Controversy in a football match. More than 100 people died

ఫుట్ బాల్ మ్యాచ్‌లో వివాదం..100 మందికిపైగా మృతి!

న్యూఢిల్లీ: ఆఫ్రికా దేశం గినియాలో విషాదం చోటుచేసుకున్నది. ఓ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ సందర్భంగా అభిమానుల మధ్య జరిగిన గొడవ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇరు వర్గాలు పరస్పరం దాడి చేసుకోవడంతో 100 మందికిపైగా మరణించారు. గినియా మిలిటరీ జుంటా నేత మమాడి దౌంబోయ గౌరవార్థం జెరెకొరె నగరంలో ఫుట్‌బాల్​ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌ మధ్యలో రిఫరీ తీసుకున్న ఓ నిర్ణయంతో వివాదం తలెత్తింది. దాన్ని వ్యతిరేకించేందుకు ఓ జట్టు అభిమానులు మైదానంలోకి దూసుకెళ్లారు. దీంతో అవతలి టీమ్ అభిమానులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య పెద్ద ఘర్షణ చెలరేగింది. వీధుల్లోకి వచ్చి పరస్పరం దాడులు చేసుకున్నారు.

దీంతో వంద మందికిపైగా మరణించగా, చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వీధులంతా రక్తసిక్తంగా మారాయి. ఎక్కడ చూసినా మృతదేహాలు చెల్లాచెదురుగా పడిఉన్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాగా, ఈ ఘర్షణ అంతకంతకూ విస్తరించి.. వేలాది మంది అభిమానులు రోడ్ల మీదకు వచ్చారు. ఎదుటి జట్టు అభిమానులపై దాడులకు పాల్పడ్డారు. ఈ క్రమంలో కొందరు పోలీస్ స్టేషన్ కు నిప్పు పెట్టారు. పలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ప్రాణాల్ని పోగొట్టుకున్నారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వీధుల్లో ఎక్కడ చూసినా డెడ్ బాడీలు చెల్లాచెదురుగా పడి ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఆట మీద అభిమానం ఉండొచ్చు. మరీ ఇంతనా? అంటూ ముక్కున వేలేసుకునే పరిస్థితి. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం వంద మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారని.. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు.

Related Posts
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు KCRను ఆహ్వానిస్తాం: పొన్నం ప్రభాకర్
ponnam fire

తెలంగాణ రాష్ట్రంలో గౌరవప్రదమైన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లతో పాటు విపక్ష నేతలను ఆహ్వానిస్తున్నట్లు Read more

తెలుగు నటీపై సంచలన వ్యాఖ్యలు
తెలుగు నటీపై సంచలన వ్యాఖ్యలు

'మజాకా' సినిమాతో రీఎంట్రీ ఇస్తున్న తెలుగు నటి అన్షుపై దర్శకుడు త్రినాథరావు నక్కిన అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో ఈ ఘటన Read more

గౌతమ్ అదానీకి ట్రంప్ శుభవార్త
గౌతమ్ అదానీకి ట్రంప్ శుభవార్త

కొన్ని నెలల కిందట అదానీ తన వ్యాపారాల డీల్స్ కోసం భారతదేశంలో ప్రభుత్వ అధికారులకు పెద్ద మెుత్తంలో లంచాలు ఇచ్చినట్లు అమెరికా నుంచి వచ్చిన ఆరోపణలు పెద్ద Read more

చెన్నమనేని రమేశ్ పౌరసత్వంపై నేడు తీర్పు
Chennamaneni Ramesh

బీఆర్ఎస్ నేత, వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వంపై ఈరోజు హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఆయనకు జర్మనీ పౌరసత్వం ఉన్నప్పటికీ తప్పుడు పత్రాలతో భారత పౌరసత్వం Read more