teenmaar mallanna allu arju

అల్లు అర్జున్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ సంచలన కామెంట్స్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. జాతీయ అవార్డు విషయంలో అల్లు అర్జున్ కుట్ర పన్నారనే అనుమానాలను వ్యక్తం చేశారు మల్లన్న. జానీ మాస్టర్ కేసులో అల్లు అర్జున్ పాత్రపై మల్లన్న పలు ప్రశ్నలను లేవనెత్తారు.

తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. “తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో జాతీయ అవార్డు తనొక్కడికే దక్కాలని అల్లు అర్జున్ కుట్ర పన్నారా?” అని ప్రశ్నించారు. జానీ మాస్టర్ జైలుకు వెళ్లడంలో కూడా అర్జున్ పాత్ర ఉందని, ఇది పూర్తిగా పరిశీలించాల్సిన అంశమని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా జానీ మాస్టర్‌కు బెయిల్ వచ్చినప్పటికీ, ఆయన నేషనల్ అవార్డు వెనక్కి తీసుకోవాలంటూ లేఖ రాయించడం వెనుక కూడా అల్లు అర్జున్ పాత్ర ఉందని ఆరోపించారు.

ఈ ఆరోపణలపై అల్లు అర్జున్ సన్నిహిత వర్గాలు ఇంకా స్పందించలేదు. జాతీయ అవార్డు వంటి ప్రతిష్ఠాత్మక గుర్తింపును ఇలా వివాదంలోకి లాగడం అర్థరహితం అని ఫిల్మ్ ఇండస్ట్రీలోని కొందరు వ్యక్తులు అభిప్రాయపడ్డారు. అల్లు అర్జున్ ఇటీవలే జాతీయ అవార్డు గెలుచుకొని, అభిమానులను సంబరాల్లో ముంచెత్తిన విషయం తెలిసిందే. కానీ ఈ వివాదాలు ఇప్పుడు ఆయన గౌరవంపై మచ్చ వేస్తున్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. జానీ మాస్టర్ కేసులో అసలు సత్యాలు ఏంటన్నది త్వరలో వెలుగులోకి రావాల్సి ఉంది.

Related Posts
ట్రంప్ విజయంపై మోదీ అభినందన…
modi

2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయాన్ని సాధించటంపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అతని మిత్రుడు ట్రంప్‌ను అభినందించారు. ఈ విజయాన్ని “చారిత్రకమైనది” Read more

Rajagopal Reddy : నాకు హోంమంత్రి పదవి అంటే ఇష్టం: రాజగోపాల్ రెడ్డి
I like the post of Home Minister.. Rajagopal Reddy

Rajagopal Reddy : తనకు హోంమంత్రి పదవి అంటే ఇష్టమని కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ కేబినెట్ విస్తరణపై ప్రచారం జరుగుతున్న Read more

స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ లింగ్విస్టిక్స్ ల్యాబ్‌ను ఏర్పాటు చేసిన బెంగళూరులోని శామ్‌సంగ్ R&D ఇన్స్టిట్యూట్
Samsung RD Institute Bangalore which has set up a state of the art linguistics lab

● ల్యాబ్ మిలీనియల్ మరియు Gen Z విద్యార్థులకు అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాలపై శామ్‌సంగ్తో సహకరించడానికి మరియు వాస్తవ ప్రపంచ సమస్యలకు పరిష్కారాలను కనుగొనడంలో సహాయపడటానికి Read more

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2025 నోటిఫికేషన్
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2025 నోటిఫికేషన్1

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CSE) 2025కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ పరీక్ష భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఏఎస్, Read more