తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) గోమాతల సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా గోశాలల (Goshala ) అభివృద్ధిపై సమీక్ష నిర్వహించిన సీఎం, రైతులు, పశువులు, గోశాలల మధ్య సమన్వయంతో సమర్థవంతమైన వ్యవస్థను ఏర్పాటుచేయాలన్నారు. గోశాలలు పశువులకు ఆశ్రయంగా ఉండేలా అత్యాధునిక సదుపాయాలతో ఉండాలని స్పష్టం చేశారు.
విశాల స్థలాల్లో ఆధునిక గోశాలలు
గోశాలల ఏర్పాటుకు 50 ఎకరాల విస్తీర్ణంలో భూములను గుర్తించాలని అధికారులను సీఎం ఆదేశించారు. సంగారెడ్డి జిల్లాలోని ఎంకేపల్లిలో ఏర్పాటు చేయనున్న గోశాలకు సంబంధించిన నమూనా డిజైన్లను పరిశీలించి, వాటిని ఆధారంగా తీసుకొని నిర్మాణ ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఈ గోశాలలు శుద్ధమైన నీరు, పశువుల పోషణ, వైద్య సేవలు వంటి సమగ్ర సదుపాయాలతో ఉండాలని పేర్కొన్నారు.
వర్సిటీలు, దేవాలయ భూముల్లో గోశాలల ఏర్పాటు
అగ్రికల్చర్, వెటర్నరీ వర్సిటీలు, కాలేజీలు, అలాగే దేవాలయాలకు సంబంధించిన భూముల్లో గోశాలలను ఏర్పాటు చేయాలన్నారు. ఇది విద్యార్థులకు శాస్త్రీయంగా అధ్యయనం చేసేందుకు అవకాశం కల్పించడమే కాకుండా, గోరక్షణకు గౌరవప్రదమైన పథకంగా నిలుస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు. గోశాలల ఏర్పాటుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని సూచిస్తూ, ప్రభుత్వం ఈ అంశంలో వేగంగా ముందడుగు వేస్తుందని హామీ ఇచ్చారు.
Read Also : OTT Movie: ఓటీటీలోకి షకీలా బయోపిక్