‘జైలర్’ చిత్రంలో విలన్ వర్మన్ పాత్రతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన మలయాళ నటుడు వినాయకన్ (Malayalam actor Vinayakan) ఇప్పుడు తన నటన వల్ల కాక, వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు. అతడి ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఆయనపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వం జోక్యం చేయాలంటూ డిమాండ్ చేసింది.కాంగ్రెస్ ఎర్నాకులం యూనిట్ అధ్యక్షుడు మహమ్మద్ షియాస్ (Mohammed Shias) ఘాటుగా స్పందిస్తూ, వినాయకన్ ప్రవర్తన నియంత్రణ తప్పుతోందని చెప్పారు. అతడిని వెంటనే అడిక్ట్‌గా పరిగణించి, ప్రభుత్వమే చికిత్స అందించాలని అన్నారు. వినాయకన్ ఇప్పుడు సమాజానికి తలనొప్పిగా మారాడు అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మాటలు సామాన్యులను కూడా ఆలోచనలో ముంచుతున్నాయి.వినాయకన్ ఫేస్‌బుక్‌లో చేసిన పోస్టులు, కేజే యేసుదాస్, అదూర్ గోపాలకృష్ణన్ వంటి ప్రముఖులను అవమానించాయని షియాస్ ఆరోపించారు. ఇది మామూలు వ్యవహారం కాదు. అతని ప్రవర్తన వెనుక మాదకద్రవ్యాల దుర్వినియోగమే కారణం” అని అన్నారు. ఇది ఒక నటుడిపై వచ్చిన చాలా తీవ్రమైన ఆరోపణగా మారింది.

చివరికి క్షమాపణ చెప్పిన నటుడు
వివాదాలు ఎక్కువవడంతో వినాయకన్ ఇటీవల క్షమాపణలు కూడా చెప్పారు. తన పోస్ట్‌లు బాధ కలిగించాయనుకుంటే సారీ అంటూ వ్యాఖ్యానించారు. అయినా, అప్పటికే నష్టం జరిగిపోయింది. యూత్ కాంగ్రెస్ నేత ఎన్.ఎస్. నుస్సూర్ ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఇదే మొదటిసారి కాదు. కేరళ మాజీ సీఎం ఉమెన్ చాందీ మరణించినప్పుడు, వినాయకన్ వేసిన పోస్ట్ తీవ్ర విమర్శలకు గురైంది. అయితే, చాందీ కుమారుడు ఆ సమయంలో న్యాయ చర్యలకు వెళ్లద్దని కోరడంతో ఆ వివాదం సద్దుమణిగింది. ఇప్పుడు పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది.
అప్పార్ట్మెంట్‌లో అసభ్య ప్రవర్తన?
వినాయకన్‌పై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాల్కనీ నుంచి అసభ్యంగా ప్రవర్తించడం, ఇరుగుపొరుగు వారిని దూషించడం వంటి ఆరోపణలు బయటకు వచ్చాయి. ఈ వ్యవహారంపై పలువురు నివేదికలు ఇచ్చినట్టు సమాచారం. రాజకీయ నాయకుడు అధికారికంగా ఇతడు ప్రభుత్వ చికిత్సకు అర్హుడు అని చెప్పడం మాత్రం ఇప్పుడు తొలిసారి.1995లో సినీ రంగ ప్రవేశం చేసిన వినాయకన్, 2016లో ‘కమ్మటిపాదం’ చిత్రానికి కేరళ రాష్ట్ర ఉత్తమ నటుడి అవార్డు గెలుచుకున్నారు. కానీ ‘జైలర్’ చిత్రంలో నటించి దేశవ్యాప్తంగా పాపులర్ అయినా, వ్యక్తిగత ప్రవర్తన కారణంగా తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ప్రజలు అభిమానాన్ని వదిలి విమర్శలకే ఎక్కువ స్పేస్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
ప్రభుత్వానికి కాంగ్రెస్ డిమాండ్ ఏంటంటే…
కాంగ్రెస్ నేతలు కేరళ ప్రభుత్వాన్ని కోరుతోంది – ఇతడి ప్రవర్తన పబ్లిక్ న్యూసెన్స్‌గా మారుతోంది. ప్రభుత్వం స్వయంగా ఆయనకు చికిత్స ఏర్పాటు చేయాలి. అప్పుడే సమాజానికి ఉపశమనం లభిస్తుంది. ఇది దేశంలోనే ఓ ప్రముఖ నటుడిపై వచ్చిన అత్యంత తీవ్రమైన డిమాండ్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
Read Also : rape case : బస్సులో విదేశీ యువతిపై అత్యాచారం