Japan తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి బిజీబిజీగా పర్యటన కొనసాగిస్తున్నారు. మంగళవారం రాత్రి బెంగళూరులో నుండి బయలుదేరిన సీఎం బృందం బుధవారం మధ్యాహ్నం టోక్యో ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుంది. అక్కడి అధికారుల నుంచి ఘన స్వాగతం లభించింది. ఈ పర్యటన ఈ నెల 22వ తేదీ వరకు కొనసాగనుంది. టోక్యో, మౌంట్ ఫుజి, ఒసాకా, హిరోషిమా నగరాలను సీఎం సందర్శించనున్నారు. ముఖ్యంగా వరల్డ్ ఎక్స్‌పో 2025లో తెలంగాణ పెవిలియన్‌ను ప్రారంభించనున్నారు. రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, సాంకేతిక సహకారాన్ని పెంపొందించడం ఈ పర్యటన ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. ప్రభుత్వ అంచనాల ప్రకారం ఈ పర్యటన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపనున్నది.
Japan : సీఎం రేవంత్ రెడ్డి కి ఘన స్వాగతం
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రైజింగ్ డెలిగేషన్‌కి Japan ని ఇండియన్ అంబాసిడర్ షిబూ జార్జ్ విందు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ విందులో డీఎంకే ఎంపీ కనిమొళి కరుణానిధి, మాజీ కేంద్ర మంత్రి నెపోలియన్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. టోక్యోలోని వంద సంవత్సరాల పాత భవనంలో ఈ సమావేశం జరిగింది. పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి వివిధ రంగాల పారిశ్రామిక వేత్తలతో సమావేశమై, తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వ ప్రోత్సాహక పథకాలు, రాయితీలను వివరించనున్నారు.
Read more : Bhubharathi : నేటి నుంచి ‘భూభారతి’ రెవెన్యూ సదస్సులు