Corbin Bosch:లీగల్ నోటీసులు అందుకున్న కార్బిన్ బాష్ కారణాలు

Corbin Bosch:లీగల్ నోటీసులు అందుకున్న కార్బిన్ బాష్ కారణాలు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) మరియు పాకిస్తాన్ సూపర్ లీగ్ (పిఎస్ఎల్) మధ్య పోటీ రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఈ పోటీలో తాజాగా దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ కార్బిన్ బాష్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. పిఎస్ఎల్ 2025 డ్రాఫ్ట్‌లో పెషావర్ జల్మీ జట్టులోకి  డైమండ్ కేటగిరీలో ఎంపికైన కార్బిన్ బాష్, గాయపడిన లిజాద్ విలియమ్స్ స్థానాన్ని భర్తీ చేయడానికి ఎంఐ అతనిని ఎంపిక చేసింది.దీనిపై పిసిబి (పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ) తీవ్రంగా స్పందించి, అతనికి లీగల్ నోటీసు జారీ చేసింది.అయితే, అతను ఈ నెల ప్రారంభంలో ముంబై ఇండియన్స్ జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. 

Advertisements

లీగల్ నోటీసు

పిఎస్ఎల్ నుండి తప్పుకోవడం వల్ల బాష్ తన ఒప్పంద నిబంధనలను ఉల్లంఘించాడని పిసిబి అభిప్రాయపడింది. అందుకే, అతనికి లీగల్ నోటీసు పంపించి, తన చర్యలను సమర్థించుకోవాల్సిందిగా కోరింది.పిసిబి విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం“కార్బిన్ బాష్ ఏజెంట్ ద్వారా లీగల్ నోటీసు అందింది. అతను తన వృత్తిపరమైన, ఒప్పంద నిబద్ధతల నుండి వైదొలగడానికి చేసిన చర్యలను సమర్థించాల్సి ఉంటుంది.”

ఆటగాళ్ల పై ప్రభావం

ఈ వివాదం అప్పుడే సెటైర్ అయ్యింది, ఎందుకంటే పిఎస్ఎల్ 2025 నేరుగా ఐపిఎల్ 2025తో సమాన కాలంలో నిర్వహించబడుతోంది. పిఎస్ఎల్2025 ఏప్రిల్ 11న ప్రారంభమై మే 18న ముగుస్తుంది. అదే సమయంలో, ఐపిఎల్ 2025 మార్చి 22న ప్రారంభమై మే 25న ముగవుతుంది. అంటే, పిఎస్ఎల్, ఐపిఎల్ లీగ్‌లు ఒకే సమయంలో జరగడం ఆటగాళ్ల ఎంపికపై ప్రభావం చూపనుంది.ఈ వివాదంలో చివరకు గెలిచేది ఎవరు? కార్బిన్ బాష్ తన నిర్ణయాన్ని సమర్థించుకుంటాడా? లేక పిసిబి అతనిపై కఠిన చర్యలు తీసుకుంటుందా? – ఈ ప్రశ్నలకు సమాధానం రాబోయే రోజుల్లో తెలుస్తుంది.

GmLExL4asAAqtEn

ఈ వివాదం కేవలం కార్బిన్ బాష్ వ్యక్తిగత నిర్ణయానికే పరిమితమై ఉండకపోవచ్చు. ఇది పిఎస్ఎల్- ఐపిఎల్మధ్య పెరుగుతున్న పోటీని సూచిస్తోంది. గతంలో కూడా అనేక విదేశీ క్రికెటర్లు పిఎస్ఎల్ఒప్పందాలను వదులుకుని ఐపిఎల్ లో ఆడటానికి వెళ్లారు, అయితే ఈసారి పిసిబి నేరుగా లీగల్ నోటీసులు పంపించడం విశేషం. ఇది భవిష్యత్తులో పిఎస్ఎల్ లో ఆడాలనుకునే విదేశీ ఆటగాళ్లపై ప్రభావం చూపొచ్చు. పిసిబి తన లీగ్ ప్రాముఖ్యతను కాపాడేందుకు కఠినమైన చర్యలు తీసుకుంటోందని స్పష్టమవుతోంది, కానీ ఆటగాళ్లకు మరింత స్వేచ్ఛ ఇవ్వకపోతే, పిఎస్ఎల్ కోసం అంతర్జాతీయ టాలెంట్ లభించడం మరింత కష్టమవుతుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.

Related Posts
పాకిస్థాన్ కు అమెరికా షాక్

పాకిస్థాన్ ప్రభుత్వానికి అగ్రరాజ్యం అమెరికా షాకిచ్చింది. పాక్ ప్రభుత్వ రంగ సంస్థతో పాటు నాలుగు కీలక సంస్థలపై ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది. దీర్ఘ శ్రేణి క్షిపణి సాంకేతికత Read more

పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం.. నిమిషాల వ్యవధిలోనే వాయిదా
Parliament sessions begin. adjourned within minutes

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు సోమవారం తిరిగి ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు ఉభయసభలు సమావేశమయ్యాయి. సమావేశాలు ప్రారంభం అయిన నిమిషాల వ్యవధిలోనే ఉభయ సభలు వాయిదా Read more

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం
vinod

భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆరోగ్య పరిస్థితి మరింతగా క్షీణించింది.అనారోగ్య పరిస్థితితో కొద్ది వారాలుగా ఇబ్బంది పడుతూ గతం ఇటీవల థానేలోని ఆకృతి ఆసుపత్రిలో చేరిన Read more

Pasala Krishna Bharati : ప్రముఖ గాంధేయవాది కన్నుమూసిన పసల కృష్ణభారతి
Pasala Krishna Bharati ప్రముఖ గాంధేయవాది కన్నుమూసిన పసల కృష్ణభారతి

Pasala Krishna Bharati : ప్రముఖ గాంధేయవాది కన్నుమూసిన పసల కృష్ణభారతి ప్రముఖ గాంధేయవాది పసల కృష్ణభారతి ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.ఆమె 92 సంవత్సరాల వయసులో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *