CM Revanth Reddy : నేడు జపాన్‌కు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు. జపాన్‌లో జరిగే ఒసాకా–కన్సాయ్‌ ఎక్స్‌పో– 2025కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఐటీ శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హాజరుకానున్నారు. ఈ మేరకు వారు ఈరోజు(15వ తేదీ) అర్ధరాత్రి హైదరాబాద్‌ నుంచి బయల్దేరి వారు జపాన్‌ వెళ్తారు. వారి వెంట పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సీఎం కార్యాలయ అధికారి అజిత్‌రెడ్డి కూడా వెళ్తారని సమాచారం. ఈ నెల 13వ తేదీ నుంచి అక్టోబర్‌ 13వ తెదీ వరకు జరిగే ఈ ఎక్స్‌పోలో వివిధ దేశాల రాజకీయ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు పాల్గొంటారు. భారత్‌ నుంచి కూడా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, పారిశ్రామిక వేత్తలు పాల్గొననున్నట్లు సమాచారం.

Advertisements
నేడు జపాన్‌కు వెళ్లనున్న సీఎం

రూ.2.20 లక్షల కోట్ల పెట్టుబడులు

రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలను వివరించేందుకు ఒసాకా షోను వేదిక చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో దావోస్‌ వెళ్లిన రెండు దఫాల్లోనూ దాదాపు రూ.2.20 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి అవగాహన ఒప్పందాలు కుదర్చుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఒసాకా ఉత్సవంలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ కూడా పాల్గొంటారని సమాచారం.

ప్రభుత్వం ఏయే రంగాలకు ఎలాంటి ప్రోత్సాహకాలను అందిస్తుంది?

తెలంగాణలో ప్రభుత్వం ఏయే రంగాలకు ఎలాంటి ప్రోత్సాహకాలను అందిస్తుంది? ఇక్కడ ఉన్న పెట్టుబడి వాతావరణం, స్కిల్డ్, అన్‌స్కిల్డ్‌ లేబర్‌తోపాటు, విద్యుత్, నీటి సరఫరా, భూముల కేటాయింపు, అనుమతులు, రాయితీలు తదితర అంశాలపై రాష్ట్ర బృందం ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు తెలిసింది. గతంలో రాష్ట్రం నుంచి ఇలాంటి షోకేస్‌ చేసే ప్రయత్నం జరగలేదని ఓ ఉన్నతాధికారి తెలిపారు.

Read Also: నేడు కాంగ్రెస్ శాసన సభాపక్ష సమావేశం

Related Posts
మహారాష్ట్ర సీఎం పదవికి ఏక్‌నాథ్‌ షిండే రాజీనామా
Eknath Shinde resigns as Maharashtra CM

ముంబయి: మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి ఏక్‌నాథ్‌ షిండే రాజీనామా చేశారు. ఇవాళ ఉదయం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. షిండే వెంట Read more

దేశంలోనే తొలిసారి.. మహిళలతోనే ప్రధానికి భద్రత
For the first time in the country, the Prime Minister will be provided security with women

న్యూఢిల్లీ : రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా గుజరాత్‌ లోని నవ్‌సారీ జిల్లాలో నిర్వహించబోయే ఉమెన్స్‌ డే వేడుకలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ Read more

నుమాయిష్ ప్రారంభం వాయిదా
numaish exhibition hyderaba

హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జనవరి 1న ప్రారంభం కావాల్సిన నుమాయిష్ వాయిదా పడింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతితో ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏడు రోజుల Read more

ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌ వర్సెస్‌ న్యూజిలాండ్‌ గెలుపెవరిది?
ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌ వర్సెస్‌ న్యూజిలాండ్‌ గెలుపెవరిది?

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌లో భారత్ మరియు న్యూజిలాండ్ మధ్య పోరాటం క్రికెట్ లవర్స్‌కు ఓ ఉత్కంఠ రేకెత్తిస్తున్న మెగా ఇన్కౌంటర్ గా మారింది. ఈ మ్యాచ్‌లో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×