CM Revanth Reddy meet the collectors today

నేడు కలెక్టర్లతో సీఎం రేవంత్‌ రెడ్డి భేటి

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు జిల్లా కలెక్టర్లతో సమావేశం కానున్నారు. సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టర్లతో భేటీ అయి రైతు భరోసా, రేషన్‌ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లతో జిల్లాల్లో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులపై చర్చించనున్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పలు పథకాలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.

image
image

కాగా, ఈ నెల 4న తెలంగాణ కేబినేట్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రైతు భరోసాకు ఆమోద ముద్ర వేశారు. రైతు భరోసా వ్యవసాయయోగ్యమైన భూములకు ఇస్తామని ప్రకటించారు. దీంతో ఈ పథకం అమలు తీరుపై ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. అలాగే 26 తేదీ నుంచి అమలు చేయనున్న రైతుభరోసా, రేషన్‌ కార్డుల పంపిణీ, భూమి లేని వ్యవసాయ రైతు కూలీల కుటుంబాలను గుర్తించడం వంటి పలు అంశాలపై చర్చించనున్నారు.

మరోవైపు ఇందిరమ్మ ఇండ్ల పథకం మొదటి విడతలో స్థలం ఉన్నవారికే మంజూరు చేయనున్నట్టు గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టంచేశారు. రెండో దశలో జాగ లేనివారికి జాగ ఇచ్చి ఇల్లు మంజూరు చేస్తామని వెల్లడించారు. మొదటి విడతలో దివ్యాంగులు, ఒంటరి మహిళలు, అ నాథలు, వితంతువులు, ట్రాన్స్‌జెండర్లు, సఫాయి కర్మచారీలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. దీంతో జగలేని నిరుపేదలు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు.

Related Posts
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మహిళా హోమ్ గార్డు అరెస్ట్
Female home guard arrested

వేములవాడ : సంపన్నులను టార్గెట్ చేసి వలపు వల విసిరి బ్లాక్ మెయిల్ చేస్తూ పెద్దమొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్న హోమ్ గార్డు వడ్ల అనూషను పోలీసులు అరెస్ట్ Read more

నేడు జాతీయ యువజన దినోత్సవం
నేడు జాతీయ యువజన దినోత్సవం

1984లో, భారత ప్రభుత్వం జాతీయ యువజన దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించింది. అప్పటి నుండి ఈ వేడుక స్వామి వివేకానంద బోధనలు, తత్వశాస్త్రాలను గుర్తు చేస్తూ యువతకు ప్రేరణగా Read more

ఫ్రీ బస్ వల్లే మహిళలకు గౌరవం తగ్గిందా?
women free bus

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ఇటీవల అమలు చేసిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంపై ప్రయాణికుల నుంచి భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. ఒకవైపు Read more

కేసీఆర్‌కి సవాల్ విసిరిన సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy challenged KCR

సర్వే ఏ గ్రామంలో, ఏ వార్డులో తప్పు ఉందో చూపించాలి హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నిజామాబాద్‌లో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ Read more