CM Revanth Reddy's key decision on February 4!

ఫిబ్రవరి 4వ తేదీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం !

ఏటా ఫిబ్రవరి 4న తెలంగాణ సామాజికన్యాయ దినోత్సవం

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏడాది ఫిబ్రవరి 4వ తేదీన “తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవం”గా ప్రకటిస్తూ సీఎస్​ శాంతికుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 ఫిబ్రవరి 4న రాష్ట్ర కేబినెట్ సమావేశంలో బీసీ కులగణన చేపట్టాలని తీర్మానం చేసింది. ఈ ప్రక్రియలో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరి 4న అసెంబ్లీలో బీసీ కులగణనకు సంబంధించి చర్చించి, కీలక వివరాలను వెల్లడించారు.

Advertisements
ఫిబ్రవరి 4వ తేదీపై సీఎం

ఫిబ్రవరి 4న రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు

రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల జనాభా, వారి ఆర్థిక-సామాజిక పరిస్థితుల గురించి స్పష్టమైన అవగాహన పొందడానికి ఈ కులగణన ఎంతో కీలకమని ప్రభుత్వం భావించింది. అందులో భాగంగానే ఫిబ్రవరి 4న తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవంగా జరపాలని నిర్ణయించారు. ప్రతి ఏడాది ఫిబ్రవరి 4న రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

సామాజిక న్యాయంపై అవగాహన కార్యక్రమాలు, ఉపన్యాసాలు

ఆధ్యాత్మిక, సామాజిక-ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కులాల సర్వేలకు సంబంధించిన విధాన నిర్ణయాలు, షెడ్యూల్డ్ కులాల సబ్​ క్లాసిఫికేషన్​కు సంబంధించిన సిఫార్సులను ఆమోదించడం, సామాజిక న్యాయంపై అవగాహన కార్యక్రమాలు, ఉపన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం గుర్తింపు అవార్డులు, సంక్షేమ శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంక్షేమ శాఖ ఈ కార్యక్రమాలను సమన్వయం చేయనుంది. ప్రభుత్వంలోని అన్ని సంక్షేమ శాఖలు ఈ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని, సామాజిక న్యాయ దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎస్ శాంతికుమారి పేర్కొన్నారు.

Related Posts
KTR : గచ్చిబౌలి భూముల వ్యవహారం..ప్రధానికి కేటీఆర్ విజ్ఞప్తి
Gachibowli land issue..KTR appeals to the Prime Minister

KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గచ్చిబౌలి భూముల వ్యవహారం పై ప్రధాని మోడీకి కీలక విజ్ఞప్తి చేశారు. ప్రధానిగా పర్యావరణంపై చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన సమయమిదన్నారు. Read more

చెన్నైలో భారీ వర్షాలు
WhatsApp Image 2024 12 12 at 12.22.31

దక్షిణ కోస్తా, రాయలసీమలలో వర్షాలు పడే అవకాశం గల్ఫ్ ఆఫ్ మన్నార్ పరిసర ప్రాంతాలపై కేంద్రీకృతమై ఉన్న తీవ్ర అల్పపీడనం. దీని అనుబంధంగా మధ్య ట్రోపోఆవరణం వరకు Read more

14వ నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో 2024’’నుప్రకటించిన నారెడ్కో తెలంగాణ
Naredco Telangana has announced the 14th Naredco Telangana Property Show 2024

మూడు రోజుల ప్రాపర్టీ షో 2024 అక్టోబర్ 25న హైదరాబాద్ లోని హైటెక్స్ లో ప్రారంభం.. హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో అత్యంత ప్రజాదరణ పొందిన “నారెడ్కో తెలంగాణా Read more

బీజేపీ సభలో జేబుదొంగల బీబత్సం
midhun chakravarthi

ప్రముఖ సినీ నటుడు, బీజేపీ నేత మిథున్ చక్రవర్తికి ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారంలోచేదు అనుభవం ఎదురైంది. నిర్సా అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి తరఫున మిథున్ చక్రవర్తి Read more

×