sriharikota

శ్రీహరికోట నుంచి వందో ప్రయోగానికి కౌంట్‌డౌన్

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో గల సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (SDSC SHAR) వందో ప్రయోగానికి సిద్ధమైంది.2024 సంవత్సరాన్ని ఒక విజయవంతంమైన మిషన్‌తో పూర్తి చేసిన ఇస్రో.. 2025 కొత్త ఏడాదిని కూడా మరో మైలురాయితో ప్రారంభించబోతోంది. శ్రీహరికోట షార్ అంతరిక్ష కేంద్రం నుంచి వందో ప్రయోగానికి కౌంట్ డౌన్ మొదలైంది. ఈ నెల 29వ తేదీ ఉదయం 6:23 గంటలకు చేపట్టనున్న GSLV-F15 రాకెట్‌ ప్రయోగం షార్ నుంచి చేసే వందో ప్రయోగమని ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్ వెల్లడించారు.

Advertisements

సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి 1979 ఆగస్ట్ 10న SLV 3E -1 రాకెట్ ద్వారా రోహిణి టెక్నాలజీ పేలోడ్‌ని ప్రయోగించింది. కానీ ఈ ప్రయోగం సఫలం కాలేదు. అయితే, ఆ తర్వాత జరిపిన రెండు ప్రయోగాలు సక్సెస్ అయ్యాయి. షార్ నుంచి ఇస్రో జరిపిన 99 ప్రయోగాల్లో 9 మాత్రమే విఫలమయ్యాయి. విజయవంతమైన ప్రయోగాల్లో 129 స్వదేశీ ఉపగ్రహాలను, 433 విదేశీ ఉప గ్రహాలను, రెండు ప్రైవేట్ ఉపగ్రహాలను, ఒక గగనయాన్ టెస్ట్ వెహికిల్ డీ వన్, 18 స్టూడెంట్ ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది.
శత ప్రయోగాల షార్
2024 డిసెంబర్ చివరి వారంలో, స్పేడెక్స్ మిషన్‌లో భాగంగా ప్రయోగించిన PSLV C- 60 ప్రయోగ సమయంలో ఇది షార్ నుంచి చేసిన 99వ ప్రయోగమని అప్పటి ఇస్రో చైర్మన్‌ సోమనాథ్ తెలిపారు. ఈ ప్రయోగంలోనే ఇస్రో అంతరిక్షంలో రెండు శాటిలైట్లను డాకింగ్ చేసి, డాకింగ్ సామర్థ్యం ఉన్న నాలుగో దేశంగా చరిత్ర సృష్టించింది.శాటిలైట్ డాకింగ్ ద్వారా 2025ను కూడా సక్సెస్ ఫుల్‌గా ప్రారంభించిన ఇస్రో ఈ ఏడాది మొదటి నెలలోనే శ్రీహరికోట నుంచి వందో ప్రయోగానికి సిద్ధమైంది.

Related Posts
Amaravati: అమరావతి నిర్మాణ పనులు మరింత వేగంగా
Amaravati: అమరావతి నిర్మాణ పనులు మరింత వేగంగా

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి మరో శుభవార్త అందింది. హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (హడ్కో) అమరావతి నిర్మాణానికి రూ.11,000 కోట్లు రుణం ఇవ్వనుంది. ఈ మేరకు Read more

Relationship Insurance: లవ్‌ర్స్ కోసం స్పెషల్ ఆఫర్ – పెళ్లి చేసుకుంటే లక్షల్లో రాబడి!
Relationship Insurance: లవ్‌ర్స్ కోసం స్పెషల్ ఆఫర్ – పెళ్లి చేసుకుంటే లక్షల్లో రాబడి!

ప్రేమకు బీమా! నిజంగా ఇది మిగిలినది: "జికీ లవ్" పాలసీ గురించి తెలుసుకోండి ప్రపంచంలో ఎన్నో కొత్త ఆలోచనలు, పరిణామాలు జరగుతున్నప్పటికీ, ప్రేమకు బీమా పెట్టడం అంటే Read more

Balochistan : బలూచిస్థాన్లో భూకంపం
Earthquake in Balochistan

ప్రపంచవ్యాప్తంగా వరుస భూకంపాలు మానవాళిని భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా, పాకిస్తాన్‌లోని బలూచిస్థాన్ ప్రాంతంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.6గా నమోదైంది. భూప్రకంపనల కారణంగా Read more

తూర్పు గోదావరి జిల్లాలో జీబీఎస్ కేసుల కలకలం
Confusion of GBS cases in East Godavari district

అమరావతి: తూర్పు గోదావరి జిల్లాలో జీబీఎస్ కేసుల కలకలం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో 2 రెండు కేసు నమోదు అయ్యాయి. వైద్య పరీక్షల కోసం కాకినాడ జీజీహెచ్ Read more

Advertisements
×