలా అరెస్టయిన సంపత్ అనే నేరగాడు నిజామాబాద్లో ఏడాది క్రితం పోలీసు కస్టడీలో చనిపోవడం సంచలనం రేపింది.

టామ్ కామ్ ను విస్తరిస్తే మరింత మేలు

ఇదిలా వుండగా గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందేందుకు ప్రయత్నిస్తున్న వారి కోసం వున్న తెలంగాణ మ్యాన్ పవర్ ఓవర్సీస్ కంపెనీ (టామ్కాం)ను మరింత పటిష్టపరిచి ఇతర దేశాలకు కూడా విస్తరించాలని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర సర్కారు ఆధ్వర్యంలో పనిచేసే టామ్ కామ్ వల్ల గల్ఫ్ దేశాలకు వెళుతున్న వారికి ఎన్నో ప్రయోజనాలుండడంతో పాటు మోసగాళ్ల ఆగడాలకు చెక్ పడింది. అయితే సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్న వారికి ఇది ఉపయోగపడడంలేదు. ఈ విషయంలో సర్కారు కేంద్రంతో మాట్లాడి టామ్ కామ్ను విస్తరించాలని నిపుణులు చెబుతున్నారు. అప్పటి వరకు విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకునే వారు కేంద్రం ఆధ్వర్యంలో పనిచేసే ఇమిగ్రేషన్ వెబ్సైట్లోని సమాచారం ఆధారంగా ముందుకు వెళ్లాలని టిజిసిఎసిబి అధికారులు కోరుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870