Congress is ready to give MLC.. CPI Narayana

ఎమ్మెల్సీ ఇవ్వడానికి కాంగ్రెస్ సిద్దంగానే ఉంది : సీపీఐ నారాయణ

హైదరాబాద్‌: ఎన్నికలకు ముందే కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం సీపీఐకి ఎమ్మెల్సీ సీటు ఇచ్చేందుకు తెలంగాణ కాంగ్రెస్ సిద్ధంగానే ఉందని సీపీఐ నేత నారాయణ స్పష్టం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకత్వానికి మా అభిప్రాయాన్ని వివరించామని అన్నారు. వారు కూడా సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఇటీవల అగ్రరాజ్యమైన అమెరికాకు అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ విధానాలు ప్రపంచానికి ప్రమాదకరంగా మారాయని అన్నారు. ట్రంప్ విధానాలను ప్రధాని మోడీ వ్యతిరేకించాలని అన్నారు. మరోవైపు ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని సీపీఐ బృందం కలిసింది.

Advertisements
ఎమ్మెల్సీ ఇవ్వడానికి కాంగ్రెస్ సిద్దంగానే

ఇప్పుడైనా ఎమ్మెల్యే కోటాలో ఒకటి

స్వయంగా ఆయన నివాసంలో కలిసి రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు. పొత్తు ధర్మంలో భాగంగా తమకు రెండు ఎమ్మెల్సీ పదవులను కాంగ్రెస్ ఇవ్వాల్సి ఉందని, అందులో ఒకటి ఎమ్మెల్యే కోటాలో ఇవ్వాలని కోరారు. గతంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీలో రెండింటిలో ఒకటి సీపీఐకి ఇవ్వాల్సి ఉన్నప్పటికీ.. కాంగ్రెస్ ఇవ్వలేకపోయారు. ఇప్పుడైనా ఎమ్మెల్యే కోటాలో ఒకటి, ఆ తర్వాత మరొక ఎమ్మెల్సీ తమకు ఇవ్వాలని అడిగారు. సీఎంతో భేటీ అనంతరం ఆ పార్టీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు మాట్లాడుతూ.. ఎమ్మెల్సీల కేటాయింపు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీతో మాట్లాడి నిర్ణయం చెబుతాను అన్నారని కూనంనేని స్పష్టం చేశారు.

Related Posts
అక్రమ తవ్వకాలపై ఉక్కుపాదం మోపాలి : రేవంత్ రెడ్డి
Iron feet should be imposed on illegal mining.. Revanth Reddy

హైదరాబాద్‌: ఇసుక, ఖనిజాల అక్రమ తవ్వకాలపై ఉక్కుపాదం మోపాలని అధికారులను తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వం చేపట్టే పనులకు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీజీఎండీసీ) నుంచే Read more

ఐఈఈఈ జీఆర్ఎస్ఎస్ ఎస్ వై డబ్ల్యు 2024 ను నిర్వహించిన కెఎల్‌హెచ్‌ అజీజ్ నగర్
KLH Aziz Nagar organized IEEE GRSS SYW 2024

న్యూఢిల్లీ : హైదరాబాదులోని కెఎల్‌హెచ్‌ డీమ్డ్ టు బి యూనివర్సిటీ, ఐఈఈఈ జియోసైన్స్ మరియు రిమోట్ సెన్సింగ్ సొసైటీ (జీఆర్ఎస్ఎస్) స్టూడెంట్ , యంగ్ ప్రొఫెషనల్ మరియు Read more

నీతా అంబానీ పిల్లల కోసం ఉచిత వైద్య సేవలకు ప్రతిజ్ఞ
nita ambani

నీతా అంబానీ, సర్ హెచ్. N. రిలయన్స్ ఫౌండేషన్‌లో చైల్డ్రన్స్ డేను ఆనందంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా, పిల్లల ఆరోగ్య సేవలను మెరుగుపరచడంలో రైలయన్స్ ఫౌండేషన్ తన Read more

జాగెల్ ఫీచర్ ప్యాక్డ్ మైలేజ్ థింక్ గ్యాస్ విడుదల
Jagel feature packed mileage think gas release

హైదరాబాద్ : స్వచ్ఛమైన ఇంధన పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి మరియు అసాధారణమైన కస్టమర్ అనుభవాలను అందించడానికి కట్టుబడి ఉండటంతో పాటుగా, దాని ఫీచర్ ప్యాక్డ్ మైలేజ్+ CNG Read more

×