వచ్చే నెలలో అవిశ్వాస తీర్మానం పెట్టే ఆవకాశం
తిరుమల : కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మార్పులు జరుగుతున్నాయి. తిరుపతిలో సైతం మార్పులు చోటు చేసుకుంటున్నాయి. త్వరలో మేయర్‌పై అవిశ్వాసానికి సిద్ధమవుతున్నట్లు కార్పొరేటర్లు చర్చించుకుంటున్నారు. తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో 3 లక్షలపైగా ఓటర్లు ఉన్నారు. ఇక్కడ 50 డివిజన్లు ఉన్నాయి. 2020లో కొవిడ్ ప్రారంభ సమయంలో కార్పొరేషన్ ఎన్నికలు జరగ్గా అప్పట్లో అధికారంలో ఉన్న వైసీపీ ధన, ఆర్థిక, అంగ బలంతో 50 డివిజన్లలో 25శాతం మాత్రమే ఎన్నికలు జరిగేలా చేసింది.

డాక్యుమెంట్లు సైతం లాకెళ్లిన ఘటనలు
అప్పట్లో కనీసం నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన వారి డాక్యుమెంట్లు సైతం లాకెళ్లిన ఘటనలు చూశాం. ఆ సన్నివేశాలను పోలీసులు చూస్తు ఉన్నారు తప్ప ఏమి చేయలేని పరిస్థితి. నామినేషన్లు దాఖలు చేసిన వారివి సైతం పత్రాలు చింపేసి అధికారులను అడ్డం పెట్టుకుని మరీ ఏకగ్రీవాలు చేశారు. ఆ సమయంలో కొవిడ్ కారణంగా లాక్ డౌన్ రావడంతో ఆ ఎన్నికలు వాయిదా పడ్డాయి. కొవిడ్ పరిస్థితుల తరువాత జరిగిన ఎన్నికల్లో వైసీపీ కార్పొరేటర్లు 50గాను 48 సొంత చేసుకున్నారు. 1 మాత్రమే టీడీపీ కైవసం చేసుకోగ.. 1 డివిజన్ కార్పొరేటర్ కోర్టును ఆశ్రయించగా ఎన్నికలు లేకుండా పోయింది.
వైసీపీ తరపున కార్పొరేటర్లు నోరు సైతం మెదపకుండా
50 మంది కార్పొరేటర్లు మేయర్‌గా బీసీ (యాదవ) వర్గానికి చెందిన డాక్టర్ శిరీష ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్‌గా కాపు సామాజిక వర్గానికి చెందిన ముద్ర నారాయణను నిలబెట్టారు. అప్పటి వైసీపీ ప్రభుత్వం రెండో డిప్యూటీ మేయర్ కోసం జీవో విడుదల చేయగా రెండో డిప్యూటీ మేయర్‌గా అప్పటి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు భూమన అభినయ్ రెడ్డిని ఎన్నుకున్నారు. గడిచిన నాలుగేళ్ల కాలంలో వైసీపీ తరపున కార్పొరేటర్లు నోరు సైతం మెదపకుండా వారికి కావాల్సింది చేసుకుంటూ కౌన్సిల్ సమావేశం మీడియా సైతం అనుమతి లేకుండా పాలన సాగించారు.
అవిశ్వాసానికి సిద్ధం..
తిరుపతి మేయర్ ఉన్న అక్రమంగా భవనాలకు ఎలా అనుమతి ఇచ్చారు. ఇంత కాలం ఏమి చేశారు. అధికారుల పై చర్యలు గతంలో ఎందుకు తీసుకోలేదని కార్పొరేటర్లు చర్చకు దిగారు. మేయర్ హోదాలో సభ నుంచి బాయ్ కాట్ చేయడం ఏంటని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలంటే అవిశ్వాసం పెట్టి ఆమెను పదవి నుంచి తొలగించాలని పావులు కదుపుతున్నారు. మార్చి నెలలో జరిగే కౌన్సిల్ సమావేశంలో మేయర్‌పై అవిశ్వాసానికి సిద్ధమవుతున్నారు. మిగిలిన 8 నెలల కాలంలో మేయర్ పదవి సొంతం చేసుకోవడం వల్ల ఏమి లాభం ఉంటుందనేది కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. ఏమి జరుగుతుందో మార్చి వరకు వేచి చూడాల్సిందే.