కులగణన (Caste Census) అంశంపై కాంగ్రెస్ పార్టీ (Congress Party) ముసుగులో వ్యతిరేకత చూపుతోందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ఆరోపించారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో జనగణనలో కులాల వారీగా లెక్కలు ఎందుకు నమోదు చేయలేదో ఆ పార్టీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో అవకాశం ఉన్నప్పటికీ అలాంటి గణనకు దూరంగా ఉండటమే కాంగ్రెస్ అసలైన వైఖరిని బయటపడుస్తోందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కులగణన సర్వేలో తారతమ్యాలు, తప్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆయన విమర్శించారు.
కులగణన శాస్త్రీయ పద్ధతుల్లో, పారదర్శకంగా నిర్వహించబోతుంది
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే కులగణన మాత్రం శాస్త్రీయ పద్ధతుల్లో, పారదర్శకంగా నిర్వహించబడుతుందని బండి సంజయ్ తెలిపారు. ఈ గణన ద్వారా కులాల వారీగా ఖచ్చితమైన డేటా లభించే అవకాశం ఉందని, ఆ డేటా ఆధారంగా రిజర్వేషన్ల విధానంలో న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవచ్చని అన్నారు. ఇది సామాజిక సమతుల్యతకు మార్గదర్శకంగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Read Also : Caste Census : కులగణన అంశంపై ఒవైసీ స్పందన
మోదీ సర్కార్ దైర్యంగా తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం
దేశవ్యాప్తంగా కులగణన చేపట్టే నిర్ణయం మోదీ సర్కార్ దైర్యంగా తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంగా పేర్కొన్నారు బండి సంజయ్. ఇది దేశ ప్రజల సంక్షేమానికి, ముఖ్యంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ఉపయోగపడే చర్యగా భావిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మాటలకంటే చేతల్లో నమ్మకముందా అనే ప్రశ్నను ప్రజలు చర్చించుకోవాలని సూచించారు. కులగణన ద్వారా ప్రతి వర్గానికి న్యాయం చేయాలన్నదే కేంద్ర ప్రభుత్వ సంకల్పమని ఆయన స్పష్టం చేశారు.