teenmaar mallanna allu arju

అల్లు అర్జున్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ సంచలన కామెంట్స్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. జాతీయ అవార్డు విషయంలో అల్లు అర్జున్ కుట్ర పన్నారనే అనుమానాలను వ్యక్తం చేశారు మల్లన్న. జానీ మాస్టర్ కేసులో అల్లు అర్జున్ పాత్రపై మల్లన్న పలు ప్రశ్నలను లేవనెత్తారు.

తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. “తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో జాతీయ అవార్డు తనొక్కడికే దక్కాలని అల్లు అర్జున్ కుట్ర పన్నారా?” అని ప్రశ్నించారు. జానీ మాస్టర్ జైలుకు వెళ్లడంలో కూడా అర్జున్ పాత్ర ఉందని, ఇది పూర్తిగా పరిశీలించాల్సిన అంశమని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా జానీ మాస్టర్‌కు బెయిల్ వచ్చినప్పటికీ, ఆయన నేషనల్ అవార్డు వెనక్కి తీసుకోవాలంటూ లేఖ రాయించడం వెనుక కూడా అల్లు అర్జున్ పాత్ర ఉందని ఆరోపించారు.

ఈ ఆరోపణలపై అల్లు అర్జున్ సన్నిహిత వర్గాలు ఇంకా స్పందించలేదు. జాతీయ అవార్డు వంటి ప్రతిష్ఠాత్మక గుర్తింపును ఇలా వివాదంలోకి లాగడం అర్థరహితం అని ఫిల్మ్ ఇండస్ట్రీలోని కొందరు వ్యక్తులు అభిప్రాయపడ్డారు. అల్లు అర్జున్ ఇటీవలే జాతీయ అవార్డు గెలుచుకొని, అభిమానులను సంబరాల్లో ముంచెత్తిన విషయం తెలిసిందే. కానీ ఈ వివాదాలు ఇప్పుడు ఆయన గౌరవంపై మచ్చ వేస్తున్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. జానీ మాస్టర్ కేసులో అసలు సత్యాలు ఏంటన్నది త్వరలో వెలుగులోకి రావాల్సి ఉంది.

Related Posts
హైదరాబాద్ కు చేరుకున్న రాష్ట్రపతి..ఘనస్వాగతం పలికిన సీఎం
cm revanth welcomed the pre

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల హైదరాబాద్‌ పర్యటన నేపథ్యంలో గురువారం సాయంత్రం ఢిల్లీ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్బంగా రాష్ట్రపతికి గవర్నర్ జిష్ణు Read more

కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ శ్రేణులు షాక్ …
kamareddy congres

తెలంగాణాలో అధికార పార్టీ కాంగ్రెస్ కు సొంత పార్టీ శ్రేణులే భారీ షాక్ ఇచ్చారు. ఎన్నో ఏళ్లుగా పార్టీ జెండామోస్తు వచ్చిన తమను కాదని ఇతర పార్టీల Read more

18న బీసీ సంఘాల నిరసనలు: ఆర్. కృష్ణయ్య
Protests of BC communities on 18th of this month..R. Krishnaiah

42% రిజర్వేషన్లకు కచ్చితంగా చట్టబద్ధత కల్పించాల్సిందే.. హైదరాబాద్‌: కులగణన సర్వే మళ్లీ జరపాలని, స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని, ఆ తర్వాతే ఎన్నికలు జరపాలనే Read more

ఆయన నాకు సహకారం అందించారు: తుమ్మల కంటతడి
ఆయన నాకు సహకారం అందించారు తుమ్మల కంటతడి

ఆయన నాకు సహకారం అందించారు: తుమ్మల కంటతడి సత్తుపల్లి నియోజకవర్గం రాజకీయాల్లో కీలక మార్పులకు బలమైన బాసటగా నిలిచిన గాదె సత్యం తనకు ఎంతో సహాయంగా ఉన్నారని Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *