NKV BJP

బీజేపీలో చేరిన కాంగ్రెస్ నేత‌లు

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిమాణం

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల వేళ మాజీ ఎంపీ సీతారాం నాయక్, బీజేపీ ఎస్‌టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు డా. కల్యాణ్ నాయక్ నేతృత్వంలో ఇద్దరు ప్రముఖ కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరారు. ఢిల్లీలోని తన నివాసంలో ఎంపీ డీకే అరుణ వీరికి పార్టీ కండువా కప్పి కమలదళంలోకి ఆహ్వానించారు.

బీజేపీలో చేరిన వారిలో సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు సభావత్ శ్రీనివాస్ నాయక్, మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి సభావత్ విజయ ఉన్నారు. ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ, బీజేపీలో కష్టపడి పనిచేస్తే తప్పక గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి దిశగా ముందుకెళ్తోందని, కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై వీరు బీజేపీలో చేరారని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని డీకే అరుణ విమర్శించారు. ఉచిత బస్సు ప్రయాణం తప్ప కాంగ్రెస్ ప్రజలకు చెప్పిన వాగ్దానాలేవీ నెరవేర్చలేదని ఆమె మండిపడ్డారు. ముఖ్యంగా బీసీల జనాభా గణనలో తప్పులు చోటుచేసుకున్నాయని, ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపారు.

తెలంగాణలో కాంగ్రెస్ పాలన ప్రజలకు నచ్చడం లేదని, రోజురోజుకు అసంతృప్తి పెరుగుతోందని డీకే అరుణ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని ప్రజలు మరోసారి మార్పు కోరుకుంటున్నారని, రాబోయే ఏ ఎన్నికలైనా బీజేపీ విజయాన్ని సాధించడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నుంచి కీలక నేతలు బీజేపీలో చేరడం రాష్ట్ర రాజకీయాలకు ప్రాధాన్యత సంతరించుకుంది.

Related Posts
1,690 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధం..
Filling up of medical posts

తెలంగాణ లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ..ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో ఉంది. ఇప్పటికే పలు హామీలను నెరవేర్చగ..ఇటు నిరుద్యోగులకు సైతం వరుస గుడ్ న్యూస్ Read more

గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసు – వంశీ అనుచరులు అరెస్ట్
Gannavaram TDP office attack case

విజయవాడ: గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. ఈ కేసులో నిందితులుగా గుర్తించిన 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. Read more

కొత్త లబ్దిదారులకు ‘రైతు గుర్తింపు ఐడీ’ తప్పనిసరి
formers

రైతులు బాగుంటేనే మనం కూడా బాగుంటం. అందుకే ప్రభుత్వాలు రైతులకు పలు పథకాలను అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా కొత్త లబ్దిదారులకు ‘రైతు గుర్తింపు ఐడీ’ తప్పనిసరిగా Read more

ఈటల రాజేందర్‌ హౌజ్ అరెస్టు
Etela Rajender House arrested

హైదరాబాద్‌: ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం ఘటనకు నిరసనగా సికింద్రాబాద్ బంద్‌కి హిందూ సంఘాలు పిలుపునిచ్చాయి. పలు వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. ఇటీవల ముత్యాలమ్మ విగ్రహాల Read more