కాంగ్రెస్ ఒక స్థానంలో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది.

ఖాతా తెరవనున్న కాంగ్రెస్

ఢిల్లీని వరుసగా పదిహేనేళ్ల పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ 2013లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంట్రీ తర్వాత అధికారానికి దూరమైంది. గత రెండు అసెంబ్లీలలో కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. రెండు అసెంబ్లీలలో కాంగ్రెస్ నుంచి ఒక్క అభ్యర్థి కూడా విజయం సాధించలేదు. ఈసారి కూడా పార్టీ అభ్యర్థులంతా వెనుకంజలోనే కొనసాగుతుండగా ఒక్క బాద్లీ నియోజకవర్గంలో మాత్రమే కాంగ్రెస్ లీడ్ లో ఉంది. వరుసగా రెండు అసెంబ్లీ ఎన్నికల్లో సున్నాకే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ ఈసారి ఖాతా తెరిచే సంకేతాలు కనిపిస్తున్నాయి. బాద్లీ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి దేవేంద్ర యాదవ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ స్పందించారు ‘‘ఫలితాలు నాకు తెలియదు, నేను ఇంకా ఫలితాలను చూడలేదు’’ అని ప్రియాంక అన్నారు.

Untitled

ఓట్ల లెక్కింపుకు ముందు, కాంగ్రెస్ నాయకురాలు అల్కా లాంబా కీలక వ్యాఖ్యలు చేశారు. “ఢిల్లీ మార్పును కోరుకుంటుందని, ఎన్నికల ఫలితాలతో ఈ మార్పు జరగబోతోందన్నారు. పదేళ్ల క్రితం ఆగిపోయిన అభివృద్ధి పనులను తిరిగి ప్రారంభించాలని కాంగ్రెస్ కోరుకుంటోంది.’’ అల్కా లాంబా అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనుహ్యంగా ఉంటాయని కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేసింది. మెరుగైన ఫలితాలు వస్తాయని కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ తెలిపారు. ఈసారి ఎలాగైనా ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులూ ఒడ్డి ప్రచారం చేసింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ మాజీ అధ్యక్షుడు, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు ఆయన సోదరి, పార్టీ జాతీయ కార్యదర్శి, వయనాడ్ ఎంపీ ప్రియాంకా గాంధీ పలు నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ ప్రచారం చేయించారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా సుదీర్ఘ కాలం పనిచేసిన కాంగ్రెస్ సీనియర్ నేత షీలా దీక్షిత్ సేవలను ప్రజలకు గుర్తుచేస్తూ ఆమె కుమారుడిని బరిలో నిలిపినా ఉపయోగం లేకుండా పోయింది. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సందీప్ దీక్షిత్ ప్రస్తుతం వెనుకంజలో కొనసాగుతున్నారు.

ఒక స్థానంలో కాంగ్రెస్‌ ఆధిక్యం
కొనసాగుతున్న ఈవీఎం ఓట్ల లెక్కింపు

Related Posts
Tamil Nadu Chief Annamalai : విజయ్‌పై అన్నామలై తీవ్ర స్థాయిలో విమర్శలు
Tamil Nadu Chief Annamalai విజయ్‌పై అన్నామలై తీవ్ర స్థాయిలో విమర్శలు

Tamil Nadu Chief Annamalai : విజయ్‌పై అన్నామలై తీవ్ర స్థాయిలో విమర్శలు ఇదిగో, నూతన రాజకీయ నాయకుడు విజయ్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఘాటైన Read more

పులి పిల్లలకు పాలు తాగించిన ప్రధాని మోదీ
పులి పిల్లలకు పాలు తాగించిన ప్రధాని మోదీ

పులి పిల్లలకు పాలు తాగించిన ప్రధాని మోదీ అనంత్ అంబానీ కలల ప్రాజెక్ట్ – వనతారా అభయారణ్యం రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ Read more

రన్యారావు కేసులో బీజేపీ, కాంగ్రెస్ ఒకరిపై ఒకరు ఆరోపణలు
రన్యారావు కేసులో బీజేపీ, కాంగ్రెస్ ఒకరిపై ఒకరు ఆరోపణలు

బంగారం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన కన్నడ నటి రన్యారావు ఉదంతం కీలక మలుపులు తిరుగుతోంది. ఇప్పుడు దీనికి రాజకీయ రంగు కూడా పులుముకుంది. తనను చిక్కుల్లోంచి Read more

గురునానక్ జయంతి!
guru nanak dev ji

గురునానక్ జయంతి, సిక్కు సమాజానికి అత్యంత పవిత్రమైన పర్వదినం. ఈ రోజు గురునానక్ దేవ్ జీ పుట్టిన రోజు. ఆయన సిక్కు ధర్మం యొక్క స్థాపకుడు మరియు Read more