Counting of votes for the ongoing Delhi elections

కొనసాగుతున్న ఢిల్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు..

న్యూఢిల్లీ: దేశ రాజధానిని పాలించేది ఎవరు..? నాలుగోసారి కూడా ఆమ్ ఆద్మీ పార్టీనే ఢిల్లీని ఏలుతుందా.. లేక ఢిల్లీని బీజేపీ కైవసం చేసుకుంటుందా..?ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఏం తేలబోతోంది..? క్షణ క్షణం ఉత్కంఠ రేపుతోన్న ఢిల్లీ ఎన్నికల ఫలితాల అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తోంది వార్త..

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో తేలనున్నాయి. శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. 19 కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మొత్తంగా 10 వేల మంది పోలీసులను మూడంచెల్లో మోహరించింది. ప్రస్తుతం కౌంటింగ్‌ కొనసాగుతోంది. తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కిస్తున్నారు. కౌంటింగ్‌ నేపథ్యంలో ఎన్నికల సంఘం (ఈసీ) పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసింది.

image

ఆమ్‌ఆద్మీ పార్టీ ఢిల్లీలో 2013 నుంచి ప్రభుత్వం అధికారంలో ఉంది. వరుసగా నాలుగోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని కేజ్రీవాల్‌ పార్టీ పట్టుదలతో ఉంది. అటు ఆ పార్టీని గద్దె దించి 26 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఢిల్లీ పాలనా పగ్గాలు అందుకోవాలని బీజేపీ చూస్తోంది. అంతకుముందు 2013 వరకు వరుసగా 15 ఏళ్ల పాటు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్‌.. ఈసారి కూడా పెద్దగా ప్రభావం చూపే అవకాశాలు కన్పించట్లేదు.

ఇకపోతే..హస్తినాలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన కనీస మెజార్టీ 36. స్థానికంగా ఈనెల 5న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 60.54% మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిచే అవకాశాలున్నట్లు ఎగ్జిట్ పోల్స్‌ అంచనా వేశాయి. వీటిని ఆప్‌ ప్రభుత్వం కొట్టిపారేసింది. తమ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తంచేస్తోంది.

Related Posts
మంచు బ్ర‌ద‌ర్స్ వార్ మళ్లీ మొదలు
manoj vishnu

మంచు కుటుంబంలో ఆస్తుల వివాదం కారణంగా మంచు మనోజ్‌ మరియు మంచు విష్ణు మధ్య మళ్లీ వివాదం చెలరేగింది. సోషల్ మీడియాలో ముఖ్యంగా ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా Read more

Famous Pastor Praveen Pagadala : ప్రమాదంలో ప్రముఖ పాస్టర్ మృతి.. విచారణ జరపాలని డిమాండ్
Famous Pastor Praveen Pagad

ప్రముఖ క్రైస్తవ నేత, ప్రసిద్ధ పాస్టర్ ప్రవీణ్ పగడాల (45) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. ఈ రోజు ఉదయం రాజమండ్రి ఎయిర్‌పోర్టు నుంచి వ్యక్తిగత పనుల Read more

Congress : అసెంబ్లీని గౌరవ సభగా కాంగ్రెస్ పార్టీ మార్చింది : శ్రీనివాస్ గౌడ్
Congress party has turned the Assembly into a house of honour.. Srinivas Goud

Congress : అసెంబ్లీని కౌరవ సభలాగా కాంగ్రెస్ పార్టీ మార్చింది అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. స్పీకర్‌ను జగదీష్ రెడ్డి అవమానించలేదు. ఎక్కడా లేని Read more

దొంగల్ని పట్టించిన గుజరాత్ పోలీస్ కుక్క
Beagle 1024x669 1

గుజరాత్‌లోని అహ్మదాబాద్ జిల్లా లో ఒక రైతు ఇంటి నుండి ₹1.07 కోట్ల విలువైన నగదు మరియు బంగారం దొంగిలించబడిన ఘటన చాలా చర్చనీయాంశమైంది. ఈ దోపిడీకి Read more