సౌందర్యాన్ని మెరుగుపర్చుకునే ప్రయత్నం ఓ యువ గాయని జీవితాన్నే తీసుకుంది. మొజాంబిక్‌కు (To Mozambique) చెందిన ప్రముఖ గాయని, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అనా బార్బరా బుల్ద్రిని (31) టర్కీలోని ఇస్తాంబుల్ నగరంలో కాస్మెటిక్ సర్జరీ (cosmetic surgery) తర్వాత ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర ఘటన అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.బుల్ద్రిని రొమ్ముల పరిమాణాన్ని పెంచడం, లైపోసక్షన్, ముక్కు సర్జరీ కోసం టర్కీ వెళ్లింది. ఇస్తాంబుల్‌లోని టూసా ఆసుపత్రి సర్జరీ ఖర్చు ఉచితంగా చేసి, ఆమెతో ప్రచార ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్లినిక్ సేవలను ప్రమోట్ చేసే బాధ్యతను ఆమె తీసుకుంది.
గుండెపోటుతో అకాల మరణం
అయితే, శస్త్రచికిత్స జరిగిన కొద్ది గంటల్లోనే అనా బుల్ద్రిని గుండెపోటుతో కుప్పకూలి చనిపోయింది. ఇది ఊహించని పరిణామంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఆమె భర్త, ప్రసిద్ధ కళాకారుడు ఎల్గార్ సుయెయా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.సర్జరీ కోసం భోజనం చేసిన తర్వాతే బుల్ద్రినిని ఆపరేట్ చేశారంటూ ఆమె భర్త ఆరోపించారు.షెడ్యూల్ కంటే ముందే సర్జరీ జరిపారని, ప్రాథమిక జాగ్రత్తలు పాటించలేదని ఆయన వాపోయారు. ఆసుపత్రి వైఖరిపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఆసుపత్రిపై గతంలోనూ ఆరోపణలు
టూసా ఆసుపత్రి గతంలోనూ కాస్మెటిక్ సర్జరీలతో మృత్యుఘటనల కేసుల్లో నిందితంగా నిలిచినట్టు సమాచారం. ఇటీవలి కాలంలో పేరును మార్చుకున్నప్పటికీ, పాత ఆరోపణలు ఇంకా గుర్తు చేస్తున్నాయి.ఘటనపై స్పందించిన ఆసుపత్రి, అన్ని వైద్యపరమైన అనుమతులు తీసుకున్నామనీ, సర్జరీ అనంతరం ఊహించని ‘వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్’ కారణంగా గుండెపోటు వచ్చిందని వివరించింది. 90 నిమిషాల పాటు జీవనరక్షక చర్యలు చేపట్టినా ఫలితం లేదని తెలిపింది. మరణానికి కారణం తెలుసుకునేందుకు అధికార దర్యాప్తుకు పూర్తి సహకారం అందిస్తామని ప్రకటించింది.
Read Also : F-35B Lightning II : ఎయిరిండియా హ్యాంగర్ ఆఫర్ కు నో చెప్పిన బ్రిటన్ నేవీ