Congress CLP meeting tomorrow.. Discussion on four issues!

Congress CLP Meeting : రేపు కాంగ్రెస్ సీఎల్పీ మీటింగ్.. నాలుగు అంశాలపై చర్చ!

Congress CLP Meeting : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. శంషాబాద్‌లోని నోవాటెల్‌లో ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ విప్ లు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సమాచారం ఇచ్చారు. ఈ సమావేశంలో నాలుగు కీలకమైన అంశాలపై ప్రధానంగా చర్చ జరగనున్నట్లు ఆ పార్టీ తెలిపింది. భూ భారతి, ఎస్సీ వర్గీకరణ, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లపై చర్చ జరగనుంది. ఇటీవల ప్రభుత్వం వరుసగా పలు ప్రతిష్టాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. దేశంలో మరెక్కడా లేని విధంగా రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ, ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తూ జీవో జారీ చేసింది.

Advertisements
 రేపు కాంగ్రెస్ సీఎల్పీ మీటింగ్

ఈ సీఎల్పీ సమావేశంలో దిశానిర్దేశం

ధరణి రద్దు చేసి భూ భారతిని ఈరోజు నుంచి అమలులోకి తీసుకురాబోతున్నది. ఈ అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడంపై సీఎం ఈ సీఎల్పీ సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నట్ల తెలుస్తోంది. అలాగే ఏఐసీసీ అగ్రనేతలతో రాష్ట్రంలో భారీ బహిరంగ సమావేశాల నిర్వహించడంపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. ఇదే సమయంలో తాజాగా మంత్రి వర్గ విస్తరణపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ విషయంలో సీఎం ఎవైనా డైరెక్షన్స్ ఇస్తారా అనేది ఉత్కంఠగా మారింది.

Read Also : పార్క్‌ హయత్‌ హోటల్‌లో అగ్ని ప్రమాదం

Related Posts
దీపికా పదుకొణె కీలక వ్యాఖ్య‌లు
దీపికా పదుకొణె కీలక వ్యాఖ్య‌లు

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప్ర‌తి ఏటా నిర్వ‌హించే 'ప‌రీక్షా పే చ‌ర్చ' కార్య‌క్ర‌మంలో ఈసారి బాలీవుడ్ న‌టి దీపికా పదుకొణె పాల్గొన్న విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా Read more

Afsar: కలకలం సృష్టించిన బంజారాహిల్స్ లో కాల్పులు
Afsar: కలకలం సృష్టించిన బంజారాహిల్స్ లో కాల్పులు

అర్థరాత్రి వేళ ఓపెన్ టాప్ జీపులో తుపాకీ ప్రదర్శన – యువకుల అరెస్ట్ హైదరాబాద్‌లో సంచలనం రేపిన ఓ ఘటనలో ఓపెన్ టాప్ జీపులో తుపాకీతో హల్ Read more

తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖల వివాదం – బీజేపీ ఎంపీ అల్టిమేటం!
తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖల వివాదం – బీజేపీ ఎంపీ అల్టిమేటం!

తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను టీటీడీ అధికారులు పరిగణలోకి తీసుకోవడం లేదని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మండిపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబు సైతం లేఖలను Read more

‘రైతు భరోసా’ కోసం కోకాపేట భూముల తాకట్టు?
Pledge of Kokapet lands for

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకానికి కావలసిన నిధులను సమకూర్చేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. కోకాపేట మరియు రాయదుర్గ ప్రాంతాల్లోని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×