CM Revanth Reddy.. Is this governance?: Bandi Sanjay

సీఎం రేవంత్‌ రెడ్డి.. ఇదేం పాలన ?: బండి సంజయ్

హైదరాబాద్‌: సీఎం రేవంత్‌ ఇదేం పాలన? అంటూ బండి సంజయ్ ఫైర్‌ అయ్యారు . తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో పనిచేసే ఔట్ సోర్సింగ్ శానిటేషన్ ఉద్యోగుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గం. పట్టణాల పరిశుభ్రతలో శానిటేషన్ సిబ్బంది పాత్ర అత్యంత కీలకం. కరోనా మహమ్మారి కాలంలో ప్రాణాలను ఫణంగా పెట్టి అందించిన సేవలు మరువలేనివి. దురదద్రుష్టమేమిటంటే ఆనాటి నుండి నేటి వరకు వేతనాలు పెంచాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదన్నారు.

సీఎం రేవంత్‌ రెడ్డి ఇదేం

ఉన్న వేతనాల్లో భారీగా కోత

పైగా మున్సిపల్ డ్రైవర్లు, వర్క్ ఇన్సెక్టర్లకు చెల్లిస్తున్న వేతనాలను తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం దుర్మార్గం. భారతీయ జనతా పార్టీ పక్షాన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం. ప్రతి ఏటా పెరిగే నిత్యావసర ధరలు, ఇతర ఖర్చులను ద్రుష్టిలో ఉంచుకుని ఉద్యోగుల జీత భత్యాలను పెంచడం పరిపాటి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు పెంచకపోగా ఉన్న వేతనాల్లో భారీగా కోత విధించడం ఎంత వరకు సమంజసం? అంటూ నిలదీశారు.

ఇది కాంగ్రెస్ ప్రభుత్వ మతిలేని చర్య

ఇప్పటి వరకు శానిటరీ ఇన్ స్పెక్టర్లకు నెల వేతనం రూ.22 వేలు చెల్లిస్తుండగా, ఆ వేతనాన్ని రూ.16,600లకు తగ్గించడం దుర్మార్గం. అట్లాగే డ్రైవర్లకు సైతం ఇదే విధంగా కోత విధించడం ఎంత వరకు న్యాయం? అని ఫైర్ అయ్యారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ మతిలేని చర్య. నాలుగేళ్లుగా ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు ఎందుకు పెంచడం లేదు? ఎమ్మెల్సీ ఎన్నికల్లో గుణపాఠం చెప్పినా తీరు మారదా? తక్షణమే ఔట్ సోర్సింగ్ సిబ్బందికి వేతనాలను పెంచండి అని బండి సంజయ్‌ అన్నారు.

Related Posts
నేడు ఏపీ కేబినేట్‌ మీటింగ్‌
AP Cabinet meeting today

అమరావతి: ఈరోజు ఏపీ కేబినేట్‌ మీటింగ్‌ జరుగనుంది. ఇవాళ ఉద‌యం 11 గంట‌ల‌కు సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. అమ‌రావ‌తిలో 20 వేల Read more

యూకేలో టెలికామ్ కంపెనీ వినూత్న ప్రయోగం: స్కామర్లను బంధించే AI ‘డైసీ’
ai granny

యూకేలోని ఒక టెలికామ్ కంపెనీ, స్కామర్లతో మాట్లాడడానికి మరియు వారి సమయాన్ని వృథా చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత "డైసీ" అనే వృద్ధ మహిళను ప్రారంభించింది…ఈ Read more

భారత రెజ్లింగ్ సమాఖ్యపై సస్పెన్షన్ ఎత్తివేత
Suspension lifted on Wrestling Federation of India

న్యూఢిల్లీ: క్రీడా మంత్రిత్వశాఖ భారత రెజ్లింగ్ సమాఖ్య పై ఉన్న సస్పెన్షన్‌ను మంగళవారం ఎత్తివేసింది. దేశీయ టోర్నమెంట్ల నిర్వహణ, అంతర్జాతీయ టోర్నమెంట్లకు జాతీయ జట్ల ఎంపిక నిమిత్తం Read more

కోటక్ మహీంద్రా, జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా భాగస్వామ్యం
A partnership between Kotak Mahindra and JSW MG Motor India

EV ఫైనాన్సింగ్ కోసం కోటక్ మహీంద్రా ప్రైమ్‌తో భాగస్వామ్యం చేసుకున్న JSW MG మోటార్ ఇండియా ● కోటక్ మహీంద్రా ప్రైమ్ లిమిటెడ్ (KMPL) EV కస్టమర్ల Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *