పాకిస్థాన్ కు అమెరికా షాక్

పాకిస్థాన్ ప్రభుత్వానికి అగ్రరాజ్యం అమెరికా షాకిచ్చింది. పాక్ ప్రభుత్వ రంగ సంస్థతో పాటు నాలుగు కీలక సంస్థలపై ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది. దీర్ఘ శ్రేణి క్షిపణి సాంకేతికత వ్యాప్తికి సహకరిస్తున్నాయని, సామూహిక జన హనన ఆయుధాల తయారీకి సాయపడుతున్నాయని ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే నేషనల్‌ డెవలప్‌మెంట్‌ కాంప్లెక్స్‌ (ఎన్‌ డీసీ) కూడా ఉంది. ఇది పాక్‌ బాలిస్టిక్‌ మిసైల్‌ కార్యక్రమానికి సహకరిస్తోందని ఆరోపించింది.
నాలుగు కంపెనీలపై ఆంక్షలు
ఇది సామూహిక జనహనన ఆయుధాలను వ్యాప్తి చేస్తోందని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే పాక్ నేషనల్‌ డెవలప్‌మెంట్‌ కాంప్లెక్స్‌ సహా నాలుగు కంపెనీలపై ఆంక్షలు విధించినట్లు తెలిపింది. దీంతో పాటు కరాచీ కేంద్రంగా పనిచేస్తున్న అక్తర్‌ సన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, అఫిలియేట్స్‌ ఇంటర్నేషనల్‌, రాక్‌సైడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. క్షిపణి ప్రయోగానికి వినియోగించే పరికరాలను ఎన్ డీసీ కొనుగోలు చేస్తోందని, షాహిన్‌ శ్రేణి క్షిపణుల తయారీలో చురుగ్గా పాల్గొందని అమెరికా వెల్లడించింది. ఈ పరికరాల తయారీకి అవసరమైన ముడిపదార్థాలను ఎన్ డీసీకి అక్తర్‌ అండ్‌ సన్స్‌ సంస్థ సరఫరా చేస్తోందని తెలిపింది.
అమెరికా పక్షపాతధోరణి: పాక్ ఆరోపణ
ఎన్ డీసీ తరఫున మిసైల్ లో వినియోగించే పలు పరికరాలను అఫిలియేట్‌ ఇంటర్నేషనల్‌ కొనుగోలు చేస్తోందని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూమిల్లర్‌ చెప్పారు. కాగా, తమ సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించడం దురదృష్టకరమని, పక్షపాతంతో కూడుకున్నవని పాక్ ప్రభుత్వం పేర్కొంది. అమెరికా మరోసారి పునరాలోచించాలి పాక్ కోరుతున్నది.

Related Posts
sunita williams : సునీతా విలియమ్స్‌, ఇతరులు కోలుకునేందుకు ఎలాంటి చికిత్సలు అవసరం?
స్ట్రెచర్‌పైనే సునీతా విలియమ్స్‌ సహా నలుగురిని ఎందుకు తీసుకెళ్లారు?

అంతరిక్షంలో నివసించడం, భూమిపైకి తిరిగిరావడం అనేది కష్టమైన, సవాళ్లతో కూడిన ప్రయాణం. భూమికి తిరిగొచ్చాక కూడా వ్యోమగాములు చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. శాస్త్రవేత్తలు చెప్పినదాని ప్రకారం, Read more

ఉత్తర కొరియా రష్యాకు మద్దతు: కిమ్ జాంగ్ ఉన్ ప్రకటన
NO russia

ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో, ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జాంగ్ ఉన్ రష్యాకు నిరంతర మద్దతు తెలపాలని నిర్ణయించారని ఉత్తర కొరియా ప్రభుత్వ వార్తా ఏజెన్సీ శనివారంనాడు Read more

ట్రంప్ హోటల్ ముందు కారులో పేలుడు
Car explosion in front of Trump hotel

లాస్‌ ఏంజెల్స్‌ : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌కి చెందిన అంతర్జాతీయ హోటల్‌ భవనం ఎదుట బుధవారం పేలుడు జరిగింది. టెస్లా కారులో పేలుడు సంభవించింది. Read more

మస్క్ యొక్క మార్స్ ప్రాజెక్ట్ : స్టార్షిప్ టెస్ట్‌లో సాంకేతిక సవాళ్లు
starship failure

స్పేస్ఎక్స్ కంపెనీ తమ స్టార్షిప్ రాకెట్‌ను టెక్సాస్‌లోని ప్రణాళిక ప్రకారం ప్రయోగించగా,ఈ ప్రయోగం ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది.స్టార్షిప్ రాకెట్ పరీక్షా ప్రొగ్రామ్‌ లో భాగంగా, దీని సూపర్ Read more