కర్ణాటక రాజధాని బెంగళూరులో చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట (Stampede ) ఘటన రాష్ట్రాన్ని హల్చల్ చేసింది. RCB (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) జట్టు విజయాన్ని పురస్కరించుకుని నిర్వహించిన పరేడ్‌లో ఏర్పడిన భారీ రద్దీ క్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ముఖ్యంగా సీఎం పాలిటికల్ సెక్రటరీ కె. గోవిందరాజ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
గోవిందరాజను తొలగిస్తూ అధికారిక ఉత్తర్వులు
గోవిందరాజ “RCB గెలుపుపై పరేడ్ నిర్వహించవద్దని సీఎం సిద్ధరామయ్యకు ముందే సూచించాను కానీ ఆయన వినలేదు” అని మీడియాతో వ్యాఖ్యానించినట్టు వార్తలు వైరల్ అయ్యాయి. ఈ వ్యాఖ్యలు సీఎం ఆదేశాలను నిందించేలా ఉండటంతో ప్రభుత్వ వర్గాలు సీరియస్ అయ్యాయి. దీనికి ప్రతిగా గోవిందరాజను తన పదవి నుంచి తక్షణమే తొలగిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమలులోకి వస్తాయని అధికారులు తెలిపారు.
నేను అలాంటి వ్యాఖ్యలు చేయలేదు
అయితే తనపై వచ్చిన ఆరోపణలు తప్పుబట్టిన గోవిందరాజ, “నేను అలాంటి వ్యాఖ్యలు చేయలేదు. నా మాటలను వక్రీకరించారు” అని స్పందించారు. అయినప్పటికీ, ఇప్పటికే ఘటనపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిన నేపథ్యంలో ఆయన తొలగింపు నిర్ణయాన్ని ప్రభుత్వం రాజకీయంగా సమర్థించుకున్నట్లు తెలుస్తోంది. స్టేడియం ఘటనపై విపక్షాలు కూడా ప్రభుత్వాన్ని తీవ్రంగా ఎండగట్టడంతో, దానికి బలంగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకున్నట్టుగా విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Also : Narendra Modi : కెనడా ప్రధాని మార్క్ కార్నీ నుంచి మోదీకి ఫోన్ కాల్