saddula bathukamma

ట్యాంక్‌బండ్‌పై అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ..సీఎం రేవంత్ హాజరు

బతుకమ్మ పండుగ చివరి అంకానికి చేరింది. చివరిదైన తొమ్మిదో రోజును సద్దుల బతుకమ్మగా నిర్వహిస్తారు. ఈరోజు రకరకాల పూలతో బతుకమ్మను పేర్చుతారు. గౌరమ్మకు నువ్వులు, పెసర్లు, వేరుశెనగలు, బియ్యంతో చేసిన సత్తుపిండి, పెరుగన్నం, పులిహోరని భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సమర్పిస్తారు. మహిళలంతా ఆడిపాడిన తర్వాత బతుకమ్మను కాలువల్లో, కుంటల్లో, చెరువుల్లో నిమజ్జనం చేయనున్నారు.

తెలంగాణ వ్యాప్తంగా 9 రోజులుగా ఘనంగా సాగుతున్న బతుకమ్మ సంబురాలు నేటితో ముగియనున్నాయి. ఈ రోజు (గురువారం) రాష్ట్ర వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే సాయంత్రం హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద ప్రభుత్వం ఆధ్వర్యంలో అంబరాన్నంటేలా బతుకమ్మ సంబరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సంబురాల్లో ఏకంగా 10 వేల మంది మహిళలు పాల్గొనబోతునట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, అధికారులు పాల్లగొననున్నారు. కాగా.. సాయంత్రం 4 గంటలకు అమరవీరుల స్మారక చిహ్నం నుంచి ట్యాంక్‌బండ్ వరకు బతుకమ్మలతో మహిళల ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో రాత్రి 11 గంటల వరకు ట్యాంక్‌బండ్‌ సమీపంలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Related Posts
అల్పపీడనం ప్రభావం తో ఏపీలో వర్షాలు
imd warns heavy rains in ap and tamil nadu next four days

ఆంధ్రప్రదేశ్ ను వరుస వర్షాలు వదలడం లేదు. ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు పడగ..ఇప్పుడు శీతాకాలంలో కూడా వరుసగా వర్షాలు పలకరిస్తూనే ఉన్నాయి. Read more

52 ఏళ్ల మహిళ సముద్రంలో 150 కిమీ ఈత!
52 ఏళ్ల మహిళ సముద్రంలో 150 కిమీ ఈత!

ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలోని సూర్యరావుపేట తీరంలో 52 ఏళ్ల గోలి శ్యామల విశాఖపట్నం నుండి 150 కిలోమీటర్ల కఠినమైన ఈత కొట్టిన తరువాత సముద్రం నుండి బయటికి రావడంతో Read more

భోగి వేడుకల్లో కేటీఆర్‌, హరీశ్‌ రావు
KTR and Harish Rao in Bhogi celebrations

హైదరాబాద్‌: భోగి వేడుకల్లో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌ రావు పాల్గొన్నారు. ఎల్‌బీ నగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి సోమవారం తన నివాసంలో Read more

ఏపీ ఎక్కువ నీటిని తీసుకోకుండా అడ్డుకోవాలని చెప్పిన రేవంత్ రెడ్డి
ఏపీ ఎక్కువ నీటిని తీసుకోకుండా అడ్డుకోవాలని చెప్పిన రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఇటీవలివాడైన వ్యాఖ్యలలో కృష్ణా జలాల్లో రాష్ట్రం అన్యాయం ఎదుర్కొంటుందని అన్నారు. ఇటీవల కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి సీఆర్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *