CM Revanth Reddy will go to Maharashtra today

నేడు వేములవాడకు సీఎం రేవంత్‌ రెడ్డి..పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

హైదరాబాద్‌: సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు వేములవాడ పర్యటనకు వెళ్లనున్నారు. మొదట వేములవాడ రాజన్నను దర్శించుకుని ప్రత్యేకపూజలు చేయనున్న సీఎం.. అనంతరం స్థానికంగా రూ.127 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అదే సమయంలో పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొని ప్రసంగిస్తారు. కాగా.. ఈ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఉండనున్నారు. సీఎం పర్యటనకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.

Advertisements

ప్రధానంగా రాష్ట్ర దేవదాయ శాఖా మంత్రి కొండా సురేఖ కూడా పర్యటనలో పాల్గొననున్నారు. ఆమె కూడా సీఎంతో కలిసి రాజన్నను దర్శించుకుని ప్రత్యేకపూజలు చేయనున్నారు. అనంతరం అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతారు. చివరిగా బహిరంగసభలో పాల్గొంటారు. ఇదిలా ఉంటే ఇప్పటికే వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.127.65 కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే.

కాగా, సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారి వేములవాడలో బుధవారం పర్యటిస్తున్నారు. అందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రత్యక్ష పర్యవేక్షణలో సీఎం పర్యటనను సక్సెస్ చేసే పనిలో పార్టీ శ్రేణులు నిమగ్నమయ్యారు. మంత్రులతో కలిసి సీఎం వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని రూ.127 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. సిరిసిల్ల ఎస్పీ కార్యాలయాన్ని వర్చువల్ గా ప్రారంభిస్తారు. జిల్లాకు వస్తున్న సీఎం వరాల జల్లు కురిపిస్తారని వేములవాడకు మహార్దశ రానున్నదని స్థానిక నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Related Posts
నేడు మిర్చి యార్డ్, ట్రేడర్లతో సీఎం భేటీ
CM Chandrababu meet with Mirchi yard and traders today

మిర్చి ధరల పతనంతో తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంఅమరావతి: మిర్చి ధరలు పడిపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇక, పాలక, ప్రతిపక్ష నేతల ఎంట్రీతో.. మిర్చి ధరలకు రాజకీయరంగు Read more

మంత్రి పై ప‌రువు న‌ష్టం దావా.. రేపు కోర్టుకు హాజరుకానున్న నాగార్జున
Defamation suit against Konda Surekha. Nagarjuna to appear in court tomorrow

హైదరాబాద్‌: త‌న కుటంబం వ్య‌వ‌హారంలో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్య‌ల‌పై హీరో అక్కినేని నాగార్జున దాఖలు చేసిన ప‌రువున‌ష్టం పిటిష‌న్‌ను నాంప‌ల్లి కోర్టు ఇవాళ విచారించింది. Read more

మారిషస్ మాజీ ప్రధాని అరెస్ట్
Former Prime Minister of Mauritius Pravind Jugnauth arrested

ఆయన హయాంలో ఆర్థిక అవకతవకలు జరిగినట్టు గుర్తింపు పోర్ట్ లూయిస్ : మారిషస్‌ మాజీ ప్రధాని ప్రవింద్‌ జగన్నాథ్‌ మనీ లాండరింగ్‌ కేసులో అరెస్టయ్యారు. ఆయన నివాసంలో Read more

బంగారం కోసం అమ్మమ్మను హత్య చేసిన మనవడు
బంగారం కోసం అమ్మమ్మను హత్య చేసిన మనవడు

సంగారెడ్డి జిల్లాలో జరిగిన దారుణ ఘటనలో, 26 ఏళ్ల యువకుడు తన అమ్మమ్మను హత్య చేశాడు. నిజాంపేట మండలంలోని ఖానాపూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రాథమిక Read more

×