CMs Chandrababu and Revanth Reddy congratulated Telugu people on Bhogi festival

తెలుగు ప్రజలకు భోగి పండుగ శుభాకాంక్షలు

హైదరాబాద్: తెలుగు వారి లోగిళ్లలో పెద్ద పండుగలలో సంక్రాంతి ఒకటి. మూడు రోజుల పండుగలో తొలి రోజు భోగిని పురస్కరించుకుని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి బండి సంజయ్ సహా పలువురు నేతలు తెలుగు ప్రజలకు భోగి శుభాకాంక్షలు తెలిపారు.

ఏపీ ప్రజలందరికి సీఎం చంద్రబాబు భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్రమైన ఈ భోగి పండుగ మీకు, మీ కుటుంబానికి కొత్త వెలుగులు తేవాలని, పాత బాధలు పోయి సానుకూల దృక్పథంతో జీవితంలో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భోగి మంటలతో మీ సమస్యలన్నీ తీరిపోయి మీకు భోగ భాగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తున్నాను. మీ ఆశలు, ఆశయాలూ తీర్చడానికి ప్రజాప్రతినిధులుగా మేం అన్ని వేళలా మీతోనే ఉంటామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. మీ అందరికి మరొక్క మారు భోగి పండుగ శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు.

image
image

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భోగి పండుగ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. పాత నిర్బంధపు చీకట్లను రూపుమాపుతూ, కొత్త కాంతులు పంచే భోగి మంటలు ప్రతి ఇంటా భోగభాగ్యాలు వెల్లివిరియాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ప్రజా పాలన తెచ్చిన మంచి మార్పులతో అన్ని వర్గాలకు అంతా మంచి జరగాలన్నారు.

ఈ భోగి పండుగ మీకు భోగభాగ్యాలను అందించాలి. మీ వాంఛితాలన్నీ తీరి అత్యున్నత భోగాలు మీ సొంతం కావాలి. ప్రాకృతిక మార్పులతో సూర్యసంక్రమణ వేళ పీడలన్నీ వదిలి సర్వం భోగమయం కావాలనీ ఆ అమ్మవారిని కోరుకుంటూ హిందూ బంధువులకు భోగి పండుగ శుభాకాంక్షలు. – కేంద్ర మంత్రి బండి సంజయ్

ఈ భోగి మీ జీవితంలో.. భోగ భాగ్యాలను తీసుకురావాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ భోగి పండగ శుభాకాంక్షలు తెలిపారు.

భోగి పండుగ మన అందరి జీవితాలలోకి భోగ భాగ్యాలని తీసుకురావాలని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ఆకాంక్షించారు. సంక్రాంతి పండుగ రోజున రంగుల ముగ్గుల్లాగా మన జీవితాలలో సంతోష హరివిల్లులు వెల్లువిరియాలి. కనుమ రోజు మనం కనే కలలన్నీ సాకారం చేయాలి. మనకి, ప్రకృతికి ఉన్న అవినాభవ సంబంధాన్ని సంక్రాంతి పండుగ గుర్తుచ్చేస్తుంది. సర్వేజనా సుఖినోభవంతు అంటూ భగవంతుణ్ణి కోరుకుంటూ తెలుగు ప్రజలకు ఆమె భోగి,సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు.

Related Posts
గుర్లలో డయేరియాపై నివేదిక
Diarrhea Disease in Viziana

విజయనగరం జిల్లాలో గుర్లలో తాగునీరు కలుషితం కావడం వల్ల డయేరియా వ్యాధి ప్రబలిందని నిపుణుల బృందం తేల్చింది. ఈ మేరకు వారు ప్రభుత్వం కోసం నివేదికను సిద్ధం Read more

దేశ ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్‌
The center is good news for the people of the country

ఉద్యోగుల్లా ప్రతి నెల పింఛన్ వచ్చే పథకానికి రూపకల్పన న్యూఢిల్లీ: ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగం చేస్తున్న వాళ్లకు వచ్చినట్టుగానే 60 ఏళ్లు దాటిన ప్రతి పౌరుడికి Read more

ఏపీకి వెళ్లిన ఐఏఎస్‌ల స్థానంలో ఇంఛార్జ్‌ల నియామకం
incharge ias in telangana

తెలంగాణ నుంచి రిలీవ్ అయిన పలువురు IAS అధికారుల స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంఛార్జులను నియమించింది. ఇటీవల డీవోపీటీ తెలంగాణ కేడర్‌లో కొనసాగుతున్న ఐఏఎస్‌లను ఏపీకి, ఏపీలో Read more

హీరో కిచ్చా సుదీప్ కు మాతృవియోగం
kiccha sudeep lost his moth

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది, ఆయన తల్లి సరోజా సంజీవ్ కన్నుమూశారు. వయసుతో సంబంధించిన అనారోగ్య సమస్యల కారణంగా కొన్ని Read more