చిత్రసీమలో ప్రేమ వివాహాలు , విడాకులు కామన్. చిత్ర షూటింగ్ సమయంలో దగ్గరవడం , ఆ తర్వాత ప్రేమలో పడడం, బంధువులు , సినీ ప్రముఖుల సమక్షంలో ఒకటివ్వడం , ఆ తర్వాత కొంతకాలానికే విడాకులు తీసుకోవడం సర్వసాధారణం. ఇప్పటికే ఎంతో మంది ఆలా ప్రేమ వివాహం చేసుకొని , విడాకులు తీసుకోని మరో పెళ్లి చేసుకున్న వారు ఉన్నారు. తాజాగా హీరోయిన్ ‘కలర్స్’ స్వాతి విడాకులు తీసుకునేందుకు సిద్ధమయినట్లు ప్రచారం జరుగుతుంది. దీనికి ఉదాహరణ సోషల్ మీడియాలో భాగస్వామి ఫొటోలను డిలీట్ చేయడమే. సెలబ్రిటీల విడాకులకు హింట్ గా నెటిజన్లు భావిస్తున్నారు. తాజాగా హీరోయిన్ ‘కలర్స్’ స్వాతి ఆ విధంగానే వార్తల్లో నిలిచారు.
మొదటి సినిమాతోనే మంచి హిట్ ను అందుకున్న ఈ చిన్నది.. ఆ తరువాత వరుస సినిమాలలో నటించి మెప్పించింది. గోల్కొండ హై స్కూల్, స్వామి రారా, కార్తికేయ, త్రిపుర లాంటి హిట్ సినిమాల్లో నటించిన స్వాతి .. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే వికాస్ వాసు అనే ఫైలెట్ ను పెళ్లి చేసుకొని చిత్రసీమకు దూరమైంది. ఈ మధ్యనే పంచతంత్రం అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఇక దీని తరువాత సాయి ధరమ్ తేజ్ తో కలిసి సత్య అనే సాంగ్ చేసింది. ఈ సాంగ్ మంచి విజయాన్ని అందుకుంది. ఇదిలా ఉంటె గత కొన్నేళ్లుగా స్వాతి భర్తకు విడాకులు ఇచ్చిందన్న వార్తలు ప్రచారం అవుతూనే ఉంది. ఆ వార్తలకు ఆజ్యం పోస్తూ ఇన్స్టాగ్రామ్ లో తన భర్తకు సంబంధించిన ఫోటోలను డిలీట్ చేసింది. అంతే కాదు సోషల్ మీడియా లో అతడిని ఆన్ ఫాలో చేయడం తో స్వాతి విడాకులు తీసుకోబోతున్నట్లు అంత ఫిక్స్ అవుతున్నారు. ఇప్పటి వరకు స్వాతి లేదా ఆమె భర్త విడాకులపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరి ఇప్పుడేమైనా స్పందిస్తారా అనేది చూడాలి.