commercial gas cylinder pri

కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర పెంపు

commercial gas cylinder price hike
commercial gas cylinder price hike

న్యూఢిల్లీ: వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్‌ ధరను దేశీయ చమురు సంస్థలు పెంచాయి. 19 కేజీల సిలిండర్‌పై ఏకంగా రూ.48.50 మేర పెరిగింది. ఈ మేరకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మంగళవారం ఉదయం ప్రకటించాయి. పెరిగిన ధరలు నేటి నుంచి అంటే అక్టోబర్‌ 1 నుంచే అమల్లోకి రానున్నట్లు వెల్లడించాయి.

ధరల పెంపు తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1,691 నుంచి రూ.1740కి పెరిగింది. కోల్‌కతాలో రూ.1,802 నుంచి రూ.1,850.50కి, ముంబైలో రూ.1,644 నుంచి రూ.1,692.50కి, చెన్నైలో రూ.1,855 నుంచి రూ.1,903కి పెరిగాయి. స్థానిక పన్నుల ఆధారంగా రాష్ట్రాలను బట్టి ధరల్లో మార్పులు ఉంటాయి. కాగా అంతకుముందు సెప్టెంబర్ 1, ఆగస్టు 1న కూడా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను కంపెనీలు పెంచాయి.

ఇక 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదని, పాత ధరలే యథాతథంగా కొనసాగుతాయని చమురు కంపెనీలు స్పష్టం చేశాయి. ప్రతి నెల 1వ తేదీన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ధరలను సవరిస్తుంటాయి. అందులో భాగంగా ఇవాళ కూడా సవరించిన ధరలను ప్రకటించాయి.

Related Posts
స్టాక్ మార్కెట్‌లో దూసుకుపోతున్న అదానీ షేర్లు
adani

వరుసగా మూడో రోజు గురువారం భారత స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ వేగంగా ప్రారంభమైంది. అమెరికా నుంచి వచ్చిన ఓ వార్త ప్రభావం బిలియనీర్ గౌతమ్ అదానీ కంపెనీల Read more

కేసీఆర్ చిత్ర‌ప‌టానికి కేటీఆర్ పాలాభిషేకం
ktr kcr

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్షకు దిగి నేటితో 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీఆర్‌ఎస్‌ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా Read more

మరికాసేపట్లో ఏపీ క్యాబినెట్ భేటీ
ap cabinet meeting 1

సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈరోజు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఇప్పటికే ప్రకటించిన ఉచిత గ్యాస్ సిలిండర్లు, చెత్తపై పన్ను రద్దు నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది. Read more

మధ్య తరగతి ప్రజలకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్
Revanth Sarkar is good news

తెలంగాణ ప్రభుత్వం పేదల కోసం ఇందిరమ్మ గృహ నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రేపటి నుంచి (డిసెంబర్ 6) పదిరోజుల పాటు గ్రామాల్లో లబ్ధిదారులను గుర్తించనున్నట్లు గృహనిర్మాణ Read more